newssting
Radio
BITING NEWS :
భారత ప్రభుత్వం ప్రత్యర్థుల ఫోన్లపై నిఘా పెట్టడానికి ఇజ్రాయెల్‌కు చెందిన పెగసస్‌ స్‌పైవేర్‌ను ఉపయోగిస్తోందంటూ వెలువడ్డ వార్తలపై పాకిస్తాన్‌ ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పాకిస్తాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌తోపాటు పలువురు విదేశీ ప్రముఖులు పేర్లు ఈ జాబితాలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయని గుర్తుచేసింది. ఈ వ్యవహారంలో ఐక్యరాజ్య సమితి వెంటనే జోక్యం చేసుకోవాలని, సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరింది. * ప్రతిపక్ష నేతల ఫోన్లను హ్యాకింగ్‌ చేస్తున్నారంటూ కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ కొనసాగిస్తున్న ఆరోపణల పరంపరంపై బీజేపీ అధికార ప్రతినిధి రాజ్యవర్దన్‌ రాథోడ్‌ ఘాటుగా స్పందించారు. ఫోన్‌ నిజంగా హ్యాకింగ్‌ అయ్యిందని రాహుల్‌ గాంధీ భావిస్తే దర్యాప్తు కోసం అదే ఫోన్‌ను సమర్పించే దమ్ముందా? అని సవాలు విసిరారు. * కోవిడ్‌ విపత్కర పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత సమర్థవంతంగా పని చేసిందని రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ పేర్కొన్నారు. యుద్ద ప్రాతిపదికన ఆస్పత్రుల్లో పడకలు, మందులు, ఆక్సిజన్‌ నిల్వలు ఇతర మౌలిక సదుపాయాలను పెంపొందించిందని చెప్పారు. రాష్ట్ర గవర్నర్‌గా రెండేళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. * రాష్ట్రంలో వరద ముంపునకు గురైన వారిని ఆదుకోవాలని ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసై టీ (ఐఆర్‌సీఎస్‌) ప్రతి నిధులను గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ కోరారు. రాజ్‌భవన్‌ అధికారులు కూడా ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుని రెడ్‌క్రాస్‌ సొసైటీ ద్వారా బాధితులకు సాయం అందేలా కృషి చేయాలని ఆమె ఆదేశించారు. * కంగ్రాట్స్, నారప్ప చిత్రాన్ని ఇప్పుడే చూశా. నటన పరంగా ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసినట్టుంది. సినిమా చూస్తున్నంత సేపు ఎక్కడా వెంకటేష్ కనబడలేదు, నారప్పే కనిపించాడు. మొత్తానికి ఈ చిత్రంలో కొత్త వెంకటేష్ను చూపించావు. పాత్రను ఎంతగానో అర్థం చేసుకొన్నావ్‌, అందుకే అంతగా ఆ రోల్‌లో లీనమై నటించావు. నీలో ఉండే నటుడు ఎప్పుడూ ఒక తపన తో, తాపత్రయం తో ఉంటాడు. అలాంటి వాటికి ఈ చిత్రం మంచి ఉదాహరణ అని మెగాస్టార్‌ తెలిపారు.

అయోధ్య శ్రీరామ మందిరంపై రాజకీయ రగడ

14-06-202114-06-2021 17:41:16 IST
2021-06-14T12:11:16.297Z14-06-2021 2021-06-14T12:10:39.473Z - - 25-07-2021

అయోధ్య శ్రీరామ మందిరంపై రాజకీయ రగడ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఈ రోజుల్లో కాదేదీ ఆరోపణలకు అనర్హం అన్న చందంగా పరిస్థితులు వచ్చాయి. ముఖ్యంగా సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏదైనా విషయంపై ఆరోపణలు వస్తే నిజా నిజాలు తెలుసుకోకుండా వాటిని ట్రోల్ చేసేస్తున్నారు. మీడియా సైతం ఆ వార్తలకి ప్రాముఖ్యం కల్పిస్తూ న్యూస్ కవరేజ్ చేస్తున్నారు. తాజాగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన అయోధ్య మందిర నిర్మాణంపై కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఈ మందిర నిర్మాణాన్ని తలపెట్టిన శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్టుపై ఈ ఆరోపణలు రావడం విశేషం. ఇంతకీ విషయం ఏమిటంటే రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పీ) నేత పవన్ పాండేలు ఇద్దరూ ట్రస్ట్‌ మీద ఆరోపణలు చేశారు. అయోధ్యలో 2 కోట్ల రూపాయలు విలువ చేసే భూముల్ని.. శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్టు రూ.18.5 కోట్లకు కొనుగోలు చేసినట్టు సంజయ్ సింగ్ ఆరోపించారు. రామాలయ ట్రస్టు ప్రధాన కార్యదర్శిగా సేవలందిస్తున్న చంపత్ రాయ్ ఆదేశాలతోనే ఈ రెండు చెల్లింపులు జరిగాయని కూడా ఆప్ నేత ఆరోపించారు. మరోవైపు, సమాజ్‌వాదీ పార్టీ నేత, రాష్ట్ర మాజీ మంత్రి పవన్ పాండే సైతం ఇదే తరహా ఆరోపణలు చేశారు. కేవలం 10 నిమిషాల తేడాలోనే భూమి విలువను 10 రెట్లు ఎలా పెంచారని ఆయన ప్రశ్నించారు. భూమి విలువ రూ.2 కోట్లుగా 2021 మార్చి 18న రామ టెంపుల్ పేరుతో భూమి కొనుగోలు రిజిస్ట్రీ చూపిస్తోంది. కానీ, పది నిమిషాల తర్వాత రామాలయ ట్రస్టుకు, అమ్మకందారుకు మధ్య రూ.18 కోట్లకు అగ్రిమెంట్ జరిగింది అని పవన్ పాండే చెప్పారు. రామమందిరం పేరుతో రామభక్తులను ట్రస్టు మోసగించిందని, భూముల కొనుగోలు డీల్ గురించి ఒక ట్రస్టీకి, అయోధ్య మేయర్‌కు తెలుసునని ఆరోపించారు.

దీనిపై శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్టు ఘాటుగానే స్పందించింది. రామాలయ ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ పేరు మీద ఆ ప్రకటనలో.. అమ్మకం కొనుగోలు పక్కాగా జరిగిందిని, కోర్టు ఫీజులు, స్టాంప్‌పేపర్‌ కొనుగోలు అంతా ఆన్‌లైన్‌లోనే జరిగాయని పేర్కొంది. ఇక ప్రాపర్టీ డీలర్లలో ఒకరైన అన్సారీ అందుబాటులో లేకపోగా, మరో డీలర్‌ తివారీ తాను ఒకప్పుడు ఆ భూమి 2 కోట్లకు కొనుగోలు చేశానని, సుప్రీం కోర్టు తీర్పు తర్వాత అది పెరిగిందని, ప్రస్తుతం 20 కోట్ల కంటే ఎక్కువ ధర ఉన్న ఆ భూమిని.. రామమందిరం కోసమే 18.5 కోట్లకు ఇచ్చేశానని తెలిపాడు. మరి శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్టు తెలిపిన వివరాలపై ఆరోపణలు చేసిన నాయకులు ఎ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.

పెగాసస్  స్నూపింగ్ పై సుప్రీంకోర్టు లో సీపీఎం పిటిషన్

పెగాసస్ స్నూపింగ్ పై సుప్రీంకోర్టు లో సీపీఎం పిటిషన్

   7 hours ago


లాక్ డౌన్ కి వ్యతిరేకంగా ఆస్ట్రేలియాలో వేలాది ప్రజల ర్యాలీలు, పోలీసులతో ఘర్షణలు.. అరెస్టులు

లాక్ డౌన్ కి వ్యతిరేకంగా ఆస్ట్రేలియాలో వేలాది ప్రజల ర్యాలీలు, పోలీసులతో ఘర్షణలు.. అరెస్టులు

   a day ago


భారతదేశం ఆర్థిక వ్యవస్థ యొక్క భవిష్యత్తు 1991 కంటే కఠినమైనది, గడ్డుకాలం తప్పదు: మన్మోహన్ సింగ్

భారతదేశం ఆర్థిక వ్యవస్థ యొక్క భవిష్యత్తు 1991 కంటే కఠినమైనది, గడ్డుకాలం తప్పదు: మన్మోహన్ సింగ్

   24-07-2021


సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ పై సిబిఐ రైడ్స్... గన్ లైసెన్స్ స్కామ్

సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ పై సిబిఐ రైడ్స్... గన్ లైసెన్స్ స్కామ్

   24-07-2021


పార్లమెంట్ లో ‘పెగాసస్’ పై రగడ.. మంత్రి చేతినుంచి పేపర్లు లాక్కుని చించివేసిన ఎంపీ

పార్లమెంట్ లో ‘పెగాసస్’ పై రగడ.. మంత్రి చేతినుంచి పేపర్లు లాక్కుని చించివేసిన ఎంపీ

   22-07-2021


ఈ రోజు ఢిల్లీ నడిబొడ్డున రైతులు నిరసన దీక్ష, సరిహద్దుల వద్ద గట్టి భద్రత

ఈ రోజు ఢిల్లీ నడిబొడ్డున రైతులు నిరసన దీక్ష, సరిహద్దుల వద్ద గట్టి భద్రత

   22-07-2021


భారతదేశంలో ఇప్పటివరకు 41.76 కోట్లు మందికి కోవిడ్-19 టీకా వేశారు

భారతదేశంలో ఇప్పటివరకు 41.76 కోట్లు మందికి కోవిడ్-19 టీకా వేశారు

   22-07-2021


చైనాలో తీవ్రమైన వరదలు మధ్య రైలు లోపల ప్రయాణికులు చిక్కుకున్నారు, 12 మంది మరణించారు

చైనాలో తీవ్రమైన వరదలు మధ్య రైలు లోపల ప్రయాణికులు చిక్కుకున్నారు, 12 మంది మరణించారు

   21-07-2021


Monkey B: చైనా లో మంకీ బి అనే మరో కొత్త వైరస్.. 60 కేసులు, ఒకరి మరణం నమోదు

Monkey B: చైనా లో మంకీ బి అనే మరో కొత్త వైరస్.. 60 కేసులు, ఒకరి మరణం నమోదు

   20-07-2021


యూనిఫాం సివిల్ కోడ్‌ గురించిన తెలియని కొన్ని విషయాలు... వారిలో వారు

యూనిఫాం సివిల్ కోడ్‌ గురించిన తెలియని కొన్ని విషయాలు... వారిలో వారు

   19-07-2021


ఇంకా

Newssting


 newssting.in@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle