కేంద్రంతో చర్చలు విఫలం.. నమ్మలేమంటున్న రైతులు
02-12-202002-12-2020 08:25:27 IST
2020-12-02T02:55:27.971Z02-12-2020 2020-12-02T02:55:13.916Z - - 28-01-2021

రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను రద్దు చేయడమొక్కటే తమ నిరసనను ముగించేందుకు ఏకైక మార్గమని రైతు సంఘాలు తేల్చి చెప్పడంతో, కేంద్ర ప్రభుత్వం రైతులతో తలపెట్టిన చర్చలు ఎలాంటి పురోగతి లేకుండానే ముగిశాయి. మరో విడత చర్చలు గురువారం జరగనున్నాయి. ప్రధానంగా వివాదాస్పద వ్యవసాయ చట్టాలు సహా రైతులు లేవనెత్తిన అన్ని అంశాల అధ్యయనానికి కమిటీని ఏర్పాటు చేస్తామన్న కేంద్ర ప్రభుత్వ సూచనను రైతు సంఘాలు తోసిపుచ్చాయి. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో మంగళవారం ముగ్గురు సీనియర్ కేంద్ర మంత్రులతో 35 రైతు సంఘాల ప్రతినిధులు చర్చలు జరిపారు. చర్చల క్రమంలో రైతు సమస్యల పరిష్కారానికి కమిటీ ఏర్పాటు చేస్తామన్న సూచనను కేంద్ర మంత్రులు ముందుకు తెచ్చారు. కానీ, ఆ ప్రతిపాదనను రైతు సంఘాలు తిరస్కరించాయి. ఈ చర్చల్లో కేంద్రం తరఫున వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, రైల్వే, కామర్స్ అండ్ ఇండస్ట్రీ మంత్రి పీయూష్ గోయల్, వాణిజ్య శాఖ సహాయమంత్రి సోమ్ ప్రకాశ్ పాల్గొన్నారు. మూడు సాగు చట్టాల్లోని తమ అభ్యంతరాలను ప్రత్యేకంగా గుర్తించి, వాటితో గురువారం నాటి చర్చలకు రావాలని రైతు సంఘాల ప్రతినిధులకు ప్రభుత్వం ఒక అధికారిక ప్రకటనలో సూచించింది. సాగు చట్టాలపై అభ్యంతరాలను స్పష్టంగా చెబితే చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వారికి చెప్పామన్నారు. చర్చలు ఫలప్రదం కాకపోవడంతో ఢిల్లీ శివార్లలోని సింఘు, టిక్రీల్లో రైతుల శాంతియుత నిరసన కొనసాగుతోంది. ఘాజీపూర్ శివార్ల వద్ద జరుగుతున్న ఆందోళనల్లో రైతుల సంఖ్య భారీగా పెరింది. ఆందోళనపథంలో ఉన్న రైతాంగాన్ని శాంతింపచేసేందుకు కేంద్రం మంగళవారం జరిపిన చర్చలు ఆశించిన ఫలితానివ్వలేదు. చర్చల్లో పాల్గొన్న వారి సమాచారం ప్రకారం... తొలుత రైతు చట్టాల ద్వారా కలిగే ప్రయోజనాలపై ప్రభుత్వం ప్రజెంటేషన్ ఇచ్చింది. చట్టాల్లో అభ్యంతరకర నిబంధనలపై అధ్యయనం, పరిష్కారా నికి కేంద్ర మంత్రులు ఐదుగురితో ఓ కమిటీని ప్రతిపాదించగా.. రైతులు అభ్యంతరం చెప్పారు. చర్చలకు ముందు కేంద్రం అంతర్గతంగా సుదీర్ఘ సమాలోచనలు జరిపింది. కొత్త వ్యవసాయ చట్టాల రద్దు అసాధ్యమని తేల్చిచెబుతూ, ఆ చట్టాలపైనే ఈ కమిటీ చర్చిస్తుందన్నారు. రైతుల తరఫు ప్రతినిధులెవరో పేర్లు ఇవ్వాల్సిందిగా తోమర్ అభ్యర్థించారు. అయితే రైతులు ఈ ప్రతిపాదననే తోసిపుచ్చారు. సంస్కరణల పేరిట తెచ్చిన 3 చట్టాలను రద్దుచేయాల్సిందే. అంతవరకూ పోరాటాన్ని ఆపం. ప్రభుత్వం బలప్రయోగం చేసినా వెనకడుగు వేసేది లేదు అని స్పష్టం చేసినట్లు యూనియన్లలో పెద్దదైన భారతీయ కిసాన్ యూనియన్(ఏక్తా ఉగ్రహాన్) నేత రూప్సింగ్ తెలిపారు. కనీస మద్దతు ధర(ఎమ్ఎస్పీ) వ్యవస్థ కొనసాగుతుందని రైతులకు లిఖితపూర్వక హామీ ఇవ్వాలని హరియాణా బీజేపీ అధికార కూటమిలోని పార్టీ ‘జన నాయక జనతా పార్టీ(జేజేపీ)’ కేంద్రానికి సూచించింది. ఎమ్ఎస్పీ కొనసాగుతుందని ప్రధాని మోదీ, వ్యవసాయ మంత్రి తోమర్ పదేపదే చెబుతున్నారని, అదే విషయాన్ని లిఖితపూర్వకంగా ఇస్తే బావుంటుందని జేజేపీ అధ్యక్షుడు అజయ్ సింగ్ చౌతాలా పేర్కొన్నారు. మరోవైపు, రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని ఆరోపిస్తూ హరియాణా ప్రభుత్వానికి స్వతంత్ర ఎమ్మెల్యే సోంబిర్ సాంగ్వన్ మద్దతు ఉపసంహరించారు. రైతులను బాధిస్తోందని ఆయన ఆరోపించారు.

భారత్‌తో అమెరికా సంప్రదింపులు.. సహకారానికి ఒకే
11 minutes ago

నమ్మించి వంచించారు.. ఎవ్వరినీ వదలం.. ఢిల్లీ పోలీసు చీఫ్
3 hours ago

పెట్రోల్ రేట్.. కనీవినీ ఎరుగని అద్భుతం
4 hours ago

నేపాల్‌లో వ్యాక్సినేషన్ ప్రారంభం.. మోదీకి ప్రధాని ఓలి కృతజ్ఞతలు
5 hours ago

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 11,666 మందికి కరోనా
6 hours ago

ప్రపంచ అగ్రశ్రేణి ఐటీ కంపెనీల్లో 'TCS'కు మూడోస్థానం
6 hours ago

ఫిబ్రవరి 1న పార్లమెంటుకు రైతుల ర్యాలీ నిలిపివేత
8 hours ago

అమెరికా 71వ విదేశాంగ మంత్రిగా అంటోనీ బ్లింకెన్ నియామకం
9 hours ago

ఇంకేంటి.. సినిమా థియేటర్లు ఫుల్ కెపాసిటీతో..!
20 hours ago

డబుల్ డిజిట్ వృద్ధి భారత్‌కే సాధ్యం.. ఐఎమ్ఎఫ్ అంచనా
27-01-2021
ఇంకా