రైతు హితం కోసమే సంస్కరణలు.. మోదీ సమర్ధన
01-12-202001-12-2020 12:32:21 IST
2020-12-01T07:02:21.987Z01-12-2020 2020-12-01T07:02:04.763Z - - 28-01-2021

డిల్లీ పొలిమేరల్లో తీవ్రస్థాయిలో నిరసన తెలుపుతున్న పంజాబ్ తదితర రాష్ట్రాల రైతులు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయందే ఢిల్లీ వదిలి వెళ్లం అని సవాలు చేస్తుండగా కొత్త వ్యవసాయ చట్టాలను ప్రధాని మోదీ మరోసారి గట్టిగా సమర్థించుకున్నారు. కొత్త చట్టాలు పాత వ్యవస్థనేమీ మార్చలేదని, ఎంఎస్పీ, మండీల్లో సేకరణ, ప్రభుత్వ కొనుగోలు యథావిధిగా ఉన్నాయని పునరుద్ఘాటించారు. రైతును బలోపేతం చేయడమే, వారికి కొత్త అవకాశాలు సృష్టించడమే లక్ష్యంగా సంస్కరణలు తెచ్చామన్నారు. వారాణసీలో ఓ కార్యక్రమంలో వీడియో లింక్ ద్వారా మాట్లాడిన ప్రధాని విపక్షాలపై విరుచుకుపడ్డారు. రాజకీయ లబ్ధి కోసం రైతు చట్టాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, వదంతులు సృష్టిస్తున్నాయని ధ్వజమెత్తారు. ఇప్పుడు కొత్త ట్రెండ్ నడుస్తోంది. గతంలో ప్రతిపక్షాలు ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించాయి. ఇప్పుడు నిరాధారమైన సమాచారంతో పుకార్లను సృష్టిస్తున్నాయి. నిర్ణయం సరైనదే అని తెలిసినా మరిన్ని దుష్పరిణామాలకు దారితీస్తాయని తప్పుదోవ పట్టిస్తున్నాయి. ఏళ్ల తరబడి మోసాలకు అలవాటు పడ్డ పార్టీలు వీటిని ప్రోత్సహిస్తున్నాయి అంటూ ప్రధాని పరోక్షంగా కాంగ్రెస్‌ని దుయ్యబట్టారు. వ్యవసాయ మార్కెట్లను రద్దు చేస్తారన్న ప్రచారాన్ని ప్రధాని ఖండించారు. వ్యవసాయ మార్కెట్ల ఆధునికీకరణకు ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నదని, మార్కెట్లను మూసివేసే ప్రశ్నే లేదని చెప్పారు. పంజాబ్‌లో రైతులు వరి ధాన్యాన్ని నిరుటి కంటే ఈ ఏడాది ఎక్కువగానే అమ్మారని, ఎంఎస్పీ కూడా కిందటేడాది కంటే ఎక్కువేనని కేంద్ర సమాచార మంత్రి ప్రకాశ్ జావడేకర్ అన్నారు. కాగా, నిరసనల్లో ఖలిస్థానీ వేర్పాటువాదులు, మావోయిస్టులు ప్రవేశించారని బీజేపీ, హరియాణా సీఎం ఖట్టార్ ఆరోపించారు. మరోవైపున నిరసనల్లో ముస్లిం కనిపిస్తే అల్‌ఖాయిదా ఉగ్రవాదులనీ, తలపై టర్బన్ ఉంటే ఖలిస్తానీ అనడం ఫ్యాషన్‌గా మారిందని రైతు సంఘాల నాయకుడు యోగేంద్ర యాదవ్ అన్నారు. కరోనాతో కాదు.. మీ చట్టాలతోనే హాని.. రైతుల ఛాలెంజ్ ధర్నా చేస్తున్న రైతులు కరోనా నిబంధనలు పాటించకపోవడంపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా వేగంగా వ్యాప్తి చెందడానికి ఆ రైతులు వాహకాలు (సూపర్ స్పెడర్లు)గా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ధర్నాలో పాల్గొన్న వేలాది మంది రైతులు ట్రాక్టరు, ట్రాలీల్లోనే ఉంటున్నారు. అక్కడే వంట చేస్తున్నారు. మాస్కులు ధరించడం లేదు. భౌతిక దూరం పాటించడం లేదు. పరిశుభ్రతా కొరవడింది. కరోనా నేపథ్యంలో సామూహిక సమావేశాలు, ధర్నాలను అడ్డుకోకుంటే ఢిల్లీతో పాటు దేశానికి ఇబ్బందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు కేకే అగర్వాల్ అన్నారు. అయితే, కరోనా కంటే కొత్త వ్యవసాయ చట్టాలతోనే రైతులకు ఎక్కువ హాని అని రైతులు అంటున్నారు.

భారత్‌తో అమెరికా సంప్రదింపులు.. సహకారానికి ఒకే
19 minutes ago

నమ్మించి వంచించారు.. ఎవ్వరినీ వదలం.. ఢిల్లీ పోలీసు చీఫ్
3 hours ago

పెట్రోల్ రేట్.. కనీవినీ ఎరుగని అద్భుతం
4 hours ago

నేపాల్‌లో వ్యాక్సినేషన్ ప్రారంభం.. మోదీకి ప్రధాని ఓలి కృతజ్ఞతలు
5 hours ago

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 11,666 మందికి కరోనా
6 hours ago

ప్రపంచ అగ్రశ్రేణి ఐటీ కంపెనీల్లో 'TCS'కు మూడోస్థానం
6 hours ago

ఫిబ్రవరి 1న పార్లమెంటుకు రైతుల ర్యాలీ నిలిపివేత
8 hours ago

అమెరికా 71వ విదేశాంగ మంత్రిగా అంటోనీ బ్లింకెన్ నియామకం
9 hours ago

ఇంకేంటి.. సినిమా థియేటర్లు ఫుల్ కెపాసిటీతో..!
20 hours ago

డబుల్ డిజిట్ వృద్ధి భారత్‌కే సాధ్యం.. ఐఎమ్ఎఫ్ అంచనా
27-01-2021
ఇంకా