newssting
Radio
BITING NEWS :
ఏలూరు మాజీ ఎంపి మాగంటి బాబు కుమారుడు ఆత్మహత్యాయత్నం. అర్థరాత్రి విజయవాడ ఆంధ్రా ఆస్పత్రికి తరలింపు. ఐసీయూలో వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్న వైద్యులు. బ్రెయిన్ స్ట్రోక్ తో ఆస్పత్రిలో చేర్పించామని చెప్తున్న కుటుంబ సభ్యులు. 24 గంటలు గడిస్తే గానీ ఏమీ చెప్పలేమన్న వైద్యులు. * ఏపీ మునిసిపల్ ఎన్నికల్లో అత్యధిక ఏకగ్రీవాలు చేసిన వైసీపీ. వైసీపీ -570, టీడీపీ -5, బీజేపీ -1, ఇతరులు -2 ఏకగ్రీవాలు. * విశాఖలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం. విజయవాడ నుంచి విశాఖకు తరలనున్న కమాండ్ కంట్రోల్ రూమ్. విశాఖలోని ప్రభుత్వ భూమిలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు. * నెల్లూరు జాయింట్ కలెక్టర్ కార్యాలయ సిబ్బందిపై కేసు నమోదు. పదోన్నతి కల్పిస్తామని చెప్పి మోసం చేశారని అంగన్ వాడీ కార్యకర్త ఫిర్యాదు. జేసీ సీసీ శ్రీకాంత్, సిబ్బంది దయాకర్, వికాస్ పై కేసు నమోదు. జేసీ భార్య ఇంట్లో పనిచేయించుకుంటున్నారంటూ ఫిర్యాదు. కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని ఆందోళన. * రాజకీయాలపై సంచలన ప్రకటన చేసిన జయ నెచ్చెలి శశికళ. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన చిన్నమ్మ. శశికళ ప్రకటనతో నిరాశ చెందిన అభిమానులు. ఇది బీజేపీ స్క్రిప్ట్ అంటున్న శశికళ మద్దతుదారులు. * సీఎం జగన్ కు ఏపీ సీపీఎం కార్యదర్శి రామకృష్ణ లేఖ. రేపటి రాష్ట్ర బంద్ కు సహకరించాలని సీఎంకు వినతి. విశాఖ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బంద్ కు పిలుపునిచ్చిన సీపీఐ.

యుద్ధ ట్యాంకర్ల ఉత్పత్తిలోనూ తమిళనాడు ముందంజ.. మోదీ ప్రశంసలు

15-02-202115-02-2021 10:07:59 IST
2021-02-15T04:37:59.162Z15-02-2021 2021-02-15T04:37:46.436Z - - 04-03-2021

యుద్ధ ట్యాంకర్ల ఉత్పత్తిలోనూ తమిళనాడు ముందంజ.. మోదీ ప్రశంసలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
భారత సైన్యాన్ని అపార శక్తికలిగిన వ్యవస్థగా మార్చేందుకు జాతీయ స్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. ఆదివారం తమిళనాడు సందర్శించిన మోదీ డీఆర్‌డీఓ దేశీయంగా తయారు చేసిన అర్జున్‌ ప్రధాన యుద్ధ ట్యాంక్‌(ఎంకే–1ఏ)ను భారతీయ సైన్యానికి అప్పగించారు. 

తమిళనాడు రాష్ట్రం మోటార్‌ వాహన ఉత్పత్తిలోనే కాదు, యుద్ధ ట్యాంకర్ల ఉత్పత్తిలోనూ హబ్‌గా మారుతోందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించారు. చెన్నై నెహ్రూ ఇండోర్‌ స్టేడియంలో ఆదివారం జరిగిన కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్‌ భన్వరిలాల్‌ పురోహిత్, సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీరుసెల్వంలతో కలిసి ప్రధాని మోదీ హాజరయ్యారు. 

చెన్నై ఆవడిలోని ఆర్మీ ఫ్యాక్టరీలో పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో 71 సరికొత్త హంగులతో రూపుదిద్దుకున్న అర్జున యుద్ధ ట్యాంకర్‌ను భారత ఆర్మీకి అందించారు. ముందుగా వేదికపై ఏర్పాటు చేసిన దివంగత సీఎంలు ఎంజీఆర్, జయలలిత చిత్ర పటాలకు మోదీ పుష్పాంజలి ఘటించారు.

తమిళనాడు రైతులు ఇక్కడి వనరుల్ని సద్వినియోగం చేసుకుని ఆహార ఉత్పత్తిలో రికార్డులు సృష్టిస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. ప్రతి నీటి చుక్క ఇప్పుడు ఎంతో కీలకం అని, పొదుపు ఆవశ్యకత గురించి మోదీ వివరిస్తూ భావితరాల కోసం జల, వనరుల పరిరక్షణ లక్ష్యంగా ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. తక్కువ జల వినియోగంతో ఎక్కువ దిగుబడి సాధించే దిశగా తమిళనాడు రైతులు మరింతగా కృషి చేయాల్సి ఉందన్నారు. 

తన తమిళనాడు సందర్శన సందర్భంగా మోదీ కీలక ప్రాజెక్టులకు పచ్చజెండా ఊపారు. రూ.3,770 కోట్లతో పూర్తయిన చెన్నై వాషర్‌మెన్‌ పేట–విమ్కోనగర్‌ మధ్య మెట్రో రైలు, రూ.293 కోట్లతో పూర్తి చేసిన చెన్నై బీచ్‌–అత్తిపట్టు మధ్య 4వ ట్రాక్‌లో, రూ.423 కోట్లతో విద్యుద్దీకరించిన విల్లుపురం–తంజావూరు – తిరువారూర్‌ మార్గంలో రైలు సేవలకు జెండా  ఊపారు. 

తంజావూరు, పుదుకోట్టైలకు సాగు నీరు అందించడం లక్ష్యంగా రూ. 2,640 కోట్లతో చేపట్టనున్న కళ్లనై కాలువ పునరుద్ధరణ పనులకు, రూ.1000 కోట్లతో చెంగల్పట్టు జిల్లా తయ్యూరు సమీపంలో 163 ఎకరాల్లో నిర్మించనున్న ఐఐటీ డిస్కవరీ క్యాంపస్‌ పనులకు శంకుస్థాపన చేశారు. 

త్వరలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలో ఉన్న అన్నాడీఎంకేతో కలిసి పోటీచేయాలని బీజేపీ నిర్ణయించుకుంది. ఈ సందర్భంగా తమిళ సంస్కృతి, సంప్రదాయాలను తన ప్రసంగంలో ప్రధాని కొనియాడారు. తమిళ సంస్కృతికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉందన్నారు. శ్రీలంక తమిళుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. వారి కోసం అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందన్నారు. జాఫ్నాలో పర్యటించిన ఏకైక భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని తానే కావడం తనకు గర్వకారణమని వ్యాఖ్యానించారు.

భారత ఆర్మీ శాంతియుతంగా సరిహద్దుల్లో దేశ రక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నదని ప్రధాని కొనియాడారు. ప్రపంచ స్థా యి ప్రమాణాలతో ఐఐటీ డిస్కవరీ రూపుదిద్దుకోబోతున్నదని ప్రకటించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రధానికి బ్రహ్మరథం పట్టే రీతిలో చెన్నైలో ఆహ్వానం లభించింది. ప్రధాని పర్యటన సందర్భంగా చెన్నైలో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు.  


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle