newssting
Radio
BITING NEWS :
ఏలూరు మాజీ ఎంపి మాగంటి బాబు కుమారుడు ఆత్మహత్యాయత్నం. అర్థరాత్రి విజయవాడ ఆంధ్రా ఆస్పత్రికి తరలింపు. ఐసీయూలో వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్న వైద్యులు. బ్రెయిన్ స్ట్రోక్ తో ఆస్పత్రిలో చేర్పించామని చెప్తున్న కుటుంబ సభ్యులు. 24 గంటలు గడిస్తే గానీ ఏమీ చెప్పలేమన్న వైద్యులు. * ఏపీ మునిసిపల్ ఎన్నికల్లో అత్యధిక ఏకగ్రీవాలు చేసిన వైసీపీ. వైసీపీ -570, టీడీపీ -5, బీజేపీ -1, ఇతరులు -2 ఏకగ్రీవాలు. * విశాఖలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం. విజయవాడ నుంచి విశాఖకు తరలనున్న కమాండ్ కంట్రోల్ రూమ్. విశాఖలోని ప్రభుత్వ భూమిలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు. * నెల్లూరు జాయింట్ కలెక్టర్ కార్యాలయ సిబ్బందిపై కేసు నమోదు. పదోన్నతి కల్పిస్తామని చెప్పి మోసం చేశారని అంగన్ వాడీ కార్యకర్త ఫిర్యాదు. జేసీ సీసీ శ్రీకాంత్, సిబ్బంది దయాకర్, వికాస్ పై కేసు నమోదు. జేసీ భార్య ఇంట్లో పనిచేయించుకుంటున్నారంటూ ఫిర్యాదు. కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని ఆందోళన. * రాజకీయాలపై సంచలన ప్రకటన చేసిన జయ నెచ్చెలి శశికళ. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన చిన్నమ్మ. శశికళ ప్రకటనతో నిరాశ చెందిన అభిమానులు. ఇది బీజేపీ స్క్రిప్ట్ అంటున్న శశికళ మద్దతుదారులు. * సీఎం జగన్ కు ఏపీ సీపీఎం కార్యదర్శి రామకృష్ణ లేఖ. రేపటి రాష్ట్ర బంద్ కు సహకరించాలని సీఎంకు వినతి. విశాఖ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బంద్ కు పిలుపునిచ్చిన సీపీఐ.

కరోనా కేసుల అప్డేట్.. గత 24 గంటల్లో 10,584 మందికి కరోనా..!

23-02-202123-02-2021 12:40:29 IST
2021-02-23T07:10:29.055Z23-02-2021 2021-02-23T07:10:25.760Z - - 04-03-2021

కరోనా కేసుల అప్డేట్.. గత 24 గంటల్లో 10,584 మందికి కరోనా..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

భారతదేశంలో కొత్త‌గా న‌మోదైన క‌రోనా కేసుల వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలో గత 24 గంటల్లో 10,584 మందికి కరోనా నిర్ధారణ అయింది. అదే స‌మ‌యంలో 13,255 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,10,16,434కు చేరింది. గడచిన 24 గంట‌ల సమయంలో 78 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,56,463 కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,07,12,665 మంది కోలుకున్నారు. 1,47,306 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు 1,17,45,552 మందికి వ్యాక్సిన్ వేశారు.

22-02-2021న ఆంధ్రప్రదేశ్ అధికారులు విడుదల చేసిన కరోనా వివరాల ప్రకారం.. ఏపీలో గత 24 గంటల్లో 18,257 మందికి కోవిడ్ పరీక్షలను నిర్వహించగా 41 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. వాటిలో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 10 కేసులు నమోదయ్యాయి. ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఇదే సమయంలో 71 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజా గణాంకాలతో కలిపి ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 8,89,339కి పెరిగింది. ఇప్పటి వరకు 8,81,582 మంది కోలుకున్నారు. మొత్తం 7,167 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 590 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.

మహారాష్ట్రలో పెరుగుతున్న కరోనా కేసుల కారణంగా సరిహద్దు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. తెలంగాణ ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ, మహారాష్ట్రలో పెరుగుతున్న కరోనా కేసుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని చెప్పారు. వైద్యశాఖ అధికారులను అలర్ట్ చేశామని.. మహారాష్ట్రకు ఆనుకుని ఉన్న జిల్లాలపై దృష్టి సారించామని చెప్పారు. కరోనా పరీక్షల సంఖ్యను పెంచుతామని తెలిపారు. తెలంగాణలో మళ్లీ కేసులు పెరగలేదని.. ఇప్పటికైతే మళ్లీ కర్ఫ్యూ విధించాలనే ఆలోచన లేదని తెలిపారు. కరోనా ఉన్నంత కాలం ప్రజలంతా ఎవరికి వారు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. కోవిడ్ వ్యాక్సిన్ ను మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని..  తెలంగాణకు ఇప్పటి వరకు 11 లక్షలకు పైగా డోసులు వచ్చాయని... దీర్ఘకాలిక వ్యాధులున్నవారికి, 50 ఏళ్లు దాటిన వారికి త్వరగా వ్యాక్సిన్ ఇవ్వాలని చెప్పారు.

ప్రభుత్వంపై భిన్నాభిప్రాయం ప్రకటించడం దేశద్రోహం కాదు.. సుప్రీంకోర్టు

ప్రభుత్వంపై భిన్నాభిప్రాయం ప్రకటించడం దేశద్రోహం కాదు.. సుప్రీంకోర్టు

   3 hours ago


కరోనా టీకాపై ఆంక్షల తొలగింపు.. ఇకపై 24 గంటలూ టీకా

కరోనా టీకాపై ఆంక్షల తొలగింపు.. ఇకపై 24 గంటలూ టీకా

   4 hours ago


ప్రాంతీయ భాషల్ని విస్మరిస్తే దేశానికి పెద్ద అన్యాయం.. ప్రధాని మోదీ

ప్రాంతీయ భాషల్ని విస్మరిస్తే దేశానికి పెద్ద అన్యాయం.. ప్రధాని మోదీ

   4 hours ago


కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న నిర్మలా సీతారామన్

కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న నిర్మలా సీతారామన్

   5 hours ago


తాజ్ మహల్ లో బాంబు పెట్టాను.. ఇంకొద్ది సేపట్లో..!

తాజ్ మహల్ లో బాంబు పెట్టాను.. ఇంకొద్ది సేపట్లో..!

   6 hours ago


కరోనా కేసుల అప్డేట్.. గత 24 గంటల్లో 17,407 మందికి కరోనా..!

కరోనా కేసుల అప్డేట్.. గత 24 గంటల్లో 17,407 మందికి కరోనా..!

   8 hours ago


ఫ్రెంచ్ యువ‌తిని రేప్ చేసిన ఢిల్లీ మ‌హిళ‌.. కేసు న‌మోదు

ఫ్రెంచ్ యువ‌తిని రేప్ చేసిన ఢిల్లీ మ‌హిళ‌.. కేసు న‌మోదు

   7 hours ago


రాసలీలల మంత్రిగారు.. రాజీనామా చేసేశారు

రాసలీలల మంత్రిగారు.. రాజీనామా చేసేశారు

   03-03-2021


హెచ్-1బీ వీసా ట్విస్ట్ ఇచ్చిన అమెరికా..!

హెచ్-1బీ వీసా ట్విస్ట్ ఇచ్చిన అమెరికా..!

   03-03-2021


కరోనా కేసుల అప్డేట్.. గత 24 గంటల్లో 14,989 మందికి కరోనా..!

కరోనా కేసుల అప్డేట్.. గత 24 గంటల్లో 14,989 మందికి కరోనా..!

   03-03-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle