newssting
Radio
BITING NEWS :
భారత ప్రభుత్వం ప్రత్యర్థుల ఫోన్లపై నిఘా పెట్టడానికి ఇజ్రాయెల్‌కు చెందిన పెగసస్‌ స్‌పైవేర్‌ను ఉపయోగిస్తోందంటూ వెలువడ్డ వార్తలపై పాకిస్తాన్‌ ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పాకిస్తాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌తోపాటు పలువురు విదేశీ ప్రముఖులు పేర్లు ఈ జాబితాలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయని గుర్తుచేసింది. ఈ వ్యవహారంలో ఐక్యరాజ్య సమితి వెంటనే జోక్యం చేసుకోవాలని, సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరింది. * ప్రతిపక్ష నేతల ఫోన్లను హ్యాకింగ్‌ చేస్తున్నారంటూ కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ కొనసాగిస్తున్న ఆరోపణల పరంపరంపై బీజేపీ అధికార ప్రతినిధి రాజ్యవర్దన్‌ రాథోడ్‌ ఘాటుగా స్పందించారు. ఫోన్‌ నిజంగా హ్యాకింగ్‌ అయ్యిందని రాహుల్‌ గాంధీ భావిస్తే దర్యాప్తు కోసం అదే ఫోన్‌ను సమర్పించే దమ్ముందా? అని సవాలు విసిరారు. * కోవిడ్‌ విపత్కర పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత సమర్థవంతంగా పని చేసిందని రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ పేర్కొన్నారు. యుద్ద ప్రాతిపదికన ఆస్పత్రుల్లో పడకలు, మందులు, ఆక్సిజన్‌ నిల్వలు ఇతర మౌలిక సదుపాయాలను పెంపొందించిందని చెప్పారు. రాష్ట్ర గవర్నర్‌గా రెండేళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. * రాష్ట్రంలో వరద ముంపునకు గురైన వారిని ఆదుకోవాలని ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసై టీ (ఐఆర్‌సీఎస్‌) ప్రతి నిధులను గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ కోరారు. రాజ్‌భవన్‌ అధికారులు కూడా ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుని రెడ్‌క్రాస్‌ సొసైటీ ద్వారా బాధితులకు సాయం అందేలా కృషి చేయాలని ఆమె ఆదేశించారు. * కంగ్రాట్స్, నారప్ప చిత్రాన్ని ఇప్పుడే చూశా. నటన పరంగా ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసినట్టుంది. సినిమా చూస్తున్నంత సేపు ఎక్కడా వెంకటేష్ కనబడలేదు, నారప్పే కనిపించాడు. మొత్తానికి ఈ చిత్రంలో కొత్త వెంకటేష్ను చూపించావు. పాత్రను ఎంతగానో అర్థం చేసుకొన్నావ్‌, అందుకే అంతగా ఆ రోల్‌లో లీనమై నటించావు. నీలో ఉండే నటుడు ఎప్పుడూ ఒక తపన తో, తాపత్రయం తో ఉంటాడు. అలాంటి వాటికి ఈ చిత్రం మంచి ఉదాహరణ అని మెగాస్టార్‌ తెలిపారు.

ఐవరీ టవర్ లో ఉంటున్నారా? ఆక్సిజన్ సరఫరాపై కేంద్రానికి ఢిల్లీ హై కోర్టు నోటీసు

05-05-202105-05-2021 07:33:19 IST
2021-05-05T02:03:19.666Z05-05-2021 2021-05-05T01:20:07.978Z - - 25-07-2021

ఐవరీ టవర్ లో ఉంటున్నారా?  ఆక్సిజన్ సరఫరాపై కేంద్రానికి ఢిల్లీ హై కోర్టు నోటీసు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
న్యూఢిల్లీ: ఢిల్లీలో ఆక్సిజన్ కొరత జనం ప్రాణాలు తీస్తున్నా పాలకులు పట్టించుకోకపోవడాన్ని, ఉదాసీనంగా వ్యవహరించడాన్ని ఢిల్లీ హై కోర్టు తీవ్ర వ్యాఖ్యలతో తప్పుపట్టింది. ఆక్సిజన్ సరఫరా విషయంలో తమ ఆదేశాలు పాటించలేదంటూ మండిపడింది. "ఉష్ట్రపక్షి తరహాలో" ఈ ధోరణిని చూస్తూ ఊరుకోలేమంటూ కన్నెర్రజేసింది. బుధవారం కోర్టుకు హాజరు కావాలంటూ కేంద్రానికి షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఢిల్లీలో కరోనా వైరస్ కు గురైన రోగులకు చికిత్స కోసం రోజుకు 700 మెట్రిక్ టన్నుల మెడికల్ ఆక్సిజన్ ను  సరఫరా చేయాలనీ గత శనివారం తాము ఆదేశాలు జారీ చేసినా ఇంత వరకు వాటిని అమలు చేయలేదంటూ ఈ షోకాజ్ నోటీసులో పేర్కొంది.   

తాము ఎన్ని ఆదేశాలు జారీచేసినా కేంద్రం పట్టించుకోకపోవడాన్ని దాదాపు ధిక్కార స్వరంగానే కోర్టు పరిగణిస్తోంది. ఇందుకు సంబంధించి ధిక్కార కేసును ఎందుకు నమోదు చేయకూడతో తెలపాలని న్యాయమూర్తులు విపిన్ సంఘీ, రేఖా పల్లిలతో కూడా హైకోర్టు డివిజన్ బెంచి కేంద్రాన్ని ప్రశ్నించింది. "మీరు  ఏమైనా ఐవరీ టవర్లో నివసిస్తున్నారా? జనం మధ్య లేరా?" అని న్యాయమూర్తులు కేంద్రాన్ని నిలదీశారు. ఢిల్లీ ప్రభుత్వం ఈ డిమాండ్ లేవనెత్తలేదు కాబట్టి " మీ చావు మీరు చావండంటూ" ప్రజలను వదిలేయాలా అంటూ ప్రశ్నించింది. ప్రజల ప్రాణాలు పోతున్నా పట్టించుకోని ధోరణిని ఏమని పరిగణించాలని నిలదీసింది.  .

ప్రభుత్వం ఉష్ట్రపక్షి మాదిరిగా ఉన్నా తాము ఉండలేమని తెలిపింది. ఢిల్లీకి రోజుకు 700 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ను సరఫరా చేయాలనీ 490 మెట్రిక్ టన్నులు  కాదని  గత నెల 30న సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించిన విషయాన్నీ హైకోర్టు బెంచి ప్రస్తావించింది. సుప్రీంకోర్టు ఆదేశం కూడా ఉంది కాబట్టి ఎలాగైనా సరే ఢిల్లీకి రోజుకు 700 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ను సరఫరా చేయాల్సిందేనని తెలిపింది. ఆసుపత్రులలో ప్రజలకు ఆక్సిజన్ గాని, ఐ సి యు పడకలు గాని దొరకని తీవ్రమైన పరిస్థితులను తాము చూస్తున్నామని, ఆక్సిజన్ కొరత వల్ల చాలా ఆసుపత్రులు పడకల సంఖ్యను తగ్గించాయని తెలిపింది.

తమ నోటీసుకు సమాధానం ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వంలో సంబంధిత అధికారులు బుధవారం కోర్టుకు హాజరు కావాలని తెలిపింది. ప్రస్తుతం వైద్య పరమైన అవసరాల దృష్ట్యా ఢిల్లీకి రోజుకు 700 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ పొందే అర్హత లేదంటూ కేంద్ర ప్రభుత్వం చేసిన వాదనను  తిరస్కరించింది.

హిమాచల్‌లో కొండచరియలు విరిగిపడి 8 మంది పర్యాటకులు మరణించారు

హిమాచల్‌లో కొండచరియలు విరిగిపడి 8 మంది పర్యాటకులు మరణించారు

   43 minutes ago


పెగాసస్  స్నూపింగ్ పై సుప్రీంకోర్టు లో సీపీఎం పిటిషన్

పెగాసస్ స్నూపింగ్ పై సుప్రీంకోర్టు లో సీపీఎం పిటిషన్

   8 hours ago


లాక్ డౌన్ కి వ్యతిరేకంగా ఆస్ట్రేలియాలో వేలాది ప్రజల ర్యాలీలు, పోలీసులతో ఘర్షణలు.. అరెస్టులు

లాక్ డౌన్ కి వ్యతిరేకంగా ఆస్ట్రేలియాలో వేలాది ప్రజల ర్యాలీలు, పోలీసులతో ఘర్షణలు.. అరెస్టులు

   24-07-2021


భారతదేశం ఆర్థిక వ్యవస్థ యొక్క భవిష్యత్తు 1991 కంటే కఠినమైనది, గడ్డుకాలం తప్పదు: మన్మోహన్ సింగ్

భారతదేశం ఆర్థిక వ్యవస్థ యొక్క భవిష్యత్తు 1991 కంటే కఠినమైనది, గడ్డుకాలం తప్పదు: మన్మోహన్ సింగ్

   24-07-2021


సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ పై సిబిఐ రైడ్స్... గన్ లైసెన్స్ స్కామ్

సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ పై సిబిఐ రైడ్స్... గన్ లైసెన్స్ స్కామ్

   24-07-2021


పార్లమెంట్ లో ‘పెగాసస్’ పై రగడ.. మంత్రి చేతినుంచి పేపర్లు లాక్కుని చించివేసిన ఎంపీ

పార్లమెంట్ లో ‘పెగాసస్’ పై రగడ.. మంత్రి చేతినుంచి పేపర్లు లాక్కుని చించివేసిన ఎంపీ

   22-07-2021


ఈ రోజు ఢిల్లీ నడిబొడ్డున రైతులు నిరసన దీక్ష, సరిహద్దుల వద్ద గట్టి భద్రత

ఈ రోజు ఢిల్లీ నడిబొడ్డున రైతులు నిరసన దీక్ష, సరిహద్దుల వద్ద గట్టి భద్రత

   22-07-2021


భారతదేశంలో ఇప్పటివరకు 41.76 కోట్లు మందికి కోవిడ్-19 టీకా వేశారు

భారతదేశంలో ఇప్పటివరకు 41.76 కోట్లు మందికి కోవిడ్-19 టీకా వేశారు

   22-07-2021


చైనాలో తీవ్రమైన వరదలు మధ్య రైలు లోపల ప్రయాణికులు చిక్కుకున్నారు, 12 మంది మరణించారు

చైనాలో తీవ్రమైన వరదలు మధ్య రైలు లోపల ప్రయాణికులు చిక్కుకున్నారు, 12 మంది మరణించారు

   21-07-2021


Monkey B: చైనా లో మంకీ బి అనే మరో కొత్త వైరస్.. 60 కేసులు, ఒకరి మరణం నమోదు

Monkey B: చైనా లో మంకీ బి అనే మరో కొత్త వైరస్.. 60 కేసులు, ఒకరి మరణం నమోదు

   20-07-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle