newssting
Radio
BITING NEWS :
కరోనా సంక్షోభ తరుణంలోనూ వైద్యరంగంలో విశేష సేవలందిస్తున్న సంస్థలు, వైద్యులను ప్రముఖ మార్కెట్‌ రిసెర్చ్‌ కంపెనీ ‘టాప్‌ గ్యాలెంట్‌ మీడియా’ అవార్డులతో సత్కరించనుంది. ఈ సంవత్సరానికి(2020)గానూ సర్జికల్‌ అంకాలజీలో అత్యంత విశ్వసనీయ ఆస్పత్రిగా హైదరాబాద్‌లోని బసవతారకం ఇండో అమెరికన్‌ కేన్సర్‌ ఆస్పత్రిని ఎంపిక చేయడం విశేషం * సుక్మా జిల్లాలోని టల్మెటాలా ప్రాంతంలో సీఆర్పీఎఫ్ బలగాలపై మావోయిస్టులు మళ్లీ రెచ్చిపోయారు. ఐఈడీ బ్లాస్ట్‌లతో విరుచుకుపడ్డారు. ఈ దాడి శనివారం అర్థరాత్రి జరిగింది. ఈ దాడిలో సీఆర్పీఎఫ్‌ కోబ్రాకి చెందిన ఎనిమిది మంది జవాన్లు గాయపడగా ఓ సీఆర్పీఎఫ్ అధికారి ప్రాణాలను కోల్పోయారు * కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ దేశరాజధాని ఢిల్లీలో భారీఎత్తున రైతులు నిరసనలు కొనసాగిస్తున్నారు. బురారి ప్రాంతంలోని నిరంకార్‌ మైదానంలో నిరసనకు పోలీసులు అనుమతిచ్చిన నేపథ్యంలో వేలమంది రైతులు నిరసన స్థలికి చేరుకుని కేంద్రంపై నిరసన వ్యక్తం చేశారు * పెట్రో ధరలు భగ్గుమంటున్నాయి. తొమ్మిది రోజులుగా చమురు ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. ఈనెల 19 నుంచి శనివారం వరకు (25వ తేదీ మినహా) ధరలు పెరుగుతూనే ఉన్నాయి. శనివారం అర్ధరాత్రి కూడా మరోసారి ధరలు పెరిగాయి. గడిచిన పది రోజుల్లో పెట్రోల్‌పై లీటర్‌కు రూ.1.28, డీజిల్‌ రూ.2.09 చొప్పున పెరిగింది * బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఆదివారం జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఉదయం 10 గంటలకు ఆయన ప్రత్యేక విమానంలో బేగంపేటకు చేరుకుని.. 10:45 గంటలకు భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి చేరుకుని అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారు * రాష్ట్రాన్ని చలి వణికిస్తోంది. రాష్ట్రంలో కనిష్ఠ ఉష్ణోగ్రత భారీగా పడిపోయింది. మెదక్‌లో అతితక్కువగా 14.8 డిగ్రీలు, హైదరాబాద్‌లో 17డిగ్రీల కనిష్ఠ ఉష్ణో గ్రత నమోదైంది. గాలిలో తేమ శాతం పెరిగింది * బంగాళాఖాతంలో మరో అల్పపీడన ద్రోణి బయలుదేరింది. ఇది తుపాన్‌గా మారే అవకాశాలు ఉండడంతో దీనికి బురేవి అని నామకరణం చేయడానికి సిద్ధమయ్యారు. ఈ ప్రభావంతో ఆదివారం నుంచి సముద్ర తీరాల్లో వర్షాలు పడ నున్నాయి. ఒకటో తేదీ నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ కేంద్రం ప్రకటించింది * జాతీయ ప్రవేశ పరీక్షలు... నీట్‌, జేఈఈ మెయిన్‌, అడ్వాన్స్‌డ్‌కు సిద్ధమయ్యే విద్యార్థులు తమ ప్రతిభా సామర్థ్యాలను పరీక్షించుకునేందుకు ‘కోటా’ ఆన్‌లైన్‌ ప్రాక్టీస్‌ టెస్ట్‌ సిరీస్‌ సిద్ధం చేసినట్లు ఐఐటీ, జేఈఈ ఫోరమ్‌ కన్వీనర్‌ లలిత్‌ కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు www.iitjeeforum.com వెబ్‌సైట్‌లో లాగిన్‌ కావొచ్చన్నారు * వైకుంఠ ఏకాదశి, ద్వాదశి సందర్భంగా భక్తులకు పదిరోజుల పాటు వైకుంఠ ద్వార ప్రవేశాన్ని కల్పించనున్నట్టు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. డిసెంబరు 25నుంచి పది రోజుల పాటు వైకుంఠ ద్వారాలు తెరిచే ఉంచాలని నిర్ణయించినట్టు వివరించారు.

కీలక దశకు చేరుకున్న దేశీయ వ్యాక్సిన్‌.. 26 వేలమందిపై ప్రయోగం

17-11-202017-11-2020 08:08:03 IST
2020-11-17T02:38:03.219Z17-11-2020 2020-11-17T02:38:00.832Z - - 30-11-2020

కీలక దశకు చేరుకున్న దేశీయ వ్యాక్సిన్‌.. 26 వేలమందిపై ప్రయోగం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రపంచ దిగ్గజ కంపెనీలతో ఏమాత్రం తీసిపోనివిధంగా భారత బయోటిక్ కంపెనీ సోమవారం అత్యంత కీలక ప్రకటన చేసింది. తమ సంస్థ ఉత్పత్తి చేస్తున్న ‘కోవాక్సిన్’ వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్ లోకి ప్రవేశించిందని భారత్ బయోటెక్ సోమవారం ప్రకటించింది. ఐసీఎంఆర్ భాగస్వామ్యంతో 25 కేంద్రాల్లో 26,000 మంది వాలంటీర్లతో ఈ ట్రయల్స్‌ నిర్వహిస్తున్నట్టు తెలిపింది.  

భారతదేశంలో కరోనా వ్యాక్సిన్ కోసం నిర్వహించిన అతిపెద్ద క్లినికల్ ట్రయల్ ఇదని సంస్థ చైర్మన్ ఎండీ కృష్ణ ఎల్లా వెల్లడించారు. కోవిడ్19 కి సంబంధించిన ఇతర వ్యాక్సీన్ల విషయంలో కూడా తమ కంపెనీ అధ్యయనం చేస్తోందన్నారు. ఈ ట్రయల్ 2021 ప్రారంభంలో పూర్తవుతుందన్నారు. ఇది ముక్కులో వేసుకునే డ్రాప్స్ మాదిరిగా ఉండే ఈ వ్యాక్సిన్‌ వచ్చే ఏడాది నాటికి సిద్దమవుతుందని వివరించారు. 

దేశీయ వ్యాక్సిన్‌గా భావిస్తున్న కోవాక్సిన్ ప్రపంచంలోనే చౌకైన వ్యాక్సిన్‌గా ఉంటుందని అంచనా. కోవాక్సిన్‌ మొదటి, రెండో దశ ట్రయల్స్ తాత్కాలిక విశ్లేషణ విజయవంతంగా పూర్తి అయిందని ఇటీవల సంస్థ ప్రకటించిన సంగతి తెలిసిందే. 

కరోనా మహమ్మారి నివారణకు వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెచ్చే క్రమంలో ఇప్పటికే రెండు అమెరికా దిగ్గజ కంపెనీలు కీలక విషయాన్ని ప్రకటించగా, భారత బయోటిక్ కూడా తానేమాత్రం తీసిపోలేదని ప్రకటించడం విశేషం. 

కోవిడ్ వ్యాక్సిన్ మూడోదశ పరీక్షలు నిర్వహించడానికి అనుమతించాలని కోరుతూ బారత్ బయోటిక్ అక్టోబర్ 2న బారత డ్రగ్ కంట్రోలర్ జనరల్‌కి విన్నపం పంపిని విషయం తెలిసిందే.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle