newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

అయోధ్య విరాళాలలో 15వేల చెక్కులు బౌన్స్.. విలువ 22 కోట్లు

16-04-202116-04-2021 14:24:58 IST
Updated On 16-04-2021 14:29:27 ISTUpdated On 16-04-20212021-04-16T08:54:58.055Z16-04-2021 2021-04-16T08:54:55.192Z - 2021-04-16T08:59:27.384Z - 16-04-2021

అయోధ్య విరాళాలలో 15వేల చెక్కులు బౌన్స్.. విలువ 22 కోట్లు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
న్యూఢిల్లీ: అయోధ్యలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న రామాలయ నిర్మాణానికి దేశవ్యాప్తంగా పెద్దఎత్తున విరాళాలు కూడా అందాయి. అన్నివర్గాల ప్రజలు తమకు తోచిన రీతిలో ఇతోధికంగా ఆలయ నిర్మాణానికి చేయూతను ఇవ్వడం కూడా రాముడి ఆలయ నిర్మాణం పట్ల ప్రజలకు ఉన్న సానుకూల దృక్పధాన్ని చాటిచెప్పింది. అంతవరకూ కథ బాగానే ఉంది.  వచ్చిన చిక్కల్లా ఇచ్చిన చెక్కులతోనే ! దాదాపు 22 కోట్ల రూపాయల మేర 15వేల చెక్కులు బౌన్స్ అయ్యాయన్న విషయం తాజాగా జరిగిన ఆడిట్ లో వెల్లడైంది.   

అయితే మరో 2500 కోట్ల విలువైన విరాళాలకు సంబంధించిన చెక్కులు మాత్రం జమయ్యాయని అనధికార వార్తల వల్ల తెలుస్తోంది. ఈ చెల్లని చెక్కులను ఆయా దాతలకు తిరిగి పంపిస్తున్నట్లు తీర్థక్షేత్రం ట్రస్ట్ కోశాధికారి వెల్లడించారు. ఈ బౌన్స్ అయిన 15వేల చెక్కులు విశ్వ హిందూ పరిషత్ దాని అనుబంద సంస్థలకు ఆలయ నిర్మాణానికి విరాళంగా వచ్చినవేనని తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ ట్రస్ట్ జరిపిన ఆడిట్ లోనే చెక్కులు బౌన్స్ అయిన వ్యవహారం బయటపడింది. అయితే ఈ చెక్కులు బౌన్స్ కావడానికి కారణం ఆయా ఖాతాల్లో ఇచ్చిన మొత్తానికి సరిపడా నగదు లేకపోవడం లేదా కొట్టివేసి రాయడం వంటి అంశాలు, సంతకాలు సరిపోకపోవడమో అయి ఉండవచ్చునని చెబుతున్నారు.   

ఈ తప్పులను సరిదిద్దడానికి బ్యాంకు అధికారులతో మాట్లాడుతున్నట్లు ట్రస్ట్ సభ్యుడు డాక్టర్ అనిల్ మిశ్రా వెల్లడించారు. బ్యాంకులు కూడా ఈ లోపాలను సరిదిద్దుకునేందుకు ఇచ్చిన చెక్కులు చెల్లేలా చూసేందుకు ఆయా వ్యక్తులకు సహకరిస్తున్నట్లు మిశ్రా తెలిపారు. కాగా ఈ 15వేల చెక్కులలో దాదాపు రెండువేల చెక్కులు అయోధ్య నుంచే వచ్చినవేనని ట్రస్ట్ కోశాధికారి స్వామి గోవింద దేవ్ తెలిపారు. మిగతా 13వేల చెక్కులు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అందినవేనని వెల్లడించారు. అయోధ్యలో రామాలయాన్ని అత్యద్భుత రీతిలో నిర్మించేందుకు ఈ  ఏడాది జనవరి 15 నుంచి ఫిబ్రవరి 17 వరకు విహెచ్పి దాని అనుబంధ సంస్థలు విరాళాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టాయి.   

కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆలయ నిర్మాణ వ్యవహారం వేగాన్ని సంతరించుకుంది. సుప్రీం కోర్టు చారిత్రక తీర్పు వెలువడిన నాటి నుంచి రామాలయ నిర్మాణం పట్ల విహెచ్పి, దాని అనుబంధ  సంస్థలు దేశవ్యాప్తంగా ప్రజల్లో హిందుత్వ భావనను బలంగా పాదుగొలిపే ప్రయత్నం చేశాయి. ఈ బృహత్తర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనేలా ప్రజానీకాన్ని సమాయత్తం చేసే ప్రయత్నం చేశాయి. ఆశయం ఎంత ఉదాత్తమైనదైనా దాన్ని ఆచరించేందుకు అనుసరించే మార్గాలు కూడా అంతే ఉదాత్తతను సంతరించుకోవాలి సంతరించుకోవాలి.  దేవుడికి ఇచ్చే విరాళాలు అంటే పవిత్రంగా ఉండాలి. అయితే ఈ చెక్కుల బౌన్స్ వ్యవహారం సానుకూలంగానే కొలిక్కివచ్చి ఆలయానికి ఆర్ధిక దన్నును ఇస్తుందో లేదో వేచి చూడాలి.  

రైతుల ఖాతాల్లోకి మరో 20 వేల కోట్లు... 8వ విడత కిసాన్ నిధులు విడుదల

రైతుల ఖాతాల్లోకి మరో 20 వేల కోట్లు... 8వ విడత కిసాన్ నిధులు విడుదల

   9 hours ago


నెలాఖరుకల్లా కోవిడ్ బలహీనం !

నెలాఖరుకల్లా కోవిడ్ బలహీనం !

   15 hours ago


ఆగస్టు-డిసెంబరు మధ్య 200 కోట్ల కరోనా టీకాలు భారత్ లో ఉంటాయట..!

ఆగస్టు-డిసెంబరు మధ్య 200 కోట్ల కరోనా టీకాలు భారత్ లో ఉంటాయట..!

   a day ago


ఇక 12 - 16 వారాల ఎడం.. వ్యాక్సిన్ డోసుల మధ్య వ్యవధి పెంచిన కేంద్రం

ఇక 12 - 16 వారాల ఎడం.. వ్యాక్సిన్ డోసుల మధ్య వ్యవధి పెంచిన కేంద్రం

   a day ago


మేళాలు, సభల వల్లే  కోవిడ్ స్వైరవిహారం... ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాఖ్య

మేళాలు, సభల వల్లే కోవిడ్ స్వైరవిహారం... ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాఖ్య

   13-05-2021


కోవిడ్ కేకల మధ్య సెంట్రల్ విస్టా అవసరమా...? వెంటనే ఆపండి..?

కోవిడ్ కేకల మధ్య సెంట్రల్ విస్టా అవసరమా...? వెంటనే ఆపండి..?

   13-05-2021


మిగులు ఆక్సిజన్ ఉంది... ఎవరికైనా ఇవ్వండి  కేంద్రానికి ఢిల్లీ సర్కార్ లేఖ

మిగులు ఆక్సిజన్ ఉంది... ఎవరికైనా ఇవ్వండి కేంద్రానికి ఢిల్లీ సర్కార్ లేఖ

   13-05-2021


ముందే రానున్న నైరుతి రుతుపవనాలు.. అరేబియా సముద్రంలో తుపాను ఏర్పడే అవకాశం

ముందే రానున్న నైరుతి రుతుపవనాలు.. అరేబియా సముద్రంలో తుపాను ఏర్పడే అవకాశం

   13-05-2021


టెన్షన్ పెడుతున్న బ్లాక్ ఫంగస్

టెన్షన్ పెడుతున్న బ్లాక్ ఫంగస్

   13-05-2021


వ్యాక్సిన్ ఉత్పత్తికి స్థలాలిస్తాం... మోడీకి మమతా లేఖ

వ్యాక్సిన్ ఉత్పత్తికి స్థలాలిస్తాం... మోడీకి మమతా లేఖ

   13-05-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle