newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

హెచ్-1బీ వీసా ట్విస్ట్ ఇచ్చిన అమెరికా..!

03-03-202103-03-2021 18:43:26 IST
Updated On 03-03-2021 12:20:08 ISTUpdated On 03-03-20212021-03-03T13:13:26.181Z03-03-2021 2021-03-03T05:29:43.133Z - 2021-03-03T06:50:08.297Z - 03-03-2021

హెచ్-1బీ వీసా ట్విస్ట్ ఇచ్చిన అమెరికా..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
హెచ్-1బీ వీసా.. అమెరికాకు వెళ్లి బాగా సంపాదించాలని అనుకునే వారికి ఇదొక మంచి మార్గం.. కానీ ప్రస్తుతం హెచ్-1బీ వీసాలపై అమెరికా నిషేధం విధించిన సంగతి తెలిసిందే..! అయితే కొత్త అధ్యక్షుడుగా బైడెన్ వచ్చాక గుడ్ న్యూస్ చెబుతాడని భారత్ కు చెందిన టెకీలు కూడా ఎదురుచూస్తూ ఉన్న తరుణంలో అమెరికా షాక్ ఇచ్చింది. హెచ్-1బీ వీసాలపై నిషేధాన్ని ఇప్పట్లో తొలగించే అవకాశాలు లేవని అమెరికా అంటోంది. ఈ విషయంలో బైడెన్ సర్కారు వెనక్కు తగ్గినట్టుగా సమాచారం. తమ ముందు మరిన్ని ముఖ్యమైన అంశాలున్నాయని వ్యాఖ్యానించిన హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి అలెజాండ్రో యమోర్కాస్, నిషేధం ఎత్తివేత ఇప్పట్లో సాధ్యం కాదన్న సంకేతాలిచ్చారు. తాము ప్రస్తుతం శరణార్థుల సమస్యల పరిష్కారంతో పాటు, చట్టవిరుద్ధంగా తమ తల్లిదండ్రులతో దేశానికి వచ్చిన వారిని ఆదుకోవడం, వృత్తి నిపుణుల సమస్యల పరిష్కారంపై దృష్టిని సారించామని చెప్పుకొచ్చారు. 

డొనాల్డ్ ట్రంప్, హెచ్-1బీ వీసాలపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయితే, తాను బాధ్యతలు స్వీకరించగానే దాన్ని తొలగిస్తానని జో బైడెన్ హామీ ఇచ్చారు. వీసాలపై ఉన్న ఆంక్షలపై మాత్రం ఆయన ఇంకా తుది నిర్ణయం తీసుకోలేకపోతున్నారని తెలుస్తోంది. ట్రంప్ విధించిన నిషేధం ఈ నెలాఖరు వరకూ అమలులో ఉంటుంది. అక్టోబర్ నుంచి మొదలయ్యే ఆర్థిక సంవత్సరానికి హెచ్-1బీ వీసాలను కోరుతూ వచ్చిన దరఖాస్తులను ఇమిగ్రేషన్ అధికారులు పరిశీలించనున్నారు.

జనవరిలో అమెరికాకు అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన జో బైడెన్ కు తొలిసారిగా క్యాబినెట్ సభ్యుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. వైట్ హౌస్ బడ్జెట్ చీఫ్ గా భారత సంతతి మూలాలున్న నీరా టాండన్ ను నియమించాలని బైడెన్ భావించారు. ముఖ్యమైన సెనెటర్లు, ఇతర మంత్రుల నుంచి బైడెన్ నిర్ణయం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. నీరా టాండన్ గతంలో తాను చేసిన వ్యాఖ్యల్లో ప్రజా ప్రతినిధులను కించపరిచారని వారు బైడెన్ ఎదుటే తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆమె నియామకాన్ని స్వాగతించలేమని, ఆమెకు అనుకూలంగా ఓటును వేయబోమని మంత్రి వర్గం చెప్పడంతో బైడెన్ నీరా టాండన్ నియామకాన్ని వెనక్కు తీసుకున్నారు. ఇతర నియామకాల్లో బైడెన్ నిర్ణయాలకు మద్దతు లభించింది. విదేశాంగ మంత్రిగా ఆంటోనీ బ్లింకెన్, ట్రజరీ విభాగానికి జేన్ యెల్లెన్, పెంటగాన్ చీఫ్ గా లాయిడ్ ఆస్టిన్ లు తమ బాధ్యతలను స్వీకరించారు. 

అనుమతి లేకుండా భారత సముద్ర జలాల్లో యుఎస్ నేవీ ఆపరేషన్.. పెంటగాన్ సమర్థన

అనుమతి లేకుండా భారత సముద్ర జలాల్లో యుఎస్ నేవీ ఆపరేషన్.. పెంటగాన్ సమర్థన

   10 hours ago


ఒకే రోజు లక్షా 45 వేల కేసులు.. ప్రాణాలకే ప్రమాదమంటున్న నిపుణులు

ఒకే రోజు లక్షా 45 వేల కేసులు.. ప్రాణాలకే ప్రమాదమంటున్న నిపుణులు

   14 hours ago


టీకా ఉత్సవ్.. అర్హులందరికీ రికార్డు స్థాయిలో టీకాలు వేయండి.. మోదీ

టీకా ఉత్సవ్.. అర్హులందరికీ రికార్డు స్థాయిలో టీకాలు వేయండి.. మోదీ

   20 hours ago


ముత్యాలు పండాయి అన‌డం కాదు.. నిజంగానే పండిస్తే మ‌స్తు లాభాలు

ముత్యాలు పండాయి అన‌డం కాదు.. నిజంగానే పండిస్తే మ‌స్తు లాభాలు

   21 hours ago


ఒక్కరోజులో 800 మంది మృతి.. భారత్‌లో కోరలు చాస్తున్న కరోనా

ఒక్కరోజులో 800 మంది మృతి.. భారత్‌లో కోరలు చాస్తున్న కరోనా

   09-04-2021


వ్యాక్సిన్ ఉత్పత్తి తగ్గింది నిజమే.. కారణం ఏమిటంటే.. సీరమ్ సీఈఓ

వ్యాక్సిన్ ఉత్పత్తి తగ్గింది నిజమే.. కారణం ఏమిటంటే.. సీరమ్ సీఈఓ

   09-04-2021


అధికార్లకు తరచు సమన్లు ఇవ్వడం వేధింపులో భాగమే.. సుప్రీం

అధికార్లకు తరచు సమన్లు ఇవ్వడం వేధింపులో భాగమే.. సుప్రీం

   09-04-2021


డబ్బు వసూలుకు మంత్రి డిమాండ్ చేసింది నిజమే.. సచిన్ వాజే

డబ్బు వసూలుకు మంత్రి డిమాండ్ చేసింది నిజమే.. సచిన్ వాజే

   08-04-2021


పనిస్థలాల్లోనూ కోవిడ్19 వ్యాక్సిన్... అనుమతించనున్న కేంద్రప్రభుత్వం

పనిస్థలాల్లోనూ కోవిడ్19 వ్యాక్సిన్... అనుమతించనున్న కేంద్రప్రభుత్వం

   08-04-2021


అవసరమైన వారికే టీకా.. కోరిన ప్రతివారికీ కాదు.. కేంద్రం స్పష్టీకరణ

అవసరమైన వారికే టీకా.. కోరిన ప్రతివారికీ కాదు.. కేంద్రం స్పష్టీకరణ

   08-04-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle