newssting
Radio
BITING NEWS :
భారత ప్రభుత్వం ప్రత్యర్థుల ఫోన్లపై నిఘా పెట్టడానికి ఇజ్రాయెల్‌కు చెందిన పెగసస్‌ స్‌పైవేర్‌ను ఉపయోగిస్తోందంటూ వెలువడ్డ వార్తలపై పాకిస్తాన్‌ ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పాకిస్తాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌తోపాటు పలువురు విదేశీ ప్రముఖులు పేర్లు ఈ జాబితాలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయని గుర్తుచేసింది. ఈ వ్యవహారంలో ఐక్యరాజ్య సమితి వెంటనే జోక్యం చేసుకోవాలని, సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరింది. * ప్రతిపక్ష నేతల ఫోన్లను హ్యాకింగ్‌ చేస్తున్నారంటూ కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ కొనసాగిస్తున్న ఆరోపణల పరంపరంపై బీజేపీ అధికార ప్రతినిధి రాజ్యవర్దన్‌ రాథోడ్‌ ఘాటుగా స్పందించారు. ఫోన్‌ నిజంగా హ్యాకింగ్‌ అయ్యిందని రాహుల్‌ గాంధీ భావిస్తే దర్యాప్తు కోసం అదే ఫోన్‌ను సమర్పించే దమ్ముందా? అని సవాలు విసిరారు. * కోవిడ్‌ విపత్కర పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత సమర్థవంతంగా పని చేసిందని రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ పేర్కొన్నారు. యుద్ద ప్రాతిపదికన ఆస్పత్రుల్లో పడకలు, మందులు, ఆక్సిజన్‌ నిల్వలు ఇతర మౌలిక సదుపాయాలను పెంపొందించిందని చెప్పారు. రాష్ట్ర గవర్నర్‌గా రెండేళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. * రాష్ట్రంలో వరద ముంపునకు గురైన వారిని ఆదుకోవాలని ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసై టీ (ఐఆర్‌సీఎస్‌) ప్రతి నిధులను గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ కోరారు. రాజ్‌భవన్‌ అధికారులు కూడా ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుని రెడ్‌క్రాస్‌ సొసైటీ ద్వారా బాధితులకు సాయం అందేలా కృషి చేయాలని ఆమె ఆదేశించారు. * కంగ్రాట్స్, నారప్ప చిత్రాన్ని ఇప్పుడే చూశా. నటన పరంగా ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసినట్టుంది. సినిమా చూస్తున్నంత సేపు ఎక్కడా వెంకటేష్ కనబడలేదు, నారప్పే కనిపించాడు. మొత్తానికి ఈ చిత్రంలో కొత్త వెంకటేష్ను చూపించావు. పాత్రను ఎంతగానో అర్థం చేసుకొన్నావ్‌, అందుకే అంతగా ఆ రోల్‌లో లీనమై నటించావు. నీలో ఉండే నటుడు ఎప్పుడూ ఒక తపన తో, తాపత్రయం తో ఉంటాడు. అలాంటి వాటికి ఈ చిత్రం మంచి ఉదాహరణ అని మెగాస్టార్‌ తెలిపారు.

ఆక్సిజన్ ట్యాంకర్లు అంబులెన్సులే రవాణా అంతరాయం వద్దు: అమిత్ షా సూచన

24-04-202124-04-2021 09:27:35 IST
Updated On 24-04-2021 11:10:27 ISTUpdated On 24-04-20212021-04-24T03:57:35.620Z24-04-2021 2021-04-24T03:23:41.791Z - 2021-04-24T05:40:27.531Z - 24-04-2021

ఆక్సిజన్ ట్యాంకర్లు అంబులెన్సులే రవాణా అంతరాయం వద్దు: అమిత్ షా సూచన
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశవ్యాప్తంగా కరోనా బాధితులకు తక్షణ ప్రాతిపదికన ఆక్సిజన్ అందించే చర్యలను కేంద్ర ప్రభుత్వం ముమ్మరం చేసింది. ఢిల్లీ సహా అనేక రాష్ట్రాలలో ఆక్సిజన్ లేమి కారణంగా వందలాది మంది కోవిడ్  రోగులు మరణిస్తున్న నేపథ్యంలో వివిధ రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో హోమ్ మంత్రి అమిత్ షా సమీక్షా సమావేశం నిర్వహించారు.  ఆక్సిజన్ లభ్యతకు సంబంధించి అన్ని అంశాలను లోతుగా చర్చించిన ఆయన రాష్ట్రాలకు పలు సూచనలు చేశారు. ఆక్సిజన్ ట్యాంకర్లను అంబులెన్స్ ల మాదిరిగా పరిగణించాలని వాటి రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ప్రత్యేక కారిడార్లను ఏర్పాటు చేయాలని మంత్రి  సూచించారు.

ఆక్సిజన్ తీసుకెళ్లే వాహనాలకు తగిన రక్షణ ఏర్పాటు చేయాలనీ, అవి వెళ్లే దారిలో ఎలాంటి అవరోధాలు లేకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు.  ఆసుపత్రుల్లో ఆక్సిజన్ లభ్యత తగ్గిపోయిందని, వేలాది మంది సకాలంలో ఆక్సిజన్ అందక  ఆర్తనాదాలు చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో కథనాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ రంగంలోకి దిగింది. పారిశ్రామిక ఆక్సిజన్ కోవిడ్ రోగులకు మళ్లించడం ద్వారా మెడికల్ ఆక్సిజన్ సరఫరాను పెంచామని హోమ్ శాఖ తెలిపింది. అలాగే పరిశ్రమలు పారిశ్రామిక ఆక్సిజన్ వినియోగాన్ని మరింతగా తగ్గించుకొని దానిని ఆసుపత్రులకు అందుబాటులోకి తెచ్చేలా చర్యలు చేపడుతామని హోమ్ శాఖ వివరించింది.

ప్లాంటు లేకపోతే ఢిల్లీకి ఆక్సిజన్ ఇవ్వరా? కేంద్రాన్ని నిలదీసిన కేజ్రీవాల్

తమ తమ జిల్లాల్లో ఉన్న ఆక్సిజన్ ఉత్పాదక పరిశ్రమల జాబితాను సిద్ధం చేయాలనీ జిల్లా కలెక్టర్లను కోరాల్సిందిగా అన్ని రాష్ట్రాలను హోమ్ శాఖ ఆదేశించింది. అలాగే ఇప్పటికే మూసివేత దశలో ఉన్న ఆక్సిజన్  ప్లాంట్లు అన్నింటినీ పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టాలని కూడా రాష్ట్రాలను కేంద్రం కోరింది. ఈ చర్యల వల్ల జిల్లా స్థాయిలో కోవిడ్ రోగులకు ఆక్సిజన్ లభ్యత పెరుగుతుందని ఎక్కడినుంచో రప్పించకుండా స్థానికంగానే ఈ అవసరం తీర్చుకోవచ్చునని హోమ్ శాఖ తెలిపింది.

ఇంతకు ముందు కోవిడ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ప్రధాని మోడీ ఆక్సిజన్ అక్రమ నిల్వలు అరికట్టాలని విజ్ఞప్తి చేశారు.   ఆలాగే ఆక్సిజన్ ట్యాంకర్ల రవాణా విషయంలోనూ అవరోధాలు లేకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు.  ఎక్కడా కూడా ఆక్సిజన్ ట్యాంకర్ నిలిచిపోకుండా నిర్దేశిత రాష్రానికి వెళ్లేలా చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రధాని ఈ రాష్ట్రాల ముఖ్యమంత్రులను కోరినట్లు ప్రధాన మంత్రి కార్యాలయం ప్రకటనలో తెలిపింది.   

హిమాచల్‌లో కొండచరియలు విరిగిపడి 8 మంది పర్యాటకులు మరణించారు

హిమాచల్‌లో కొండచరియలు విరిగిపడి 8 మంది పర్యాటకులు మరణించారు

   2 minutes ago


పెగాసస్  స్నూపింగ్ పై సుప్రీంకోర్టు లో సీపీఎం పిటిషన్

పెగాసస్ స్నూపింగ్ పై సుప్రీంకోర్టు లో సీపీఎం పిటిషన్

   7 hours ago


లాక్ డౌన్ కి వ్యతిరేకంగా ఆస్ట్రేలియాలో వేలాది ప్రజల ర్యాలీలు, పోలీసులతో ఘర్షణలు.. అరెస్టులు

లాక్ డౌన్ కి వ్యతిరేకంగా ఆస్ట్రేలియాలో వేలాది ప్రజల ర్యాలీలు, పోలీసులతో ఘర్షణలు.. అరెస్టులు

   a day ago


భారతదేశం ఆర్థిక వ్యవస్థ యొక్క భవిష్యత్తు 1991 కంటే కఠినమైనది, గడ్డుకాలం తప్పదు: మన్మోహన్ సింగ్

భారతదేశం ఆర్థిక వ్యవస్థ యొక్క భవిష్యత్తు 1991 కంటే కఠినమైనది, గడ్డుకాలం తప్పదు: మన్మోహన్ సింగ్

   24-07-2021


సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ పై సిబిఐ రైడ్స్... గన్ లైసెన్స్ స్కామ్

సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ పై సిబిఐ రైడ్స్... గన్ లైసెన్స్ స్కామ్

   24-07-2021


పార్లమెంట్ లో ‘పెగాసస్’ పై రగడ.. మంత్రి చేతినుంచి పేపర్లు లాక్కుని చించివేసిన ఎంపీ

పార్లమెంట్ లో ‘పెగాసస్’ పై రగడ.. మంత్రి చేతినుంచి పేపర్లు లాక్కుని చించివేసిన ఎంపీ

   22-07-2021


ఈ రోజు ఢిల్లీ నడిబొడ్డున రైతులు నిరసన దీక్ష, సరిహద్దుల వద్ద గట్టి భద్రత

ఈ రోజు ఢిల్లీ నడిబొడ్డున రైతులు నిరసన దీక్ష, సరిహద్దుల వద్ద గట్టి భద్రత

   22-07-2021


భారతదేశంలో ఇప్పటివరకు 41.76 కోట్లు మందికి కోవిడ్-19 టీకా వేశారు

భారతదేశంలో ఇప్పటివరకు 41.76 కోట్లు మందికి కోవిడ్-19 టీకా వేశారు

   22-07-2021


చైనాలో తీవ్రమైన వరదలు మధ్య రైలు లోపల ప్రయాణికులు చిక్కుకున్నారు, 12 మంది మరణించారు

చైనాలో తీవ్రమైన వరదలు మధ్య రైలు లోపల ప్రయాణికులు చిక్కుకున్నారు, 12 మంది మరణించారు

   21-07-2021


Monkey B: చైనా లో మంకీ బి అనే మరో కొత్త వైరస్.. 60 కేసులు, ఒకరి మరణం నమోదు

Monkey B: చైనా లో మంకీ బి అనే మరో కొత్త వైరస్.. 60 కేసులు, ఒకరి మరణం నమోదు

   20-07-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle