పంజాబ్ ఎన్నికల పోలింగ్ తేదీని సవరంచిన కేంద్ర ఎన్నికల సంఘం
17-01-202217-01-2022 19:09:01 IST
2022-01-17T13:39:01.575Z17-01-2022 2022-01-17T13:38:58.944Z - - 25-05-2022

కేంద్ర ఎన్నికల సంఘం. పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్ సింగ్ చన్నీ వినతికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. ఆయన చేసిన సూచనకు తగ్గట్లు.. పోలింగ్ డేట్ ను మార్చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో.. తొలుత పేర్కొన్నట్లుగా పంజాబ్ లో పోలింగ్ ను ఫిబ్రవరి 14న కాకుండా.. ఫిబ్రవరి 20న నిర్వహించేందుకు వీలుగా ఆరు రోజులు వాయిదా వేసింది. కాగా పంజాబ్ సిఎం పంజాబ్ ఎన్నికల పోలింగ్ తేదీని ఫిబ్రవరి 14 డిసైడ్ చేయటంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలింగ్ డేట్ సమయంలోనే యూపీలోని బెనారస్ లో గురు రవిదాస్ జయంతి ఉత్సవాలు జరుగుతుంటాయని.. వీటికి పంజాబ్ నుంచి లక్షలాది మంది బెనారస్ కు తరలి వెళతారని పేర్కొన్నారు. ఈ కారణంతో పోలింగ్ ను ఫిబ్రవరి 14 కాకుండా మరో తేదీకి మార్చాలని కోరారు. కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొన్న తేదీకి పోలింగ్ ను నిర్వహిస్తే.. లక్షలాది మంది ఓటు వేసే అవకాశాన్ని కోల్పోతారని.. అందుకే.. పోలింగ్ తేదీని వారం పాటు వాయిదా వేయాలని కోరారు. ముఖ్యమంత్రి లేవనెత్తిన పాయింట్ లో అర్థం ఉండటంతో ఈసీ సానుకూలంగా స్పందించింది. ముఖ్యమంత్రి చెప్పినట్లే ఫిబ్రవరి 14న కాకుండా ఫిబ్రవరి20న పోలింగ్ ను మారుస్తూ ప్రకటన విడుదల చేశారు. తాజా పరిణామాల నేపథ్యంలో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన కొత్త షెడ్యూల్ ను ఈసీ విడుదల చేసింది. జనవరి 25 - ఎన్నికల నోటిఫికేషన్ విడుదల, ఫిబ్రవరి 01 - నామినేషన్లకు తుది గడువు, ఫిబ్రవరి 02 - నామినేషన్ల పరిశీలనకు తుది గడువు, ఫిబ్రవరి 04 - నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరి గడువు, ఫిబ్రవరి 20 - ఎన్నికల పోలింగ్, మార్చి 10 - ఓట్ల లెక్కింపు.. ఎన్నికల ఫలితాల విడుదల.

మరో కీలకమైన పదవిలో భారతీయ-అమెరికన్
11-05-2022

మార్క్సిజంపై నమ్మకాన్ని పెంపొందించండి
10-05-2022

ఉక్రెయిన్లో పర్యటించిన అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్
10-05-2022

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ జాకెట్కి వేలంలో 90వేల డాలర్లు
10-05-2022

పాత నిబంధనను తెరపైకి తెచ్చిన సెర్బియా ..!
09-05-2022

దక్షిణ కొరియాలో పెరుగుతున్న కొత్త COVID-19 కేసులు
08-05-2022

రెండోసారి ఫ్రాన్స్ అధ్యక్షుడిగా మాక్రాన్ ప్రమాణ స్వీకారం
08-05-2022

OPEC క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర పెరిగింది ..!
06-05-2022

‘పద్మ’అవార్డుల కోసం ఆన్లైన్ నామినేషన్లకి ఆహ్వానం
06-05-2022

రక్షణ సహకారంపై దక్షిణ కొరియా, నార్వే ..!
02-05-2022
ఇంకా