మహారాష్ట్రలో స్కూళ్లు, కాలేజీలు మళ్లీ బంద్.. పెరిగిన కరోనా
23-02-202123-02-2021 18:42:47 IST
Updated On 23-02-2021 12:55:06 ISTUpdated On 23-02-20212021-02-23T13:12:47.276Z23-02-2021 2021-02-23T06:02:23.714Z - 2021-02-23T07:25:06.962Z - 23-02-2021

మొదట్లో కరోనా కేసుల నెంబర్ భయ పెట్టింది. అన్ని అప్డేట్లూ.. కరోనా కేసుల అప్డేట్స్ తో లింక్ అయ్యే ఉండేవి. తర్వాత ఏమో.. టీకా న్యూస్ అప్డేట్స్ రెగ్యులర్ గా ఉండేవి. వచ్చింది వచ్చింది. ట్రయల్స్ ట్రయల్స్.. సక్సెస్ సక్సెస్.. రిజెక్ట్ రిజెక్ట్ అని విన్నాం. తర్వాత ఏమో.. టీకాతో పన్లేదు.. తగ్గింది కరోనా.. తగ్గింది కరోనా అనుకున్నాం. అయినా సరే.. టీకా అయితే వచ్చింది. ఇక డోసుల పంపిణీ, వ్యాక్సిన్లు వేయడాలు.. జనం టీకాలతో చావడాలు.. ఇలాంటివి రెగ్యులర్ గా వింటున్నాం. కానీ.. కరోనా పోయిందనే అనుకున్నాం. కానీ.. మహారాష్ట్రని మాత్రం వదలడం లేదు. మొన్నీ మధ్య రోజుకి ఐదువేల కేసులు వచ్చాయి.. ఇప్పుడు వాటి సంఖ్య ఇంకాస్త పెరిగింది. జనం బయటికి రావాలంటే ఏ మాత్రం భయపడడం లేదు. మాస్కులు లేకున్నా టెన్షన్ పడడం లేదు. ఇంకేం కరోనా తగ్గుతుంది చెప్పండి. అందుకే.. కరోనా కేసులు ఫుల్ గా పెరుగుతున్నయ్. ఇప్పుడు కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. దేశ వ్యాప్తంగా 15 వేల దాకా కేసులు నమోదు అవుతుంటే.. అందులో మహారాష్ట్ర కరోనా కేసులే.. నాలుగు నుంచి ఐదువేల వరకు ఉంటున్నాయి. అందుకే.. అక్కడి సర్కార్ మళ్లీ సీరయస్ యాక్షన్ స్టార్ట్ చేసింది. కేసులు విపరీతంగా ఉన్న చోట్ల.. స్కూళ్లు, కాలేజీలు బంద్ పెట్టింది. పెద్ద మార్కెట్లను శని వారం, ఆది వారాల్లో క్లోజ్ చేస్తుంది. ఇక కల్యాణ మండపాల్లాంటివి కూడా బంద్. అయిదు రాష్ట్రాల్లో పెరిగిన కోవిడ్ కేసులు.. నిబంధనలు పాటించాలన్న కేంద్రం కేరళలో కూడా కరోనా కేసులు పెరుగుతుండడంతో.. కేరళ బార్డర్ ను క్లోజ్ చేసింది మహారాష్ట్ర సర్కార్. బోర్డర్ క్రాస్ చేయాలంటే.. 72 గంటల లోపు చేసిన కరోనా టెస్ట్ రిపోర్ట్ లో నెగటివ్ అని ఉండాలి. ముంబై విషయంలో ఇంకాస్త సీరియస్ గా ఉన్నారు ఆఫీసర్లు. గుంపులు గుంపులుగా ఉండడాన్ని బ్యాన్ చేశారు. పొలిటికల్ గా, రిలీజియస్ గా గ్యాదర్ కావాడాన్ని బ్యాన్ చేశారు ఆఫీసర్లు. ఇలాంటి ఆంక్షలతో మహారాష్ట్ర హై అలర్ట్ లో ఉంది. ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆఫీసర్లు అలర్ట్ గా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది.

కరోనా అప్డేట్.. గత 24 గంటల్లో 16,488 మందికి కరోనా
15 minutes ago

కొరియన్ బ్యాండ్‌పై హోస్ట్ జాతి వివక్షా వ్యాఖ్యలు.. జర్మన్ రేడియో క్షమాపణ
43 minutes ago

కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ.. పెరుగుతున్న కరోనా కేసులు
an hour ago

ఎన్నికల షెడ్యూల్ ఇదే..!
13 hours ago

భారత్ పాక్ కాల్పుల విరమణ.. సూత్రధారి దోవల్
20 hours ago

కరోనా కేసుల అప్డేట్.. గత 24 గంటల్లో 16,577 మందికి కరోనా..!
20 hours ago

గ్రీన్‌కార్డు దరఖాస్తుదారులకు బైడెన్ గ్రీన్ సిగ్నల్
a day ago

మోదీ.. ఉద్యోగమివ్వు.. 50 లక్షల ట్వీట్లతో ట్విట్టర్లో ట్రెండింగ్
a day ago

టీ చేయకపోతే చావగొడతారా.. భార్య అంటే వస్తువా.. ధ్వజమెత్తిన హైకోర్టు
17 hours ago

అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలు ఉన్న వాహనం
26-02-2021
ఇంకా