newssting
Radio
BITING NEWS :
శరన్నవరాత్రోత్సవాల్లో మూడో రోజు ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమ్మవారు గాయత్రీదేవి అలంకరణలో దర్శనమిస్తున్నారు. అమ్మవారి దర్శనార్థం ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ. * నేడు, రేపు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షసూచన. ఏపీ తీరానికి దక్షిణంగా పశ్చిమ వాయువ్య మధ్య బంగాళాఖాతంలో 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం. రెండ్రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ అధికారులు. భారీ వర్షాలకు బెంబేలెత్తిపోతున్న హైదరాబాద్ వాసులు. భారీ వర్షాలపై మైకుల్లో నగరవాసులను అలర్ట్ చేస్తున్న జీహెచ్ఎంసీ సిబ్బంది. * దుర్గమ్మకు విజయవాడ ఎన్‌ఆర్ఐ తాతినేని శ్రీనివాస్ అనే భక్తుడి కానుక. రూ.45 లక్షల విలువైన ఏడువారాల వజ్రాల నగలు దుర్గగుడి ఈవో సురేశ్ బాబుకు అందజేత. * భారీ వర్షాలకు కుంగిన పురానాపూల్ బ్రిడ్జి. వరద నీటి ఉద్ధృతి పెరగడంతో పిల్లర్ కుంగుబాటు. వాహనాల రాకపోకలు నిలిపివేత. మరమ్మతులు పూర్తయిన అనంతరం వాహనాల రాకపోకల పునరుద్ధరణ. * అసోం, మిజోరం గ్రామాల ప్రజల మధ్య ఘర్షణ. సరిహద్దుల వద్ద పరిస్థితి ఉద్రిక్తం. అసోం ప్రజలపై మిజోరం వాసుల దాడి. గుడిసెలు, స్టాల్స్‌కు నిప్పు పెట్టిన అసోం వాసులు. ప్రధాని, హోంశాఖకు సమాచారం అందించిన అసోం ముఖ్యమంత్రి. * కడప జిల్లా రాజాంలో గంజాయి ముఠా గుట్టురట్టు. 8 మంది అరెస్ట్, 53 కేజీల గంజాయి, బైక్ స్వాధీనం.

బాబ్రీ మసీదు కూల్చివేత తీర్పు.. రాష్ట్రాల్లో హై అలర్ట్..!

30-09-202030-09-2020 09:37:58 IST
Updated On 30-09-2020 10:35:15 ISTUpdated On 30-09-20202020-09-30T04:07:58.480Z30-09-2020 2020-09-30T04:07:54.969Z - 2020-09-30T05:05:15.082Z - 30-09-2020

బాబ్రీ మసీదు కూల్చివేత తీర్పు.. రాష్ట్రాల్లో హై అలర్ట్..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

బాబ్రీ మసీదు కూల్చి‌వేత కేసులో ల‌క్నోలోని సీబీఐ ప్రత్యేక న్యాయ‌స్థానం ఈరోజు తీర్పు వెల్ల‌డిం‌చ‌ను‌న్నది. 1992 డిసెం‌బర్‌ 6న కర‌సే‌వ‌కులు అయో‌ధ్య‌లోని బాబ్రీ మసీ‌దును కూల్చి‌వే‌శారు. దీనిపై న‌మోదైన కేసు 28 ఏండ్ల‌పాటు విచార‌ణ కొన‌సాగింది. ఈ కేసులో బీజేపీ వ్య‌వ‌స్థాప‌కులు ఎల్‌కే అద్వానీ, ముర‌ళీ‌మ‌నో‌హ‌ర్‌‌జోషి, పార్టీ సీనియ‌ర్ నేత‌లు ఉమా భారతి, వినయ్‌ కతి‌యార్‌, సాధ్వి రితం‌బర, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ మాజీ సీఎం కల్యా‌ణ్‌‌సింగ్ స‌హ మొత్తం 49 మందిని సీబీఐ నింది‌తు‌లుగా చేర్చింది. 

తీర్పు వెలువరించే రోజు నాటికి జీవించి ఉన్న 32 మంది ముద్దాయిలు కూడా కోర్టు ఎదుట హాజరుకావాలని సీబీఐ జడ్జి ఎస్‌కే యాదవ్‌ 16వ తేదీన ఆదేశించారు. కళ్యాణ్‌ సింగ్‌ ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఉండగా బాబ్రీ విధ్వంసం జరిగింది. రాజస్తాన్‌ గవర్నర్‌గా పదవీ కాలం ముగియగానే గత సెప్టెంబర్‌ నుంచి, ఆయనపై విచారణ కొనసాగింది.

ప్ర‌స్తుతం ఉమా భార‌తి, కళ్యాణ్ సింగ్‌ల‌కు క‌రోనా సోక‌డంతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్ర‌ధాన నిందుతుల్లో ఒక‌రైన 92 ఏండ్ల ఎల్‌కే అధ్వానీ వ‌యోభారంతో ఉన్నారు. దీంతో ముగ్గురు అగ్ర‌నేత‌లు కోర్టుకు హాజ‌ర‌య్యే అవ‌కాశం త‌క్కువ‌గా ఉన్న‌ది. 

సున్నిత‌మైన కేసు కావ‌డంతో కేంద్ర హోంశాఖ అప్ర‌మ‌త్త‌మైంది. తీర్పు వెలువ‌డిన త‌ర్వాత ఎలాంటి అవాంఛ‌నీయ సంఘ‌ట‌ల‌ను చోటుచేసుకోవ‌ద్ద‌ని, శాంతి భ‌ద్ర‌త‌ల‌కు విఘాతం క‌ల‌గ‌కుండా చూడాల‌ని రాష్ట్రాల‌ను ఆదేశించింది. 

1992లో బాబ్రీ మ‌సీదు కూల్చివేత సంద‌ర్భంగా జరిగిన ఘ‌ర్ష‌నల వ‌ల్ల దేశ్యాప్తంగా సుమారు మూడు వేల మంది ప్రాణాలు కోల్పోయారు. దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన ఈ కేసును సీబీఐ విచారించింది. ఈ క్రమంలో సీబీఐ 351 మంది సాక్షుల్ని న్యాయస్థానం ఎదుట ప్రవేశపెట్టింది. 600 డాక్యుమెంట్లను రుజువులుగా చూపించింది. 48 మందిపై అభియోగాలు నమోదు చేశారు. విచారణ జరుగుతుండగానే 16 మంది ప్రాణాలు కోల్పోయారు. 


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle