తాజ్ మహల్ లో బాంబు పెట్టాను.. ఇంకొద్ది సేపట్లో..!
04-03-202104-03-2021 14:24:31 IST
Updated On 04-03-2021 15:38:50 ISTUpdated On 04-03-20212021-03-04T08:54:31.789Z04-03-2021 2021-03-04T08:54:27.362Z - 2021-03-04T10:08:50.617Z - 04-03-2021

ప్రపంచంలోని ఏడు వింతల్లో ఆగ్రా లోని తాజ్ మహల్ కూడా ఒకటి. తాజ్ మహల్ ఉన్న ప్రాంతంలో ఎంతో హై సెక్యూరిటీ ఉంటుంది. ప్రతి రోజూ చాలా మంది తాజ్ మహల్ ను చూడడానికి వస్తూ ఉంటారు. అలాంటి తాజ్ మహల్ ను పేల్చి వేయబోతున్నామంటూ బెదిరింపులు వచ్చాయి. తాజ్ మహల్లో బాంబు పెట్టానని ఫోన్ చేసి కలకలం రేపాడు ఓ గుర్తు తెలియని వ్యక్తి. తనకు సైనిక నియామకాల్లో ఉద్యోగం రాలేదన్న ఆగ్రహంతో బాంబు పెట్టానని అతను పోలీసులకు చెప్పాడు. సైనిక నియామకాల్లో అవకతవకలు జరుగుతున్నాయని, అందుకే తనను తీసుకోలేదని అన్నాడు. తాను పెట్టిన బాంబు త్వరలోనే పేలుతుందని చెప్పాడు. వెంటనే అప్రమత్తమైన సీఐఎస్ఎఫ్, స్థానిక పోలీసులు అక్కడికి చేరుకుని పర్యాటకులను బయటకు పంపి తనిఖీలు చేపట్టారు. తాజ్ మహల్‌ను తాత్కాలికంగా మూసివేశారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేశామని, తాజ్‌మహల్‌లో ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదని ఆగ్రా పోలీసులు తెలిపారు. ఆ ఫోన్ కాల్ ఫిరోజాబాద్‌కు చెందిన వ్యక్తి చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ బెదిరింపు కాల్ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నామని వివరించారు. గురువారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తి యూపీ పోలీస్ ఎమర్జెన్సీ నెంబర్ 112కి కాల్ చేశాడు. తాజ్‌మహల్ లోపల బాంబులు పెట్టామని..కాసేపట్లో పేల్చేస్తామని చెప్పాడు. వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆగ్రా ఎస్పీ శివరామ్ యాదవ్ మాట్లాడుతూ.. సైనిక నియామకాల్లో అవకతవకలు జరుగుతున్నాయని.. తనకు సైనిక నియామకాల్లో ఉద్యోగం రాలేదని.. అందుకే తాజ్‌మహల్ లో బాంబు పెట్టానని.. త్వరలో అది పేలుతుందని ఓ వ్యక్తి పోలీస్ కంట్రోల్ రూమ్‌కి ఫోన్ చేసి చెప్పాడని తెలిపారు. దీంతో వెంటనే అప్రమత్తమైన సిబ్బంది అక్కడకు చేరుకుని పర్యాటకులను బయటకు పంపి విస్తృత తనిఖీలు చేపట్టారన్నారు. తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు లభించకపోవడంతో అది నకిలీ బెదిరింపు కాల్‌గా నిర్థారించారు.పర్యాటకులను బయటకు తరలించి మొత్తం జల్లెడపట్టారు. తాజ్‌మహల్ లోపల ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదని తెలుస్తోంది.

అనుమతి లేకుండా భారత సముద్ర జలాల్లో యుఎస్ నేవీ ఆపరేషన్.. పెంటగాన్ సమర్థన
10 hours ago

ఒకే రోజు లక్షా 45 వేల కేసులు.. ప్రాణాలకే ప్రమాదమంటున్న నిపుణులు
15 hours ago

టీకా ఉత్సవ్.. అర్హులందరికీ రికార్డు స్థాయిలో టీకాలు వేయండి.. మోదీ
21 hours ago

ముత్యాలు పండాయి అనడం కాదు.. నిజంగానే పండిస్తే మస్తు లాభాలు
21 hours ago

ఒక్కరోజులో 800 మంది మృతి.. భారత్‌లో కోరలు చాస్తున్న కరోనా
09-04-2021

వ్యాక్సిన్ ఉత్పత్తి తగ్గింది నిజమే.. కారణం ఏమిటంటే.. సీరమ్ సీఈఓ
09-04-2021

అధికార్లకు తరచు సమన్లు ఇవ్వడం వేధింపులో భాగమే.. సుప్రీం
09-04-2021

డబ్బు వసూలుకు మంత్రి డిమాండ్ చేసింది నిజమే.. సచిన్ వాజే
08-04-2021

పనిస్థలాల్లోనూ కోవిడ్19 వ్యాక్సిన్... అనుమతించనున్న కేంద్రప్రభుత్వం
08-04-2021

అవసరమైన వారికే టీకా.. కోరిన ప్రతివారికీ కాదు.. కేంద్రం స్పష్టీకరణ
08-04-2021
ఇంకా