newssting
Radio
BITING NEWS :
కరోనా ఎండమిక్‌ దశకి వచ్చేశామని ప్రపంచ దేశాలు భావిస్తే ప్రమాదకరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) చీఫ్‌ టెడ్రోస్‌ అధ్నామ్‌ ఘెబ్రెయాసస్‌ హెచ్చరించారు. కరోనా వైరస్‌ నుంచి మరిన్ని వేరియెంట్లు వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయని అన్నారు. * దేశంలో బీజేపీని జాతీయ స్థాయిలో ఓడించడంలో కాంగ్రెస్‌ది కీలకస్థానమని, కానీ ఆ పార్టీ ప్రస్తుత నాయకత్వానికి (గాంధీ కుటుంబం) అంత శక్తి లేదని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ అభిప్రాయపడ్డారు. * అఖిల భారత సర్వీసుల(ఏఐఎస్‌) కేడర్‌ రూల్స్‌–1954కు కేంద్రం ప్రతిపాదించిన సవర ణలు రాజ్యాంగానికి, సమాఖ్య స్ఫూర్తికి గొడ్డలి పెట్టు అని సీఎం కె.చంద్రశేఖర్‌రావు ధ్వజ మెత్తారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌ అధికారుల పనితీరును, వారి ఉద్యోగ స్వరూపాన్ని పూర్తిగా మార్చేసేలా ఆ సవరణలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. * రాష్ట్ర మంత్రి కొడాలి నాని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌పై విపరీత వ్యాఖ్యలు చేసిన టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సోమవారం సాయంత్రం ఆయన్ని ఇంటి వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు, కొద్దిసేపటి తర్వాత నోటీసులు ఇచ్చి వదిలేశారు. * ఐపీఎల్‌ కొత్త ఫ్రాంచైజీ అయిన లక్నో.. తమ జట్టు పేరును అధికారికంగా ప్రకటించింది. సంజీవ్ గొయెంకా నేతృత్వంలోని ఆర్పీఎస్జీ సంస్థ.. తమ జట్టుకు ‘లక్నో సూపర్ జెయింట్స్’ పేరును ఖరారు చేసింది. ఈ మేరకు ఫ్రాంచైజీ అధినేత సంజీవ్‌ గొయెంకా సోమవారం ట్విటర్‌ వేదికగా వెల్లడించారు.

ప్రధానమంత్రి నరేంద్రమోడీ హత్యకు కుట్ర

18-01-202218-01-2022 20:38:42 IST
2022-01-18T15:08:42.032Z18-01-2022 2022-01-18T15:08:39.027Z - - 25-05-2022

ప్రధానమంత్రి నరేంద్రమోడీ హత్యకు కుట్ర
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రధానమంత్రి నరేంద్రమోడీ హత్యకు కుట్ర జరుగుతోందని నిఘావర్గాలు హెచ్చరిస్తున్నాయి. అంతేకాదు భారత గణతంత్ర వేడుకలకు ఉగ్ర ముప్పు పొంచి ఉందని నిఘావర్గాలు తీవ్ర హెచ్చరికలు జారీచేశాయి. ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులపై దాడికి ముష్కరులు కుట్ర పన్నినట్లు సమాచారం ఉందని 9 పేజీల ఇంటెలిజెన్స్ నివేదిక కేంద్ర హోంశాఖకు చేరినట్టు తెలుస్తోంది. పాకిస్థాన్, ఆఫ్గన్‌-పాక్‌ ప్రాంతానికి చెందిన గ్రూపుల నుంచి ముప్పు ఉందని నిఘావర్గాలు హెచ్చరించాయి. రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొనే ప్రముఖులతో పాటు బహిరంగసభలు, కీలకమైన సంస్థలు, రద్దీ ప్రదేశాల్లో విధ్వంసం సృష్టించేందుకు ఉగ్రవాద సమూహాలు కుట్ర చేసినట్టు ఐబీ వెల్లడించింది. డ్రోన్ల ద్వారా దాడులకు తెగబడవచ్చని హెచ్చరించినట్టు తెలిసింది. 

లష్కరే తోయిబా, ది రెసిస్టెన్స్ ఫోర్స్, జైషే మహ్మద్, హర్కత్ ఉల్ ముజాహిదీన్, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి టెర్రర్‌ సంస్థలు ఈ ఉగ్ర ప్రణాళిక వెనుక ఉన్నట్టు పేర్కొంది. పాకిస్తాన్‌లో ఉన్న ఖలిస్తానీ గ్రూపులు పంజాబ్‌లో మిలిటెన్సీని పునరుద్ధరింపజేసేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నాయని.. పంజాబ్‌ పాటు ఇతర రాష్ట్రాల్లోనూ లక్షిత దాడులకు ప్లాన్ చేస్తున్నారని నిఘావర్గాలు హెచ్చరించాయి. నిఘా వర్గాల హెచ్చరికలతో కేంద్ర హోం శాఖ అప్రమత్తమయ్యింది. దాడులు జరిగే అవకాశాలు ఉన్న అన్ని రాష్ట్రాలలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని ఆయా రాష్ట్ర హోం శాఖలకి ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. 


Newssting


 newssting.in@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle