చైనా సవాలుకు భారత్‌తోనే అడ్డుకట్ట.. అమెరికా రహస్య వ్యూహం
13-01-202113-01-2021 20:13:58 IST
2021-01-13T14:43:58.400Z13-01-2021 2021-01-13T14:34:17.711Z - - 17-01-2021

భారత్ శక్తిసామర్థ్యాలను మరింతగా ప్రోత్సహించడం ద్వారా మాత్రమే ప్రపంచానికి చైనా విసురుతున్న సవాలుకు అడ్డుకట్ట వేయగలమని అమెరికా రహస్య వ్యూహ పత్రం స్పష్టం చేసింది. 2018లో ఇండో-పసిఫిక్ వ్యూహాన్ని అమెరికా రూపొందించింది. భావసారూప్యత కలగిన దేశాలతో కలిసి చైనాకు చెక్ పెట్టే దిసగా పనిచేయాలని ఈ రహస్య వ్యూహ పత్రం పేర్కొంది. ఆవిదంగా మాత్రమే సరిహద్దుల్లో కవ్వింపులు, చొరబాట్లు, ఆక్రమణలు వంటి బీజింగ్ నాయకత్వం చేస్తున్న దూకుడు చేష్టలను అడ్డుకోగలమని ఈ రహస్య పత్రం స్పష్టం చేసింది. వాస్తవాధీన రేఖ వద్ద భారత్-చైనా మధ్య ప్రతిష్టంభనకు రెండేళ్ల ముందుగానే అమెరికా ఈ సరికొత్త వ్యూహానికి మెరుగులు దిద్దడం విశేషం. అత్యంత రహస్యంగా రూపొందించిన ఈ తాజా వ్యూహంలో భారత్ పేరును కనీసం 20 సార్లు పొందుపర్చారు. దక్షిణాసియాలో అత్యంత ప్రధాన దేశంగా భారత్ ఎదిగిందని, హిందూ మహా సముద్ర భద్రత విషయంలో బారత్ కీలక పాత్ర పోషించనుందని ఈ వ్యూహ పత్రం పేర్కొంది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో అమెరికా మిత్రపక్షాలను, అమెరికా భాగస్వామ్యాలను విచ్ఛిన్నపరిచి అమెరికాకు వ్యూహాత్మక పోటీదారుగా తయారు కావాలని చైనా భావిస్తున్నట్లు ఈ వ్యూహపత్రం పేర్కొంది. స్వేచ్ఛాయుత సమాజాలకు సవాలుగా నిలిచే అత్యధునాతన సాంకేతికత శక్తితో చైనా ఇప్పటికే తన ఆధిపత్యాన్ని ఉపయోగిస్తోందని అమెరికా వ్యూహ పత్రం హెచ్చరించింది. అమెరికా తన ప్రయోజనాల పరిరక్షణ కోసం రూపొందించే ఇలాంటి వ్యూహాత్మక పత్రాలను దాదాపు మూడు దశాబ్దాలవరకు బహిర్గతం చేయకుండా దాచి ఉంచుతారు. కానీ డొనాల్డ్ ట్రంప్ జాతీయ భద్రతా సలహాదారు రాబర్డ్ ఓబ్రియన్ 10 పేజీలతో కూడిన ఈ ఇండో-పసిఫిక్ వ్యూహపత్రాన్ని జనవరి 5న అందరికీ అందుబాటులో ఉంచడం విశేషం. భావసారూప్యత కలిగిన దేశాలతోపాటు భారత్‌ను శక్తివంతమైన దేశంగా మలచడం ద్వారానే ప్రపంచవ్యాప్తంగా చెక్ పెట్టగలమన్న అంచనాపైనే ఈ సరికొత్త వ్యూహం ఆధారపడి ఉంది. అనేక భద్రతా పరమైన అంశాల్లో భారత్ భాగస్వామ్యం వైపుగా ఢిల్లీ నాయకత్వం ఇప్పటికే అడుగులేస్తోంనది కూడా ఈ వ్యూహ పత్రం పేర్కొంది. ఈ నేపథ్యంలోనే దౌత్యపరంగా, సైనికపరంగా, ఇంటెలిజెన్స్ చానల్స్ పరంగా భారత్‌కు అన్నిరకాలుగా సహాయ సహకారాలను అందించాలని అమెరికా నిర్ణయించుకున్నట్లు తాజా వ్యూహపత్రం తెలిపింది.

మోదీ వ్యాక్సిన్ వేసుకుంటే చాలు అని అంటున్నారుగా..!
5 hours ago

భర్తకు విడాకులు.. కొడుకుతో పెళ్లి.. ఇప్పుడు తల్లి
12 hours ago

వైట్ హౌజ్ కాదు.. వాషింగ్టన్ నే వదిలేస్తారట
10 hours ago

ట్రంప్‌పై బండ పడింది.. అభిశంసనకు ఆమోదం.. సెనేట్ నిర్ణయం ఫైనల్
13 hours ago

భారతదేశంలో మొదలైన వ్యాక్సినేషన్..
14 hours ago

ఎంత గ్యాప్ ఉంటే అంత సమర్థంగా వ్యాక్సిన్ పనితీరు.. సీరమ్ సైంటిస్టు
14 hours ago

తొమ్మిదో రౌండ్ చర్చలు 120 శాతం విఫలం.. రైతుసంఘాల వ్యాఖ్య
16 hours ago

భారత్ చైనా ప్రతిష్టంభన.. సడలింపు.. పాంగాంగ్ సరస్సు ప్రారంభం..
16 hours ago

కాసేపట్లో కరోనా వ్యాక్సిన్ ప్రారంభం.. ప్రపంచంలో మనమే టాప్
16 hours ago

ఏపీలో మద్యం ధరల పెంపు.. దేశంలో పెట్రోల్ ధరల పెంపు ఒక్కటేనా..
15-01-2021
ఇంకా