నేరాలకు పాల్పడడం సోనూ సూద్ కు అలవాటుగా మారిపోయింది: బీఎంసీ
13-01-202113-01-2021 22:26:45 IST
2021-01-13T16:56:45.653Z13-01-2021 2021-01-13T16:55:51.235Z - - 17-01-2021

సోనూ సూద్ రియల్ హీరోగా ఎన్నో మంచి పనులు చేస్తూ వెళుతున్నారు. చాలా మందికి సహాయం చేస్తూ ఉన్నాడు. సోనూ సూద్ ను దేవుడిగా కొలిచే మనుషులు ఉన్నారు ఈ ప్రపంచంలో..! కానీ సోనూసూద్ మీద బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) తీవ్ర వ్యాఖ్యలు చేసింది. నేరాలకు పాల్పడటం ఆయనకు ఓ అలవాటుగా మారిందని.. ఎన్నిసార్లు చెప్పినా సోనూసూద్ వైఖరి మార్చుకోవడం లేదని అంటోంది బీఎంసీ. సోనూ సూద్ అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని.. నివాససముదాయాన్ని హోటల్‌గా మార్చి చట్టవిరుద్ధ పద్ధతిలో కమర్షియల్ లాభాలు పొందాలని భావిస్తున్నారని ఆరోపణలు గుప్పించింది. బాంబే హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లో బీఎంసీ సోనూసూద్ గురించి తీవ్ర ఆరోపణలు చేసింది. నేరాలకు అలవాటు పడ్డ వ్యక్తి అంటూ అఫిడవిట్ లో సోనూ సూద్ గురించి చెప్పింది బీఎంసీ.
ఈ వివాదమంతా ముంబైలోని జుహు ప్రాంతంలో సోనూసూద్‌కు శక్తి సాగర్ అనే పేరుతో ఆరు అంతస్థుల భవనం ఉంది. అనుమతులు తీసుకోకుండానే ఈ నివాస సముదాయాన్ని హోటల్‌గా మార్చారని బీఎంసీ అధికారులు సోనూ సూద్ కు నోటీసులు పంపించారు. సోనూ ఇందుకు స్పందించలేదని ఆ తర్వాత బీఎంసీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.తాను అన్ని అనుమతులు తీసుకున్నానని చెబుతూ ఉన్నారు సోనూ సూద్. బీఎంసీ అభ్యంతరాలను సవాల్ చేస్తూ కోర్టును ఆశ్రయించారు.
దిగువ కోర్టు ఆయన అభ్యర్థనను నిరాకరించడంతో హైకోర్టుకు వెళ్లారు. ఈ నేపథ్యంలో ఇందుకు సమాధానం ఇవ్వాలంటూ బాంబే హైకోర్టు, బీఎంసీని ఆదేశించింది. ఆ అఫిడవిట్లో సోనూ సూద్ మీద తీవ్ర ఆరోపణలు చేసింది. నేరాలకు పాల్పడటం ఆయనకు ఓ అలవాటుగా మారిందని.. ఎన్నిసార్లు చెప్పినా సోనూసూద్ వైఖరి మార్చుకోవడం లేదని చెబుతోంది బీఎంసీ. సోనూ సూద్ మీద బీఎంసీ ఇన్ని ఆరోపణలు చేయడంతో అభిమానులు కూడా గుర్రుగా ఉన్నారు. ఈ వివాదంలో సోనూ సూద్ ది కరెక్టా.. లేక బీఎంసీ ఆరోపణలు నిజమా అన్నది న్యాయస్థానాలే చెప్పాల్సి ఉంది. ఏది ఏమైనా సోనూ తప్పు చేసి ఉండడని అభిమానులు అభిప్రాయపడుతూ ఉండగా.. రాజకీయ కోణంలోనే బీఎంసీ ఇలా సోనూ సూద్ ని వేధిస్తోందని సామాజిక మాధ్యమాల్లో కామెంట్లు చేస్తూ ఉన్నారు.

మోదీ వ్యాక్సిన్ వేసుకుంటే చాలు అని అంటున్నారుగా..!
7 hours ago

భర్తకు విడాకులు.. కొడుకుతో పెళ్లి.. ఇప్పుడు తల్లి
14 hours ago

వైట్ హౌజ్ కాదు.. వాషింగ్టన్ నే వదిలేస్తారట
12 hours ago

ట్రంప్‌పై బండ పడింది.. అభిశంసనకు ఆమోదం.. సెనేట్ నిర్ణయం ఫైనల్
15 hours ago

భారతదేశంలో మొదలైన వ్యాక్సినేషన్..
16 hours ago

ఎంత గ్యాప్ ఉంటే అంత సమర్థంగా వ్యాక్సిన్ పనితీరు.. సీరమ్ సైంటిస్టు
16 hours ago

తొమ్మిదో రౌండ్ చర్చలు 120 శాతం విఫలం.. రైతుసంఘాల వ్యాఖ్య
18 hours ago

భారత్ చైనా ప్రతిష్టంభన.. సడలింపు.. పాంగాంగ్ సరస్సు ప్రారంభం..
18 hours ago

కాసేపట్లో కరోనా వ్యాక్సిన్ ప్రారంభం.. ప్రపంచంలో మనమే టాప్
18 hours ago

ఏపీలో మద్యం ధరల పెంపు.. దేశంలో పెట్రోల్ ధరల పెంపు ఒక్కటేనా..
15-01-2021
ఇంకా