newssting
Radio
BITING NEWS :
ఈరోజు ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం * కేంద్ర మంత్రివర్గంలో పునర్వ్యవస్థీకరణ గురించి పలు ఊహాగానాల మధ్య ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జె పి నడ్డాతో చర్చలు జరిపారు * బెంగాల్, తమిళనాడులలో ఇటీవల సాధించిన విజయాలతో పోల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ముంబైలో భోజనం కోసం మహారాష్ట్ర రాజకీయ నాయకుడు శరద్ పవార్‌తో సమావేశమయ్యారు * దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 84,332 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది * దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,93,59,155కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 4002 మంది మరణించారు * కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతలు అనేక ఇబ్బందులు పడుతున్నా సీఎం కేసీఆర్‌ పట్టించుకోవట్లేదని దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి తనయ వైఎస్‌ షర్మిల విమర్శించారు * రాష్ట్రంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం, పోలీసు శాఖ చేపడుతున్న చర్యలు అభినందనీయమని నోబెల్‌ బహుమతి గ్రహీత, బాలల హక్కుల ఉద్యమకారుడు కైలాష్‌ సత్యార్థి ప్రశంసించారు.

ఇక 12 - 16 వారాల ఎడం.. వ్యాక్సిన్ డోసుల మధ్య వ్యవధి పెంచిన కేంద్రం

14-05-202114-05-2021 07:40:39 IST
2021-05-14T02:10:39.582Z14-05-2021 2021-05-14T02:10:34.020Z - - 14-06-2021

ఇక 12 - 16 వారాల ఎడం.. వ్యాక్సిన్ డోసుల మధ్య వ్యవధి పెంచిన కేంద్రం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్ వ్యాక్సిన్ల కొరత తీవ్రత చాలా ఎక్కువగా ఉండటంతో దీనికి విరుగుడుగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ టీకాల మొదటి, రెండవ డోసుల మధ్య 12 నుంచి 16 వారాల ఎడము ఉండాలన్న నిపుణుల బృందం సిఫార్సును ఆమోదించింది. ప్రస్తుతం 6-8 వారాల ఎడంతో ఈ రెండు దోషుల వ్యాక్సిన్ ఇస్తున్నారు. ఇప్పుడు దీనిని 12 -16 వారాలకు పెంచడం వల్ల వ్యాక్సిన్ల డిమాండు తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు. కోవిషీల్డ్ వ్యాక్సిన్ కు సంబంధించే ఈ నిర్ణయం తీసుకున్నామని, కొవ్యాక్సిన్ విషయంలో మొదటి డోసు రెండవ డోసుకు మధ్య ఎంత ఎడం ఉండాలన్న దానిపై మార్పులు చేయలేదు. 

కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తున్న సీరం సంస్థ సీఈఓ ఈ నిర్ణయాన్ని హర్షించారు. మొదటి, రెండవ టీకా మధ్య 12 వారాల వ్యవధి ఉండటం వల్ల శరీరంలో వాటి సామర్ధ్యం పెరుగుతుందని, రోగ నిరోధక శక్తి కూడా ఇనుమడిస్తుంది చెప్పారు. శాస్త్రీయ పరంగానూ, ఇతరత్రానూ అన్ని అమాశాలను పరిగణనలోకి తీసుకునే భారత ప్రభుత్వం ఈ మంచి నిర్ణయం తీసుకుందని వ్యాఖ్యానించారు. గర్భిణీలు కూడా తాము ఏ టీకా వేసుకోవాలో నిర్ణయించుకోవచ్చునని, అలాగే బాలింతలు ప్రసవం తరువాత  ఈ టీకాలు వేయించుకోవచ్చునని నిపుణుల బృందం సూచించింది. 

ఇప్పటివరకు ఇటు గర్భిణీలకు, అటు బాలింతలకు టీకాలు ఇవ్వలేదు. అలాగే సార్స్ - సిఓవి - 2 వైరస్ సోకిన వ్యక్తులు రికవరీ తరువాత వ్యాక్సినేషన్ ను ఆరు నెలల పాటు వాయిదా వేసుకోవాలని ఈ బృందం సూచించింది. ఇప్పటి వరకు కోవిడ్ నుంచి కోలుకున్న వారికి నాలుగు నుంచి ఎనిమిది వారాల తరువాత ఈ టీకాలు తీసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు దీనిని ఆరునెలలకు పెంచారు. బ్రిటన్ లో జరిగిన అధ్యయనాల ఆధారంగా కోవిషీల్డ్ పనితీరును దృష్టిలో పెట్టుకొని డోసుల మధ్య వ్యవధిని 12 నుంచి 16 వారాలకు పెంచినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.   

కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసుల వ్యవధిని పెంచడం గత మూడు నెలల్లో ఇది రెండవసారి. మొదట ఈ డోసుల వ్యవధి నాలుగు వారాలు ఉండగా 6 - 8 వారాలకు పెరిగింది. ఇప్పుడు 12 నుంచి 16 వారాలకు పెరిగింది. దీనిపై కాంగ్రెస్ పార్టీ నాయకుడు జై రామ్ రమేష్ వ్యంగ్యాస్త్రం విసిరారు. ఇలా డోసుల మధ్య వ్యవధి పెంచడానికి నిపుణుల సలహాలే కారణమా లేక డిమాండ్ కు సరిపడే పరిమాణంలో వ్యాక్సిన్లను అందించలేకపోవడమా అని ఆయన ప్రశ్నించారు.   

మిగులు ఆక్సిజన్ ఉంది... ఎవరికైనా ఇవ్వండి కేంద్రానికి ఢిల్లీ సర్కార్ లేఖ

బంపర్ ఆఫర్.. ఒక్క రూపాయికే లీటర్ పెట్రోలు..

బంపర్ ఆఫర్.. ఒక్క రూపాయికే లీటర్ పెట్రోలు..

   4 hours ago


బాల కార్మికులకు వ్యతిరేకంగా ప్రపంచ దినం: అలీఘర్ పిల్లలకు విడుదల ఎప్పుడు ?

బాల కార్మికులకు వ్యతిరేకంగా ప్రపంచ దినం: అలీఘర్ పిల్లలకు విడుదల ఎప్పుడు ?

   19 hours ago


దేశ రాజధానిలో లాక్ డౌన్ ఆంక్షలు సడలింపు

దేశ రాజధానిలో లాక్ డౌన్ ఆంక్షలు సడలింపు

   13-06-2021


ఉత్తర ప్రదేశ్ మూడు ముక్కలు కానుందా..?

ఉత్తర ప్రదేశ్ మూడు ముక్కలు కానుందా..?

   13-06-2021


కరోనా ఔషధాలు, వైద్య పరికరాలకి భారీగా జీఎస్టీ తగ్గింపు

కరోనా ఔషధాలు, వైద్య పరికరాలకి భారీగా జీఎస్టీ తగ్గింపు

   13-06-2021


గత 24 గంటల్లో ఇండియాలో 84,332 కోవిడ్ కేసులు..

గత 24 గంటల్లో ఇండియాలో 84,332 కోవిడ్ కేసులు..

   13-06-2021


కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో సహాయం చేసిన దేశాలకు ధన్యవాదాలు G7 సమ్మిట్ లో PM మోడీ

కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో సహాయం చేసిన దేశాలకు ధన్యవాదాలు G7 సమ్మిట్ లో PM మోడీ

   13-06-2021


జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద దాడి..  ఇద్దరు పోలీసులు, ఒక పౌరుడు మరణించారు

జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద దాడి.. ఇద్దరు పోలీసులు, ఒక పౌరుడు మరణించారు

   12-06-2021


జూన్ 26 న  రాజ్ భవన్ వద్ద  రైతుల నిరసన

జూన్ 26 న రాజ్ భవన్ వద్ద రైతుల నిరసన

   12-06-2021


కోవాక్సిన్‌కు అత్యవసర ఆమోదాన్ని అమెరికా నిరాకరించడం వలన మన టీకా కార్యక్రమంపై ఎలాంటి ప్రభావం ఉండదు: ప్రభుత్వం

కోవాక్సిన్‌కు అత్యవసర ఆమోదాన్ని అమెరికా నిరాకరించడం వలన మన టీకా కార్యక్రమంపై ఎలాంటి ప్రభావం ఉండదు: ప్రభుత్వం

   12-06-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle