newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

మార్చురీలు, ఆక్సిజ‌న్ కొర‌త స్టార్ట్.. క‌రోనా మామూలుగా లేదు

08-04-202108-04-2021 13:49:44 IST
2021-04-08T08:19:44.467Z08-04-2021 2021-04-07T19:53:37.839Z - - 20-04-2021

మార్చురీలు, ఆక్సిజ‌న్ కొర‌త స్టార్ట్.. క‌రోనా  మామూలుగా లేదు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

మ‌నం చాలా లైట్ తీసుకుంటున్నం. తొక్క‌లో క‌రోనాలే అనుకుంటున్నం. బతుకు పోరాటంలో ప‌డిపోతున్నం. బ‌త‌క‌లేక చ‌స్త‌మా అనే యాంగిల్ ఆలోచించ‌డం లేదు.  సంపాద‌న రేసులో ప‌క్క వారికంటే ఎక్క‌డ త‌గ్గిపోతామో అనే భ‌యం ప‌ట్టుకుంది. నిజ‌మే.. ఎన్ని క‌ష్టాలు ప‌డి అయినా సరే.. వ్యాపారం చేస్తున్నాం. కూర్చుని తిన్నా త‌ర‌గ‌ని ఆస్తి  ఉన్న వాళ్లు కూడా డైలా సంపాద‌న విష‌యంలో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కావ‌డం లేదు. ఇక బ‌తుకు పోరాటం చేసే వాళ్ల ప‌రిస్థితి  వేరే. అయినా.. బ‌తికుంటే బ‌లుసాకు తిని బ‌త‌కొచ్చు అనే మాట సీఎం కేసీఆర్ చెబితే వింటానికి బావుంటుంది కానీ.. దాని పాటించ‌డానికి బావుండ‌దు క‌దా.

ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఇదే సిచ్చువేష‌న్ క‌నిపిస్తోంది. వేల‌కి వేల కేసులు పెరుగుతున్న‌య్. టెస్టులు చేస్తున్న కొద్దీ కేసులు బ‌య‌ట‌ప‌డుతున్నయ్. కానీ.. జ‌నాలు మాత్రం టెన్ష‌న్ ప‌డ‌డం లేదు. అస‌లు ప‌ట్టించుకోవ‌డం లేదు కూడా. ఇంత‌కు  ముందు అంటే.. వ్యాక్సిన్ వ‌స్తుంది.. స‌మ‌స్య సాల్వ్ అవుతుంది అనుకున్నాం. అంతా ప్ర‌శాంతం క‌దా అనుకున్నాం. కానీ.. వ్యాక్సిన్ వ‌చ్చినా ఉప‌యోగం లేకుండా పోయింది. దాన్ని క‌రోనా ఏ మాత్రం లెక్క చేయ‌డం లేదు కదా. ప్ర‌భుత్వాలు కూడా వ్యాక్సిన్ వ‌చ్చిన త‌ర్వాత‌.. క‌రోనా త‌గ్గిపోయింది  క‌దా అని.. వ్యాక్సినేష‌న్ ని లైట్ తీసుకున్నారు. ఇప్పుడు కేసులు పెరుగుతుండ‌డంతో.. ఉరుకులు పెడుతున్నారు ఆఫీస‌ర్లు.  ముందే వేసి ఉంటే మ‌రోలా ఉండేదేమో.

ఇక కేసుల  సంఖ్య మామూలుగా  పెర‌గ‌డం లేదు.. ఓ రేంజ్ లో పెరుగుతున్న‌య్. తెలుగు రాష్ట్రాల్లో కూడా సీరియ‌స్ గానే ఉంది ఎవ్వారం. క‌రోనా సోకిన వారి ఆరోగ్య ప‌రిస్థితి కూడా సీరియ‌స్ గానే మారుతోంది. కానీ.. ప్రాణం అంటే భ‌యం లేకుండా పోయింది  జ‌నాల‌కి.  మ‌హారాష్ట్ర‌లో అయితే మ‌రీ దారుణం.. మొన్నా మ‌ధ్య ఓ జిల్లా హాస్పిట‌ల్ లో మార్చురీ నిండిపోయి.. డెడ్ బాడీస్ ని కిందే ప‌డుకోబెట్టారు. ఇప్పుడు ఆక్సిజ‌న్ కొర‌త మొద‌లైంది. నాలుగు రోజులు ఆగితే అన్ని చోట్లా ఈ స‌మ‌స్య రావ‌డం కామ‌న్. మార్చురీలు నిండ‌డం.. ఆక్సిజ‌న్ నిండుకోవ‌డం రెండూ జ‌రుగుతాయి. తెలుగు రాష్ట్రాల‌కి కూడా ఈ సిచ్చువేష‌న్ రాక ముందే మ‌న సీఎం సార్లు.. ఏమైనా కేర్ తీసుకుంటారా.. ప్యారా సెట్మాల్, బ్లీచింగ్ పౌడ‌ర్ డైలాగులు దంచుతారా అనేది చూడాలి.

ఢిల్లీలో లాక్ డౌన్.. కేజ్రీవాల్ కీలక ప్రకటన

ఢిల్లీలో లాక్ డౌన్.. కేజ్రీవాల్ కీలక ప్రకటన

   15 hours ago


విమాన సర్విసులను ఆపేసిన హాంకాంగ్

విమాన సర్విసులను ఆపేసిన హాంకాంగ్

   17 hours ago


‘ఇంకా ఎంతో చేయవచ్చు’ కోవిడ్ పై మోడీకి మన్మోహన్ లేఖ

‘ఇంకా ఎంతో చేయవచ్చు’ కోవిడ్ పై మోడీకి మన్మోహన్ లేఖ

   18 hours ago


సిద్ధమవుతున్న ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ రైళ్లు

సిద్ధమవుతున్న ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ రైళ్లు

   19 hours ago


మళ్ళీ లాక్ డౌన్ వద్దు.. రాష్ట్రాలకు ఫిక్కీ లేఖ

మళ్ళీ లాక్ డౌన్ వద్దు.. రాష్ట్రాలకు ఫిక్కీ లేఖ

   17-04-2021


18 ఏళ్ళు దాటితే కోవిడ్ టీకా వేయాలి.. సుప్రీంకోర్టులో పిటీషన్

18 ఏళ్ళు దాటితే కోవిడ్ టీకా వేయాలి.. సుప్రీంకోర్టులో పిటీషన్

   17-04-2021


నీరవ్ మోడీ అప్పగింతకు లైన్ క్లియర్..  యు.కె హోమ్ మంత్రి

నీరవ్ మోడీ అప్పగింతకు లైన్ క్లియర్.. యు.కె హోమ్ మంత్రి

   17-04-2021


రైలు సర్వీసులు యధాతథo.. రైల్వేబోర్డు చైర్మన్ వెల్లడి

రైలు సర్వీసులు యధాతథo.. రైల్వేబోర్డు చైర్మన్ వెల్లడి

   17-04-2021


భారత్ లో వ్యాక్సిన్ సీన్ రివర్స్.. ఆందోళనలో భారత్ పై ఆధారపడ్డ దేశాలు

భారత్ లో వ్యాక్సిన్ సీన్ రివర్స్.. ఆందోళనలో భారత్ పై ఆధారపడ్డ దేశాలు

   16-04-2021


అయోధ్య విరాళాలలో 15వేల చెక్కులు బౌన్స్.. విలువ 22 కోట్లు

అయోధ్య విరాళాలలో 15వేల చెక్కులు బౌన్స్.. విలువ 22 కోట్లు

   16-04-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle