newssting
Radio
BITING NEWS :
విజయవాడలో కన్నకూతురిని అమ్మకానికి పెట్టిన తాగుబోతు తండ్రి. విషయం తెలిసి తండ్రిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చిన చైల్డ్ లైన్ అధికారులు. అనంతరం చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు. * తెలుగు రాష్ట్రాల్లో రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 11 మంది దుర్మరణం. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఇన్నోవా - బోర్ వెల్ లారీ ఢీ. ప్రమాదంలో ఆరుగురు మృతి, ముగ్గురికి తీవ్రగాయాలు. ప్రమాద సమయంలో ఇన్నోవాలో 11 మంది ప్రయాణికులు. మృతులంతా హైదరాబాద్ లోని తాడ్ బన్ కు చెందినవారుగా గుర్తించిన పోలీసులు. * కర్నూల్ జిల్లా గూడూరు వద్ద బైక్ ను ఢీ కొట్టిన ట్రాక్టర్. ముగ్గురు దుర్మరణం, మృతులంతా బ్రాహ్మణదొడ్డికి చెందినవారుగా గుర్తించిన పోలీసులు. * ఖమ్మం జిల్లా కామేపల్లి వద్ద టిప్పర్ - స్కూటీ ఢీ, ఇద్దరు మృతి. * మూడోరోజు ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు. రాష్ట్రంలో ఇసుక సమస్యపై అసెంబ్లీలో టీడీపీ వాయిదా తీర్మానం.

అమెరికా అందుకే ఇన్వాల్వ్ అవుతోంద‌ట‌

25-10-202025-10-2020 15:34:21 IST
Updated On 25-10-2020 17:37:59 ISTUpdated On 25-10-20202020-10-25T10:04:21.649Z25-10-2020 2020-10-25T10:04:16.156Z - 2020-10-25T12:07:59.189Z - 25-10-2020

అమెరికా అందుకే ఇన్వాల్వ్ అవుతోంద‌ట‌
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్ర‌పంచంలో ఎక్క‌డ ఏం జ‌రిగినా స‌రే.. తుర్రు తుర్రున దూరి పోవ‌డం అమెరికాకి అల‌వాటే. కొన్ని కొన్ని సార్లు ఓకే అయినా.. కొన్ని కొన్ని సార్లు మాత్రం మీకెందుకు అనిపించుకుంటారు. ఒక్కోసారి మాత్రం చాలా  క‌రెక్ట్ గా ఉంటుంది. ఎంత‌న్నా దేశాల‌న్నీటికి పెద్ద‌న్న అనే పేరుంది క‌దా. ఆ మాత్రం ఉంటుందిలే. మ‌రి చైనా పై పాత కక్ష‌లా లేదంటే.. కాస్త డౌన్ లో ఉన్న దేశాల్ని స‌పోర్ట్ చేయ‌డం మీ ఉద్దేశ‌మా అంటే. అవును.. కాస్త డౌన్ లో ఉన్న దేశాల్ని స‌పోర్ట్ చేయ‌డ‌మే మా ఇంటెన్ష‌న్. చైనా లాంటి దేశాల ఆగ‌డాల్ని అడ్డుక‌ట్ట వేయ‌క‌పోతే.. చాలా దేశాల్ని బెదిరిస్తుంది. అందుకే.. ఓ సైడ్ మేం నుంచుంటున్నాం అంటోంది అమెరికా.

రీసెంట్ గా అమెరికా మూవింగ్ అలాగే ఉంది. శత్రువు కి శ‌త్రువు మ‌న‌కి మిత్రుడు అన్న‌ట్లు యాక్ట్ చేస్తోంది. చైనా ఎటు క‌దిలినా.. అటు ఎదురుగా నుంచుంటోంది అమెరికా. ఈ సిగ్గుమాలిన చైనా కూడా అంతే. బోర్డ‌ర్ లో ఉన్న దేశాల‌న్నీటితో గొడ‌వ‌లు పెట్టుకుంటోంది. ఆల్రెడీ మ‌న‌తో లొల్లి ఉంది. మ‌న‌ని త‌ట్టుకోలేక చిన్న దేశ‌మైన తైవాన్ తో జ‌గ‌డం మొద‌లెట్టింది. ఇప్పుడు నేపాల్ తోనూ స్టార్ట్ చేసింది. మాకు బ‌లం ఉంది.. మాకు సైనికులు ఉన్న‌రు. మాకు ఆయుధాలు ఉన్న‌య్ అని అంద‌రితో గిల్లి క‌జ్జాలు ఆడుతోంది చైనా. అందుకే.. అమెరికా కూడా మీ ఆట‌లు సాగ‌నివ్వం అంటూ.. అన్ని చోట్లా ఇన్వాల్వ్ అవుతోంద‌ట‌. మొన్నీ మ‌ధ్య తైవాన్ సైడ్ మూవ్ అయిన చైనాకి.. ఎదురుగా మేమున్నాం బిడ్డా రాండి చూస్కుందాం అన్న‌ది. స‌ముద్రంలో మీ మూమెంట్స్ చూస్తూనే ఉన్నం.. మేం కూడా తైవాన్ సైడే స‌ముద్రంలో ఉన్నం అని వార్నింగ్ ఇచ్చింది. ఇక మ‌న దేశానికి కూడా అంతే స‌పోర్ట్ ఇస్తోంది. ఇక నేపాల్ విష‌యంలో ఇంకా ఇన్వాల్వ్ కాలేద‌ట్లుంది.

దేశాల‌కీ దేశాల‌కీ మ‌ధ్య బోర్డ‌ర్ స‌మ‌స్య‌లు వ‌స్తే.. అది ప్ర‌పంచ ఇష్యూ అవుతుంది. అందుకే.. చైనా వాళ్ల‌ని కంట్రోల్ చేయ‌డానికి మేమున్నాం అంటోంది అమెరికా. చూస్తుంటే పెద్ద‌న్న పాత్ర‌లాగే ఉన్నా.. గొడ‌వ‌లు లేపి.. ఆయుధాలు అమ్మి..  యుద్ధాలు క్రియేట్ చేయ‌డ‌మే అమెరికా ఉద్దేశం అనే టాక్ ఫుల్ గానే ఉంది క‌దా. దానికి మాత్రం అమెరికా నుంచి ఎప్పుడూ ఆన్స‌ర్ లేదు.


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle