newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న నిర్మలా సీతారామన్

04-03-202104-03-2021 15:44:51 IST
Updated On 04-03-2021 15:54:23 ISTUpdated On 04-03-20212021-03-04T10:14:51.490Z04-03-2021 2021-03-04T10:14:48.069Z - 2021-03-04T10:24:23.928Z - 04-03-2021

కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న నిర్మలా సీతారామన్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
భారతదేశంలో రెండో దశ వ్యాక్సినేషన్ లో 60  ఏళ్లుదాటినవారికి, 45 సంవత్సరాలు పైబడి, అనారోగ్యంతో ఉన్న వారికి వ్యాక్సిన్‌ అందిస్తున్నారు. ఇప్పటికే  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సహా పలు కేంద్ర మంత్రులు,  కొన్ని  రాష్ట్రాల ముఖ్యమంత్రులు టీకాను వేయించుకున్నారు.  తాజాగా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్  కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్నారు. ఢిల్లీ వసంత కుంజ్ లోని ఫోర్టిస్ ఆసుపత్రిలో గురువారం నిర్మలా సీతారామన్ కోవిడ్‌ వ్యాక్సిన్‌ తొలి డోస్‌ను స్వీకరించారు.  తనకు టీకా వేసిన నర్స్‌ రమ్యకు థ్యాంక్స్‌ చెప్పారు. వ్యాక్సిన్‌ అభివృద్ధి, పంపిణీ, సరైన సమయంలో, సరసమైన ధరలో  టీకా లభిస్తున్న భారతదేశంలో పుట్టడం తన అదృష్టం అంటూ  ట్వీట్‌  చేశారు. 

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ గురువారం కోవిడ్‌ వాక్సిన్‌ తీసుకున్నారు. ఢిల్లీలోని ఎల్‌ఎన్‌జెపి ఆసుపత్రిలో వ్యాక్సిన్‌  మొదటి మోతాదును స్వీకరించారు. ప్రజలందరూ ముందుకు వచ్చి టీకా తీసుకోవాలని ఆయన కోరారు. ఢిల్లీ సీఎంతో పాటు, ఆయన తల్లి దండ్రులు కూడా వ్యాక్సిన్‌ తీసుకున్నారు. 

కరోనా వ్యాక్సిన్ ను తీసుకున్న ప్రముఖుల్లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్, ‌మేఘాలయ గవర్నర సత్యపాల్‌ సింగ్‌, కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి, అతని భార్య లక్ష్మి సహా, ఇతర రాజకీయ ప్రముఖులు వాక్సిన్‌  అందుకున్నారు. అలాగే క్రికెట్‌ దిగ్గజం భారత మాజీ కెప్టెన్‌ కపిల్ ‌దేవ్‌, ఫుట్‌బాల్‌ దిగ్గజం పీలే, సీనీ రంగ ప్రముఖుడు చారుహాసన్‌, సీరం ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌, సీరంసీఈవో భార్య నటాషా పూనావాలా ఉన్నారు. మరికొందరు ప్రముఖులు కూడా కరోనా వ్యాక్సిన్ ను తీసుకున్నారు. కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని ప్రచారంలో ఉన్న వదంతులను పట్టించుకోకుండా ఉండాలని పలువురు ప్రముఖులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వ్యాక్సిన్ వేయించుకుంటేనే భారత్ నుండి కరోనా మహమ్మారిని తరిమేయగలమని అన్నారు. 

మొదటి దశలో  ఫ్రంట్‌లైన్, ఆరోగ్య కార్యకర్తలకు వ్యాక్సిన్‌ను అందించగా, రెండో దశలో 60 ఏళ్లు పైబడిన వారికి, 45 ఏళ్లు పైబడి ఇతర అనారోగ్యంతో బాధపడుతున్నవారికి కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ అందిస్తున్నారు. 

https://twitter.com/nsitharaman/status/1367369840701239296

అనుమతి లేకుండా భారత సముద్ర జలాల్లో యుఎస్ నేవీ ఆపరేషన్.. పెంటగాన్ సమర్థన

అనుమతి లేకుండా భారత సముద్ర జలాల్లో యుఎస్ నేవీ ఆపరేషన్.. పెంటగాన్ సమర్థన

   9 hours ago


ఒకే రోజు లక్షా 45 వేల కేసులు.. ప్రాణాలకే ప్రమాదమంటున్న నిపుణులు

ఒకే రోజు లక్షా 45 వేల కేసులు.. ప్రాణాలకే ప్రమాదమంటున్న నిపుణులు

   13 hours ago


టీకా ఉత్సవ్.. అర్హులందరికీ రికార్డు స్థాయిలో టీకాలు వేయండి.. మోదీ

టీకా ఉత్సవ్.. అర్హులందరికీ రికార్డు స్థాయిలో టీకాలు వేయండి.. మోదీ

   19 hours ago


ముత్యాలు పండాయి అన‌డం కాదు.. నిజంగానే పండిస్తే మ‌స్తు లాభాలు

ముత్యాలు పండాయి అన‌డం కాదు.. నిజంగానే పండిస్తే మ‌స్తు లాభాలు

   20 hours ago


ఒక్కరోజులో 800 మంది మృతి.. భారత్‌లో కోరలు చాస్తున్న కరోనా

ఒక్కరోజులో 800 మంది మృతి.. భారత్‌లో కోరలు చాస్తున్న కరోనా

   09-04-2021


వ్యాక్సిన్ ఉత్పత్తి తగ్గింది నిజమే.. కారణం ఏమిటంటే.. సీరమ్ సీఈఓ

వ్యాక్సిన్ ఉత్పత్తి తగ్గింది నిజమే.. కారణం ఏమిటంటే.. సీరమ్ సీఈఓ

   09-04-2021


అధికార్లకు తరచు సమన్లు ఇవ్వడం వేధింపులో భాగమే.. సుప్రీం

అధికార్లకు తరచు సమన్లు ఇవ్వడం వేధింపులో భాగమే.. సుప్రీం

   09-04-2021


డబ్బు వసూలుకు మంత్రి డిమాండ్ చేసింది నిజమే.. సచిన్ వాజే

డబ్బు వసూలుకు మంత్రి డిమాండ్ చేసింది నిజమే.. సచిన్ వాజే

   08-04-2021


పనిస్థలాల్లోనూ కోవిడ్19 వ్యాక్సిన్... అనుమతించనున్న కేంద్రప్రభుత్వం

పనిస్థలాల్లోనూ కోవిడ్19 వ్యాక్సిన్... అనుమతించనున్న కేంద్రప్రభుత్వం

   08-04-2021


అవసరమైన వారికే టీకా.. కోరిన ప్రతివారికీ కాదు.. కేంద్రం స్పష్టీకరణ

అవసరమైన వారికే టీకా.. కోరిన ప్రతివారికీ కాదు.. కేంద్రం స్పష్టీకరణ

   08-04-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle