బురేవి.. తుపాను ప్రమాదం పొంచి ఉందా..?
01-12-202001-12-2020 14:12:46 IST
Updated On 01-12-2020 14:25:11 ISTUpdated On 01-12-20202020-12-01T08:42:46.063Z01-12-2020 2020-12-01T08:42:40.683Z - 2020-12-01T08:55:11.433Z - 01-12-2020

నివర్ తుపాను ధాటికి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాలు తీవ్ర ఇబ్బందులు పడ్డాయి. నివర్ తుపాను తర్వాత మరో రెండు తుపానులు వచ్చే ప్రమాదం ఉందని కొద్దిరోజుల కిందటే భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అనుకున్నట్లుగానే మరో తుపాను ప్రమాదం పొంచి ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతాన్ని ఆనుకుని ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా బలపడింది. మంగళవారం సాయంత్రానికి తుపానుగా మారుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. తుపానుగా మారితే దీన్ని 'బురేవి' అని పిలవనున్నారు. ఈ తీవ్ర వాయుగుండం కన్యాకుమారికి తూర్పు, ఆగ్నేయ దిశగా 930 కిలోమీటర్లు, శ్రీలంకలోని ట్రింకోమలీకి తూర్పు, ఆగ్నేయ దిశగా 500 కిలోమీటర్ల దూరంలో ప్రస్తుతం ఉన్నట్లు అధికారులు తెలిపారు. తుపానుగా బలపడిన అనంతరం డిసెంబరు 2న ట్రింకోమలీ వద్ద తీరం దాటనుంది. రాగల 24 గంటల్లో తమిళనాడులోని పలు ప్రాంతాలు, కేరళ, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది. డిసెంబరు 3న తమిళనాడు, కేరళలోని పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. తమిళనాడు, కేరళలో 65 కిమీ వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించింది. ఈ హెచ్చరికల నేపథ్యంలో ఇరు రాష్ట్రాలలోని అధికారులు అప్రమత్తం అయ్యారు.

భర్తకు విడాకులు.. కొడుకుతో పెళ్లి.. ఇప్పుడు తల్లి
6 hours ago

వైట్ హౌజ్ కాదు.. వాషింగ్టన్ నే వదిలేస్తారట
4 hours ago

ట్రంప్‌పై బండ పడింది.. అభిశంసనకు ఆమోదం.. సెనేట్ నిర్ణయం ఫైనల్
7 hours ago

భారతదేశంలో మొదలైన వ్యాక్సినేషన్..
8 hours ago

ఎంత గ్యాప్ ఉంటే అంత సమర్థంగా వ్యాక్సిన్ పనితీరు.. సీరమ్ సైంటిస్టు
9 hours ago

తొమ్మిదో రౌండ్ చర్చలు 120 శాతం విఫలం.. రైతుసంఘాల వ్యాఖ్య
10 hours ago

భారత్ చైనా ప్రతిష్టంభన.. సడలింపు.. పాంగాంగ్ సరస్సు ప్రారంభం..
10 hours ago

కాసేపట్లో కరోనా వ్యాక్సిన్ ప్రారంభం.. ప్రపంచంలో మనమే టాప్
11 hours ago

ఏపీలో మద్యం ధరల పెంపు.. దేశంలో పెట్రోల్ ధరల పెంపు ఒక్కటేనా..
15-01-2021

జోబైడెన్ ప్రమాణ స్వీకారోత్సవంలో లేడీ గాగా, లోపెజ్ ప్రదర్శన
15-01-2021
ఇంకా