newssting
Radio
BITING NEWS :
హైదరాబాద్ వాసులను వెంటాడుతున్న వరద భయం. రానున్న మూడ్రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం. ఏ క్షణాన వరద ముంచెత్తుతుందోనని కంటిమీద కునుకులేకుండా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న లోతట్టు ప్రాంతాల ప్రజలు. * హైదరాబాద్ ను ఆదుకునేందుకు కదిలిన టాలీవుడ్ తారాగణం. సీఎం రిలీఫ్ ఫండ్ కు చిరంజీవి, పవన్ కల్యాణ్, మహేష్ కోటి రూపాయల విరాళం. చెరో 50 లక్షలు ఇచ్చిన ఎన్టీఆర్, రామ్ చరణ్. * విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఘనంగా పోలీస్ సంస్మరణ దినోత్సవ వేడుకలు. కరోనాతో మృతి చెందిన పోలీసుల కుటుంబాలకు రూ.50 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం. పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం వైసీపీనే అన్న మంత్రి సుచరిత. * ఏపీ - తెలంగాణ ప్రభుత్వాల మధ్య ఇంకా కుదరని ఆర్టీసీ ఒప్పందం. ప్రభుత్వాల మొండి వైఖరితో ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు. ఆర్టీసీ అలసత్వాన్ని క్యాష్ చేసుకుంటున్న ప్రైవేట్ ట్రావెల్స్. ఇష్టారాజ్యంగా ఛార్జీలు పెంచిన ప్రైవేట్ బస్సులు. ప్రతి ఏటా ఆర్టీసీకి లాభాలు తెచ్చిపెడుతున్న దసరా. * స్కందమాతగా దర్శనమిస్తోన్న బాసర సరస్వతీ దేవి. * పూర్తిగా నిండిన గండిపేట చెరువు. ఏ క్షణంలోనైనా గేట్లు ఎత్తి నీరు విడుదల చేసే అవకాశం. లోతట్టుప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు.

కరోనా కేసుల అప్డేట్.. 63,371 మందికి కరోనా నిర్ధారణ

16-10-202016-10-2020 10:18:40 IST
Updated On 16-10-2020 10:26:14 ISTUpdated On 16-10-20202020-10-16T04:48:40.706Z16-10-2020 2020-10-16T04:48:37.320Z - 2020-10-16T04:56:14.172Z - 16-10-2020

కరోనా కేసుల అప్డేట్..  63,371 మందికి కరోనా నిర్ధారణ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

భారత్‌లో గత 24 గంటల్లో 63,371 మందికి కరోనా నిర్ధారణ అయిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 73,70,469 కి చేరింది. గ‌త 24 గంట‌ల సమయంలో 895 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,12,161 కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 64,53,780 మంది కోలుకున్నారు. 8,04,528 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశంలో నిన్నటి వరకు మొత్తం 9,22,54,927 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. 

తెలంగాణ‌ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కరోనా కేసుల వివరాలను ఈ రోజు ఉదయం వెల్లడించింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 1,554 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో ఏడుగురు కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 1,435 మంది కోలుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,19,224 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 1,94,653 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 1,256 కు చేరింది. ప్రస్తుతం 23,203 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. 19,251 మంది హోం క్వాంరంటైన్ లో చికిత్స పొందుతున్నారు. 

అక్టోబర్ 15వ తేదీ సాయంత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 4,038 మందికి కరోనా నిర్ధారణ అయింది. అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 686 కేసులు వచ్చాయి. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 96 కేసులు గుర్తించారు. రాష్ట్రవ్యాప్తంగా 38 మంది మృతి చెందారు. చిత్తూరు జిల్లాలో 9 మంది కరోనాతో మరణించారు. 5,622 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 7,71,503 కాగా, 7,25,099 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 40,047 మంది చికిత్స పొందుతున్నారు. 


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle