వెంటాడుతున్న బర్డ్ ఫ్లూ భయం..!
05-01-202105-01-2021 17:19:37 IST
Updated On 05-01-2021 17:32:27 ISTUpdated On 05-01-20212021-01-05T11:49:37.357Z05-01-2021 2021-01-05T11:49:28.337Z - 2021-01-05T12:02:27.732Z - 05-01-2021

కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ ను ఇవ్వడానికి ఓ వైపు కేంద్ర ప్రభుత్వం సన్నాహకాలు చేస్తున్న సమయంలో పలు రాష్ట్రాలను బర్డ్ ఫ్లూ భయపెడుతోంది. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కారణంగా పక్షులు చనిపోయాయి. గతంలో భారతదేశంలో బర్డ్ ఫ్లూ ప్రబలిన కారణంగా కొన్ని నెలల పాటూ ప్రజలు చికెన్ తినాలంటేనే భయపడ్డారు. ఇప్పుడు చాలా రాష్ట్రాల్లో అదే పరిస్థితి ఎదురవుతోంది. కేరళ, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ తీవ్ర రూపం దాల్చింది. కేరళలోని కొట్టాయం, అలపూజ జిల్లాల్లో బర్డ్ ఫ్లూ వైరస్ గుర్తించారు. దీని కారణంగా ఇప్పటికే ఈ ప్రాంతంలో 12 వేల బాతులు చనిపోవడంతో చాలా టెన్షన్ పడుతూ ఉన్నారు. ఇక మరో 36,000 బాతులు చనిపోయే ప్రమాదం ఉందని అధికారులు వెల్లడించారు. మధ్యప్రదేశ్ మాంద్సౌర్లో బర్డ్ ఫ్లూ ప్రబలుతుండడంతో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. మంద్సౌర్ జిల్లా వ్యాప్తంగా 15 రోజుల పాటు చికెన్ సెంటర్లు మూసి వేయించారు. అలాగే కోడిగుడ్ల విక్రయాలను కూడా నిషేధిస్తూ ప్రకటన ఇస్తున్నారు. మంద్సౌర్ ప్రాంతంలో ఒకే రోజు 100 కాకులు చనిపోయాయి. ఇండోర్ ప్రాంతంలో ఇటీవలే ఎన్నో కాకులు చనిపోయాయి. ఆ చనిపోయిన కాకుల్లో బర్డ్ ఫ్లూ వైరస్‌ని గుర్తించారు అధికారులు. రోడ్లపై వందలాది పక్షుల మృతి.. దీంతో అధికారులు చికెన్ సెంటర్లను మూసి వేయడమే కాకుండా.. పెంపకం దారులను అలర్ట్ కూడా చేస్తున్నారు. మరికొన్ని జిల్లాల్లో కూడా బర్డ్ ఫ్లూ మరణాలు వెలుగు చూడడం జరిగింది. ఇండోర్‌లో చనిపోయిన కాకుల్లో ఏవియన్ ఇన్ఫ్లుఎంజా (బర్డ్ ఫ్లూ) గుర్తించామని అధికారులు చెప్పారు. రాపిడ్ రెస్పాన్స్ టీం కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేస్తోంది ప్రభుత్వం. 2020 డిసెంబర్ 23 నుంచి 2021 జనవరి 3 వరకు మధ్యప్రదేశ్ ఇండోర్‌లో 142, మాంద్సౌర్లో 100, అగర్-మాల్వాలో 112, ఖార్గోన్లో 13, సెహోర్ జిల్లాలో తొమ్మిది కాకులు మరణించాయి. ఇక కేరళలోని కొట్టాయం, అలపూజ జిల్లాల్లో బర్డ్ ఫ్లూ వైరస్ గుర్తించారు. ఇతర రాష్ట్రాలకు కూడా బర్డ్ ఫ్లూ వ్యాపించే అవకాశం ఉందని అధికారులు చెబుతూ ఉన్నారు. ఓ వైపు కరోనా భయం వెంటాడుతూ ఉండగా.. మరో వైపు ఇలా బర్డ్ ఫ్లూ కలకలం ప్రజలను టెన్షన్ పెడుతోంది.

వ్యాక్సిన్ తీసుకోడానికి భయపడకండంటున్న కేంద్రప్రభుత్వం
5 hours ago

సరిహద్దుల్లో ఏకంగా గ్రామాన్నే నిర్మించిన చైనా.. మోడీ ఏం చేస్తారో!
10 hours ago

హింస సమాధానం కానేకాదు.. మెలనియా ట్రంప్ వీడ్కోలు సందేశం
11 hours ago

రైతులతో చర్చలు జనవరి 20కి వాయిదా.. పంతం వద్దన్న తోమర్
13 hours ago

రామమందిర నిర్మాణానికి డిగ్గీ రాజా సంచనల విరాళం
14 hours ago

రిపబ్లిక్ డే పెరేడ్లో మొట్టమొదటి మహిళా పైలట్..
15 hours ago

రైతుల ట్రాక్టర్ ర్యాలీపై పోలీసులదే నిర్ణయం: సూచన
18 hours ago

ఘోర రోడ్డు ప్రమాదం.. 13 మంది మృతి..!
19 hours ago

1075 ఈ నెంబర్ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్
18 hours ago

అమెరికా ఆన్ 'హై అలర్ట్'
17 hours ago
ఇంకా