newssting
Radio
BITING NEWS :
ఇంద్రకీలాద్రిపై వైభవంగా జరుగుతున్న దసరా శరన్నవరాత్రోత్సవాలు. నాల్గవరోజు అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తోన్న దుర్గమ్మ. * పెచ్చులూడుతోన్న బెజవాడ కనకదుర్గా ఫ్లై ఓవర్. సోమవారం రాత్రి ఏపీఎస్పీ బెటాలియన్ కానిస్టేబుల్ రాంబాబుపై పడిన ఫ్లై ఓవర్ పెచ్చులు. తీవ్రగాయాలు కావడంతో రాంబాబును ఆస్పత్రికి తరలించిన సిబ్బంది. భారీ వర్షాల కారణంగానే ఇలా జరిగి ఉంటుందంటున్న అధికారులు. * తెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,486 కేసులు, ఏడుగురు మృతి. యాక్టివ్ గా ఉన్న 20,686 కేసులు. * తెలంగాణ ప్రయాణికులకు సర్కార్ శుభవార్త. దసరా సందర్భంగా ఈ నెల 24 వరకూ రాష్ట్రంలో వివిధ జిల్లాలకు 3000 స్పెషల్ బస్సులు. ఎంజీబీఎస్, జేబీఎస్, కూకట్‌పల్లి, ఎస్సార్ నగర్, అమీర్‌పేట, ఈసీఐఎల్, ఉప్పల్ క్రాస్ రోడ్డు, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల నుంచి నడవనున్న స్పెషల్ బస్సులు. * మహబూబాబాద్ వీడియో జర్నలిస్ట్ కొడుకు కిడ్నాప్. రూ.45 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న కిడ్నాపర్లు. పోలీసులకు ఫిర్యాదు చేసిన జర్నలిస్ట్. * ఏపీకి భారీ వర్షసూచన. నేడు కృష్ణా, గుంటూరు, తూ.గో., ప.గో జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం.

బ్రహ్మోస్.. రెండోసారి విజయవంతం..!

18-10-202018-10-2020 18:21:00 IST
Updated On 19-10-2020 15:39:21 ISTUpdated On 19-10-20202020-10-18T12:51:00.746Z18-10-2020 2020-10-18T12:50:57.582Z - 2020-10-19T10:09:21.065Z - 19-10-2020

బ్రహ్మోస్.. రెండోసారి విజయవంతం..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
భారత అమ్ములపొదిలో ఉన్న బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణిని భారత్ మరో సారి పరీక్షించింది.  బ్రహ్మోస్ క్షిపణిని భారత నేవీకి చెందిన స్టెల్త్ డెస్ట్రాయర్ ఐఎన్ఎస్ చెన్నై యుద్ధనౌక నుంచి ప్రయోగించారు. అరేబియా సముద్రంలో నిర్దేశించిన లక్ష్యాన్ని ఈ సూపర్ సోనిక్ మిస్సైల్ అత్యంత కచ్చితత్వంతో ఛేదించినట్టు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీఓ) వెల్లడించింది.

ఈ క్షిపణులు దాదాపు 400 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కూడా సునాయాసంగా ఛేదించగలవు. తాజా ప్రయోగానికి వినియోగించిన ఐఎన్‌ఎస్‌ చెన్నై యుద్ధ నౌక 2016 నుంచి తన నౌకాదళానికి సేవలు అందజేస్తోంది. ఇండియన్‌ నేవీ ప్రాజెక్టు 15Aలో భాగంగా స్వదేశీ పరిజ్ఞానంతో దీనిని అభివృద్ధి చేశారు.

బ్రహ్మోస్ క్షిపణి పనితీరు అద్భుతంగా ఉందని, గాల్లోకి లేచింది మొదలు లక్ష్యాన్ని తాకే వరకు అన్ని దశల్లోనూ ఇది సంతృప్తికర ఫలితాలను ఇచ్చిందని డీఆర్డీఓ శాస్త్రవేత్తలు తెలిపారు. బ్రహ్మోస్ ప్రయోగం విజయవంతం కావడంతో శాస్త్రవేత్తలను కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అభినందించారు. డీఆర్డీఓ చైర్మన్ డాక్టర్ సతీశ్ రెడ్డి కూడా తమ శాస్త్రవేత్తల కృషిని ప్రశంసించారు.

బ్రహ్మోస్ క్షిపణిని భారత్, రష్యా దేశాలు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. సెప్టెంబరు 20 కూడా విస్తృత శ్రేణికి చెందిన బ్ర‌హ్మోస్ క్రూయిజ్ క్షిప‌ణిని విజ‌య‌వంతంగా ప‌రీక్షించింది. ఒడిశాలోని చాందీపూర్ రేంజ్ నుంచి ఈ ప్ర‌యోగం నిర్వ‌హించారు. నెల రోజుల వ్యవధిలోనే 10 క్షిపణులను ప్రయోగించింది భారత్. తక్కువ పరిధి, ర్యామ్‌జెట్, సూపర్‌ సోనిక్, క్రూయిజ్ క్షిపణి అయిన బ్రహ్మోస్‌ను ఉపరితలం, సముద్రం (యుద్ధ నౌకల నుంచి), సముద్రం లోపల నుంచి (జలాంతర్గాముల నుంచి), గాలి నుంచి (యుద్ధ విమానాల ద్వారా) ప్రయోగించవచ్చు. 


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle