newssting
Radio
BITING NEWS :
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు. 200 పాయింట్లకు పైగా నష్టపోయి 14,883 వద్ద ట్రేడ్ అవుతున్న నిఫ్టీ. * కరోనా విజృంభణ నేపథ్యంలో మహారాష్ట్ర - ఛత్తీస్ ఘడ్ సరిహద్దులో హై అలర్ట్. తెలంగాణ సరిహద్దుల్లో కరోనా నియంత్రణకు కఠిన నిబంధనలు అమలు. ములుగు జిల్లాకు వచ్చే వలస కూలీల విషయంలో అప్రమత్తమైన అధికారులు. పని ప్రదేశాల్లో మాస్క్ లేని కూలీలకు నో ఎంట్రీ. * ఎస్వీబీసీ ట్రస్ట్ కు భారీ విరాళం. రూ.9 కోట్ల విరాళం ఇచ్చిన పోస్కో గ్రూప్ అధినేత సంజయ్ పస్సి. టీటీడీ అడిషనల్ ఈఓ ధర్మారెడ్డికి డీడీ అందజేత. * జూబ్లీహిల్స్ లో ట్రాఫిక్ పోలీసులపై యువకుడి దాడి. అధిక శబ్దం చేస్తూ వెళ్తున్న బైక్ ను అడ్డుకున్న పోలీసులు. బైక్ ను ఆపినందుకు స్నేహితులతో కలిసి ట్రాఫిక్ సీఐ ముత్తు, సిబ్బందిపై దాడి. నిందితుడు దర్వేజ్ సహా ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. * మాదాపూర్ కు చెందిన వ్యాపారిని కిడ్నాప్. చెన్నైకి చెందిన ఆర్టిస్టులు అమర్నాథ్ ను కిడ్నాప్ చేసినట్లు సమాచారం. కిడ్నాప్ అనంతరం అమర్నాథ్ భార్యకు ఫోన్ చేసి రూ.4 లక్షలు డిమాండ్ చేసిన కిడ్నాపర్లు. అనంతరం 80 ఫోన్ కాల్స్ చేసిన గ్యాంగ్. చెన్నైకి చెందిన ఆర్టిస్టులు అరెస్ట్. * ఏపీలో రేపట్నుంచి ఎస్ఈసీ నిమ్మగడ్డ పర్యటన. మున్సిపల్ ఎన్నికలపై సమీక్ష నిర్వహించనున్న నిమ్మగడ్డ.

వరవరరావుకు ఎట్టకేలకు బెయిల్

22-02-202122-02-2021 12:13:53 IST
Updated On 22-02-2021 12:37:42 ISTUpdated On 22-02-20212021-02-22T06:43:53.480Z22-02-2021 2021-02-22T06:43:48.674Z - 2021-02-22T07:07:42.950Z - 22-02-2021

వరవరరావుకు ఎట్టకేలకు బెయిల్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
గోరేగావ్ కుట్ర కేసులో అరెస్ట్ అయి, దాదాపు ఏడాది పాటు జైలు జీవితాన్ని గడిపిన విప్లవ నేత వరవరరావుకు బాంబే హైకోర్టు బెయిల్ ను మంజూరు చేసింది. ఆయన అనారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేస్తున్నట్టు ఈ సందర్భంగా న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. తనపై ఆరోపణలు ఉన్న కేసు విచారణకు సంబంధించి, పోలీసులకు సహకరించాలని, సాక్ష్యాల తారుమారుకు ప్రయత్నిస్తే, బెయిల్ ను రద్దు చేస్తామని ఈ సందర్భంగా న్యాయమూర్తి వరవరరావును హెచ్చరించారు. నేటి సాయంత్రం లోగా బెయిల్ పేపర్లను జైలు అధికారులకు అందించి, విడుదలయ్యేలా చూస్తామని ఆయన తరఫు న్యాయవాదులు వెల్లడించారు.

బాంబే హైకోర్టు ప్రత్యేక షరతులతో ఆరునెలల మెడికల్ బెయిల్ మంజూరు చేసింది. స్పెషల్ ఎన్ఐఎ కోర్టు పరిధిలోనే (ముంబైలోనే) ఉండాలని, అలాగే గత ఎఫ్ఐఆర్ కు దారి తీసిన కార్యకలాపాలు చేయగూడదంటూ షరతులు విధించింది. దీంతో వరవరరావు ఆరోగ్యంపై ఇప్పటికే తీవ్ర ఆందోళనలో ఉన్న కుటుంబ సభ్యులు, పౌర హక్కు సంఘాల ప్రతినిధులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కొద్దిరోజుల కిందట వరవరరావుకు కరోనా సోకడంతోపాటు, తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. తన భర్త వరవరావును బెయిల్‌పై విడుదల చేయాలని కోరుతూ భార్య హేమలత బొంబే హైకోర్టును ఆశ్రయించారు.  

రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం తన భర్తకు బెయిల్‌ ఇవ్వాలన్న వరవరావు భార్య పిటీషన్‌పై బాంబే కోర్టు సానుకూలంగా స్పందించింది. ఈ పరిస్థితుల్లో ఆయనను జైలుకు పంపడం సరికాదని భావించిన కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. అవసరమైనప్పుడు రావు విచారణకు హాజరుకావాలని, అయితే  భౌతిక హాజరునుంచి  మినహాయింపు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని కోర్టు పేర్కొంది. మరోవైపు ఈ ఉత్తర్వుపై మూడు వారాల పాటు స్టే  విధించాలని కోరిన అదనపు సొలిసిటర్ జనరల్ అనిల్ సింగ్  అభ్యర్ధనను కోర్టు తిరస్కరించింది. వరవర రావుకు బెయిల్ ఇవ్వాలని పలువురు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.. వరవరరావు వయసు, ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని బెయిల్ ఇవ్వాలని చాలా మంది కోరారు. ఎట్టకేలకు వరవరరావుకు బెయిల్ మంజూరు చేశారు. 

కరోనా అప్డేట్.. గత 24 గంటల్లో 16,488 మందికి కరోనా

కరోనా అప్డేట్.. గత 24 గంటల్లో 16,488 మందికి కరోనా

   37 minutes ago


కొరియన్ బ్యాండ్‌పై హోస్ట్ జాతి వివక్షా వ్యాఖ్యలు.. జర్మన్ రేడియో క్షమాపణ

కొరియన్ బ్యాండ్‌పై హోస్ట్ జాతి వివక్షా వ్యాఖ్యలు.. జర్మన్ రేడియో క్షమాపణ

   an hour ago


కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ.. పెరుగుతున్న కరోనా కేసులు

కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ.. పెరుగుతున్న కరోనా కేసులు

   2 hours ago


ఎన్నికల షెడ్యూల్ ఇదే..!

ఎన్నికల షెడ్యూల్ ఇదే..!

   13 hours ago


భారత్ పాక్ కాల్పుల విరమణ.. సూత్రధారి దోవల్

భారత్ పాక్ కాల్పుల విరమణ.. సూత్రధారి దోవల్

   21 hours ago


కరోనా కేసుల అప్డేట్.. గత 24 గంటల్లో 16,577 మందికి కరోనా..!

కరోనా కేసుల అప్డేట్.. గత 24 గంటల్లో 16,577 మందికి కరోనా..!

   20 hours ago


గ్రీన్‌కార్డు దరఖాస్తుదారులకు బైడెన్ గ్రీన్ సిగ్నల్

గ్రీన్‌కార్డు దరఖాస్తుదారులకు బైడెన్ గ్రీన్ సిగ్నల్

   a day ago


మోదీ.. ఉద్యోగమివ్వు.. 50 లక్షల ట్వీట్లతో ట్విట్టర్‌లో ట్రెండింగ్

మోదీ.. ఉద్యోగమివ్వు.. 50 లక్షల ట్వీట్లతో ట్విట్టర్‌లో ట్రెండింగ్

   a day ago


టీ చేయకపోతే చావగొడతారా.. భార్య అంటే వస్తువా.. ధ్వజమెత్తిన హైకోర్టు

టీ చేయకపోతే చావగొడతారా.. భార్య అంటే వస్తువా.. ధ్వజమెత్తిన హైకోర్టు

   18 hours ago


అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలు ఉన్న వాహనం

అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలు ఉన్న వాహనం

   26-02-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle