newssting
Radio
BITING NEWS :
నేడు ఏపీలో సీఎం జగన్ ఏరియల్ సర్వే. నివర్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేస్తున్న సీఎం. నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో సీఎం సర్వే. సర్వే అనంతరం తిరుపతిలో అధికారులతో సమీక్ష. * ఏపీలో రెండ్రోజులపాటు కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలుల ధాటికి 465 మూగజీవాలు మృత్యువాత. * తుఫాన్ కారణంలో ఏపీలో 2,14,420 హెక్టార్లలో పంటనష్టం. 11 జిల్లాల్లో లక్షా 89 వేల హెక్టార్లలో దెబ్బతిన్న వరి. 13 వేల హెక్టార్లలో మినుము, 5 వేల హెక్టార్లలో పత్తి పంటలకు నష్టం.

కశ్మీరు భూములు ఇకపై అందరివీ.. ఎవరైనా కొనొచ్చన్న కేంద్రం

28-10-202028-10-2020 16:57:55 IST
Updated On 28-10-2020 17:25:53 ISTUpdated On 28-10-20202020-10-28T11:27:55.781Z28-10-2020 2020-10-28T08:51:24.491Z - 2020-10-28T11:55:53.948Z - 28-10-2020

కశ్మీరు భూములు ఇకపై అందరివీ.. ఎవరైనా కొనొచ్చన్న కేంద్రం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దాదాపు డెబ్బై సంవత్సరాల చరిత్రను మార్చివేస్తూ కేంద్ర ప్రభుత్వం జమ్మూ కశ్మీరుకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. దానిప్రకారం జమ్మూకశ్మీర్‌లో ఇకపై ఎవరైనా భూములను కొనొచ్చు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ గెజిట్‌ నోటిఫికేషన్‌ను మంగళవారం విడుదల చేసింది. 

జమ్మూకశ్మీర్‌లోని పలు చట్టాలకు చేసిన సవరణల్లో ఈ మార్పులను తీసుకొచ్చారు. దీని కోసం జమ్మూకశ్మీర్‌ అభివృద్ధి చట్టం 17వ సెక్షన్‌ లో స్థానికేతరులు భూములు కొనుగోలు చేయకూడదనే కీలక నిబంధనను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సవరించింది. ఈ సవరణలు తక్షణమే అమల్లోకి వస్తాయని వివరించింది. 

ఆర్టికల్‌ 370 రద్దుకు ముందు కేవలం ఆ రాష్ట్రంలోని శాశ్వత నివాసితులు మాత్రమే భూములు కొనే హక్కును కలిగి ఉండేవారు. సెక్షన్‌ 17లోని ఆ హక్కును కేంద్రం తొలగించడంతో, ఇప్పుడు ఎవరైనా జమ్మూకశ్మీర్‌లో భూములను కొనొచ్చు. అయితే వ్యవసాయ భూములను, వ్యవసాయేతరులకు అమ్మేందుకు ఈ సవరణ అంగీకరించలేదని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా చెప్పారు.

అయితే వ్యవసాయ భూములను విద్య, వైద్యానికి సంబంధించిన లక్ష్యాలకు వినియోగించుకోవచ్చు. ఈ చర్యను పీపుల్స్‌ అలియన్స్‌ ఫర్‌ గుప్కర్‌ డిక్లరేషన్‌ (పీఏజీడీ) వ్యతిరేకించింది. ఈ సవరణలు ఆమోదనీయం కాదని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఒమర్‌ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. జమ్మూకశ్మీర్‌ను అమ్మకానికి పెట్టారని అన్నారు. పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ మాట్లాడుతూ.. రాజ్యాంగ వ్యతిరేకంగా ఆర్టికల్‌ 370ని రద్దు చేశాక, ఇప్పుడు జమ్మూకశ్మీర్‌ను అమ్మకానికి పెట్టారని, తమ సహజవనరులను దోచుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారని వ్యాఖ్యానించారు. 

భూతల స్వర్గం కశ్మీర్‌లోని భూములు ఇక ఎవరైనా కొనుక్కోవచ్చు. ఇల్లు కట్టుకోవచ్చు. నివాసం కూడా ఉండొచ్చు. వ్యవసాయ భూమిని మాత్రం సాగు చేసే వారు మాత్రమే కొనుగోలు చేయా లని జమ్మూకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ మనోజ్‌ సిన్హా వెల్లడించారు. విద్య, వైద్య సంస్థల ఏర్పాటుకు సంబంధించి వ్యవసాయ భూములను సాగు చేయనివారు సైతం కొనుగోలు చేయవచ్చు అని మినహాయింపునిచ్చారు. 

కశ్మీర్‌ని అమ్మకానికి పెట్టేశారు: ఒమర్‌

‘‘భూముల కొనుగోలుకు సంబంధించి ఆమోదయోగ్యంకాని సవరణలు చేశారు. దీనివల్ల వ్యవసాయేతర భూముల కొనుగోలు, వ్యవసాయ భూముల బదిలీ సులభంగా జరిగిపోతుంది. కశ్మీర్‌ అమ్మకానికి సిద్ధంగా ఉంది. దీని వల్ల పేదలు తీవ్రంగా నష్టపోతారు’’ అని ఒమర్‌ అబ్దుల్లా ట్వీట్‌ చేశారు. కశ్మీర్‌ను దోచుకునేందుకు ఆర్టికల్‌ 370ని రాజ్యాగ విరుద్ధంగా రద్దు చేసిన కేంద్రం.. ఇప్పుడు కశ్మీర్‌ను అమ్మేసేందుకు తాజా సవరణలు చేసిందని  పీడీపీ నేత మెహబూబా ముఫ్తీ మండిపడ్డారు. ఇలాంటి నిరంకుశ నిర్ణయాలకు వ్యతిరేకంగా పోరాడేందుకు జమ్ము, కశ్మీర్‌, లద్ధాఖ్‌ ప్రాంత వాసులంతా ఒక్కటవ్వాలని పిలుపునిచ్చారు. జమ్మూకశ్మీర్‌లోని ఇతర పార్టీలు కూడా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టాయి.

 


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle