బీహార్ జైలులో ఖైదీలకు ATM
29-11-202029-11-2020 07:18:14 IST
2020-11-29T01:48:14.232Z29-11-2020 2020-11-29T01:48:05.696Z - - 16-01-2021

బీహార్‌లోని పూర్నియా సెంట్రల్ జైలులో మొట్టమొదటిసారి ఖైదీలు వారి రోజువారీ అవసరాల కోసం డబ్బును ఉపసంహరించుకోవడానికి జైలు ప్రాంగణంలో ఏటీఎం ఏర్పాటు చేశారు. జైలు గేటు వద్ద ఖైదీలు, వారి కుటుంబసభ్యులు, స్నేహితులు డబ్బును డ్రా చేసుకునేందుకు జైలులోపల ఏటీఎం ఏర్పాటు చేశామని పూర్నియా జైలు సూపరింటెండెంట్ జితేంద్రకుమార్ చెప్పారు. పూర్నియా జైలులో 750 మంది ఖైదీలుండగా వారిలో 600 మంది ఖైదీలకు బ్యాంకులో ఖాతాలున్నాయి. వీరిలో 400మందికి ఏటీఎం కార్డులను జారీ చేశామని, మిగిలిన వారికి కూడా ఏటీఎంకార్డులు త్వరలో జారీ చేస్తామని బ్యాంకు అధికారులు చెప్పారు.
జైలులోని ఖైదీలకు 4 నుంచి 8 గంటల పనికి రోజుకు 52 రూపాయల నుంచి 103 రూపాయల దాకా వేతనం చెల్లిస్తున్నారు. జైలులోని చిన్న, కుటీర పరిశ్రమల్లో పనిచేసిన ఖైదీలకు వేతనాలను వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఖైదీలు జైలులో ఫేస్ మాస్కులు తయారు చేస్తున్నారు. జైలు మాన్యువల్ ప్రకారం ఒక్కో ఖైదీ 500రూపాయల నగదును డ్రా చేసి ఉంచుకునేందుకు అనుమతి ఉంది. ఖైదీలు వారి వేతనాల డబ్బు నుంచి సబ్బులు, హెయిర్ ఆయిల్, తినేందుకు చిరుతిళ్ల కొనుగోలుకు ఉపయోగించుకోవచ్చని జైలు అధికారులు చెప్పారు.

మోదీ వ్యాక్సిన్ వేసుకుంటే చాలు అని అంటున్నారుగా..!
21 minutes ago

భర్తకు విడాకులు.. కొడుకుతో పెళ్లి.. ఇప్పుడు తల్లి
7 hours ago

వైట్ హౌజ్ కాదు.. వాషింగ్టన్ నే వదిలేస్తారట
5 hours ago

ట్రంప్‌పై బండ పడింది.. అభిశంసనకు ఆమోదం.. సెనేట్ నిర్ణయం ఫైనల్
8 hours ago

భారతదేశంలో మొదలైన వ్యాక్సినేషన్..
9 hours ago

ఎంత గ్యాప్ ఉంటే అంత సమర్థంగా వ్యాక్సిన్ పనితీరు.. సీరమ్ సైంటిస్టు
10 hours ago

తొమ్మిదో రౌండ్ చర్చలు 120 శాతం విఫలం.. రైతుసంఘాల వ్యాఖ్య
11 hours ago

భారత్ చైనా ప్రతిష్టంభన.. సడలింపు.. పాంగాంగ్ సరస్సు ప్రారంభం..
11 hours ago

కాసేపట్లో కరోనా వ్యాక్సిన్ ప్రారంభం.. ప్రపంచంలో మనమే టాప్
12 hours ago

ఏపీలో మద్యం ధరల పెంపు.. దేశంలో పెట్రోల్ ధరల పెంపు ఒక్కటేనా..
15-01-2021
ఇంకా