newssting
Radio
BITING NEWS :
ఏలూరు మాజీ ఎంపి మాగంటి బాబు కుమారుడు ఆత్మహత్యాయత్నం. అర్థరాత్రి విజయవాడ ఆంధ్రా ఆస్పత్రికి తరలింపు. ఐసీయూలో వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్న వైద్యులు. బ్రెయిన్ స్ట్రోక్ తో ఆస్పత్రిలో చేర్పించామని చెప్తున్న కుటుంబ సభ్యులు. 24 గంటలు గడిస్తే గానీ ఏమీ చెప్పలేమన్న వైద్యులు. * ఏపీ మునిసిపల్ ఎన్నికల్లో అత్యధిక ఏకగ్రీవాలు చేసిన వైసీపీ. వైసీపీ -570, టీడీపీ -5, బీజేపీ -1, ఇతరులు -2 ఏకగ్రీవాలు. * విశాఖలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం. విజయవాడ నుంచి విశాఖకు తరలనున్న కమాండ్ కంట్రోల్ రూమ్. విశాఖలోని ప్రభుత్వ భూమిలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు. * నెల్లూరు జాయింట్ కలెక్టర్ కార్యాలయ సిబ్బందిపై కేసు నమోదు. పదోన్నతి కల్పిస్తామని చెప్పి మోసం చేశారని అంగన్ వాడీ కార్యకర్త ఫిర్యాదు. జేసీ సీసీ శ్రీకాంత్, సిబ్బంది దయాకర్, వికాస్ పై కేసు నమోదు. జేసీ భార్య ఇంట్లో పనిచేయించుకుంటున్నారంటూ ఫిర్యాదు. కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని ఆందోళన. * రాజకీయాలపై సంచలన ప్రకటన చేసిన జయ నెచ్చెలి శశికళ. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన చిన్నమ్మ. శశికళ ప్రకటనతో నిరాశ చెందిన అభిమానులు. ఇది బీజేపీ స్క్రిప్ట్ అంటున్న శశికళ మద్దతుదారులు. * సీఎం జగన్ కు ఏపీ సీపీఎం కార్యదర్శి రామకృష్ణ లేఖ. రేపటి రాష్ట్ర బంద్ కు సహకరించాలని సీఎంకు వినతి. విశాఖ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బంద్ కు పిలుపునిచ్చిన సీపీఐ.

భారత్ నుంచి వారంరోజుల్లో 30 దేశాలకు కరోనా టీకాలు.. డబ్ల్యుహెచ్ఓ

23-02-202123-02-2021 09:57:37 IST
2021-02-23T04:27:37.056Z23-02-2021 2021-02-23T04:27:34.793Z - - 04-03-2021

భారత్ నుంచి వారంరోజుల్లో 30 దేశాలకు కరోనా టీకాలు.. డబ్ల్యుహెచ్ఓ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రపంచానికి అవసరమైన రకరకాల టీకాల తయారీ, నిల్వ, నిర్వహణ అంశాల్లో భారతీయ కంపెనీలు ఎంతో కృషి చేశాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ సౌమ్యా స్వామినాథన్‌ కొనియాడారు.  ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ కోవిడ్-19 నిరోధక టీకాలను అందజేయడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కోవాక్స్ వ్యవస్థ ద్వారా అన్ని దేశాలకు కరోనా టీకా సరఫరా చేబడుతున్నట్లు పేర్కొన్నారు.

కోవాక్స్‌తో సమన్వయ కృషి ఫలించిన కారణంగానే వారం రోజుల్లో 25 నుంచి 30 దేశాలకు కోవిడ్-19 వ్యాక్సిన్లు ఎగుమతి అవుతాయని డాక్టర్ సౌమ్యా విశ్వనాధన్ పేర్కొన్నారు. బయో ఆసియా–2021 సదస్సులో భాగంగా సోమవారం ‘ప్రపంచానికి టీకా వేయించడం.. భారత్‌ ప్రస్తుత స్థితి, భవిష్యత్‌ సమర్థత’ అంశంపై చర్చా కార్యక్రమంలో సౌమ్య పాల్గొన్నారు.

కోవాక్స్‌ కార్యక్రమం ప్రపంచ వ్యాప్తంగా విజయవంతం అయ్యేందుకు పెద్ద ఎత్తున ఆర్థిక వనరుల అవసరం ఉందని, 2021లోనే సుమారు 300 కోట్ల డాలర్ల నిధులు అవసరమని సౌమ్యా స్వామినాథన్‌ తెలిపారు. రానున్న కాలంలో పెద్ద ఎత్తున టీకా తయారీకి ప్రత్యేక కేంద్రాలు అవసరమవుతాయని, కోవాక్స్‌లో భాగమైన 199 దేశాలు కూడా తమవంతు పాత్ర పోషిస్తేనే తారతమ్యాలు, వివక్ష వంటివి లేకుండా అందరినీ టీకా ద్వారా కోవిడ్‌ నుంచి రక్షణ కల్పించొచ్చని డాక్టర్ సౌమ్యా విశ్వనాథన్ పేర్కొన్నారు. 

కోవాక్స్‌ ప్రయత్నాల ఫలితంగా ఇంకో వారంలోనే భారత్‌లోని సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా నుంచి పెద్ద ఎత్తున టీకాలు 25–30 దేశాలకు ఎగుమతి అవుతాయని తెలిపారు. రకరకాల టీకాల తయారీ, నిల్వ, నిర్వహణ అంశాల్లో భారతీయ కంపెనీలు ఎంతో కృషి చేశాయని చెప్పారు. రూపాంతరిత వైరస్‌లపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వాటిని సకాలంలో గుర్తించి జన్యుక్రమాలను నమోదు చేయడం ద్వారా నియంత్రించొచ్చని వివరించారు.

చిట్టచివరి వ్యక్తి కూడా టీకా వేయించుకోవాలసిందే.. యూనిసెఫ్

కోవిడ్-19 నిరోధక టీకా వేయించుకోనంతవరకు  ఈ ప్రపంచంలో ఎవరూ తాము సురక్షితంగా ఉన్నామని భావించడానికి వీల్లేదని యూనిసెప్ ప్రదాన సలహాదారు రాబిన్ నంది పేర్కొన్నారు. 2021 నాటికి కనీసం 200 కోట్ల కోవిడ్‌–19 వ్యాక్సిన్లను పంపిణీ చేయాలన్నది యునిసెఫ్‌ లక్ష్యమని వివరించారు. గతంలో కొత్త టీకాలు పేద దేశాలకు చేరేందుకు చాలా ఏళ్లు పట్టేదని, అలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా చూసేందుకు కోవాక్స్‌ వ్యవస్థ ఎంతగానో ఉపయోపడుతుందని చెప్పారు. 

కోవాగ్జిన్‌ సామర్థ్యానికి సంబంధించిన వివరాలను సకాలంలో అందివ్వలేకపోయామని భారత్‌ బయోటెక్‌ చైర్మన్‌ అండ్‌ ఎండీ కృష్ణ ఎల్లా పేర్కొన్నారు. ముక్కు ద్వారా పిచికారీ చేసే టీకా తొలి దశ ప్రయోగాలు ఈ వారం మొదలు అవుతాయని చెప్పారు. కోవాక్స్‌లో భాగస్వాములయ్యేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఏటా 4 కోట్ల టీకాలు తయారు చేసే సామర్థ్యం తమ వద్ద ఉందన్నారు.

కరోనా కేసుల అప్డేట్.. గత 24 గంటల్లో 14,199 మందికి కరోనా

ప్రభుత్వంపై భిన్నాభిప్రాయం ప్రకటించడం దేశద్రోహం కాదు.. సుప్రీంకోర్టు

ప్రభుత్వంపై భిన్నాభిప్రాయం ప్రకటించడం దేశద్రోహం కాదు.. సుప్రీంకోర్టు

   3 hours ago


కరోనా టీకాపై ఆంక్షల తొలగింపు.. ఇకపై 24 గంటలూ టీకా

కరోనా టీకాపై ఆంక్షల తొలగింపు.. ఇకపై 24 గంటలూ టీకా

   4 hours ago


ప్రాంతీయ భాషల్ని విస్మరిస్తే దేశానికి పెద్ద అన్యాయం.. ప్రధాని మోదీ

ప్రాంతీయ భాషల్ని విస్మరిస్తే దేశానికి పెద్ద అన్యాయం.. ప్రధాని మోదీ

   5 hours ago


కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న నిర్మలా సీతారామన్

కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న నిర్మలా సీతారామన్

   6 hours ago


తాజ్ మహల్ లో బాంబు పెట్టాను.. ఇంకొద్ది సేపట్లో..!

తాజ్ మహల్ లో బాంబు పెట్టాను.. ఇంకొద్ది సేపట్లో..!

   7 hours ago


కరోనా కేసుల అప్డేట్.. గత 24 గంటల్లో 17,407 మందికి కరోనా..!

కరోనా కేసుల అప్డేట్.. గత 24 గంటల్లో 17,407 మందికి కరోనా..!

   9 hours ago


ఫ్రెంచ్ యువ‌తిని రేప్ చేసిన ఢిల్లీ మ‌హిళ‌.. కేసు న‌మోదు

ఫ్రెంచ్ యువ‌తిని రేప్ చేసిన ఢిల్లీ మ‌హిళ‌.. కేసు న‌మోదు

   8 hours ago


రాసలీలల మంత్రిగారు.. రాజీనామా చేసేశారు

రాసలీలల మంత్రిగారు.. రాజీనామా చేసేశారు

   03-03-2021


హెచ్-1బీ వీసా ట్విస్ట్ ఇచ్చిన అమెరికా..!

హెచ్-1బీ వీసా ట్విస్ట్ ఇచ్చిన అమెరికా..!

   03-03-2021


కరోనా కేసుల అప్డేట్.. గత 24 గంటల్లో 14,989 మందికి కరోనా..!

కరోనా కేసుల అప్డేట్.. గత 24 గంటల్లో 14,989 మందికి కరోనా..!

   03-03-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle