14 ఏళ్ల బాలికని పెళ్లి చేసుకున్న 60 ఏళ్ల ఎంపీ
23-02-202123-02-2021 23:17:20 IST
2021-02-23T17:47:20.233Z23-02-2021 2021-02-23T17:10:23.620Z - - 27-02-2021

సభ్య సమాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామని చెప్పండి. అహా.. అసలు తలకాయ ఉందా. నెత్తిల గుజ్జుందా లేదా. అది గుండెనా బండనా. అసలు మంచి మర్యాదలు.. ఇవన్నీ మర్చిపోయారా అండీ జనాలు. సంప్రదాయాలు చట్టుబండలా పట్టించుకోరా. ఇలాంటి వార్తలు వింటుంటే.. ఈ ప్రపంచం ఏమై పోతుంది అని ఫీలవలేని వాళ్లు కూడా ఫీలవ్వాల్సిన సిచ్చువేషన్. ఇదే కానీ.. ఎంపీ కాకుండా వేరే వాళ్లు అయ్యుంటే.. ఇలాంటి మాటలు ఎన్నో అనే వాళ్లు. కానీ.. ఏం చేస్తారు చెప్పండి. ఎంపీ కదా. ఎవ్వరూ ఏమీ అనకుండా ఉండిపోయారు. అది కూడా మన దగ్గరైతే.. చీరి చింతగ్గట్టేవాళ్లే. కానీ.. పక్క దేశం పాకిస్థాన్ లో కదా.. ఏమీ అనలేక పోతున్నారు.
అవును.. ఎంపీ అంటే ఎంపీనే కానీ.. మన దేశపు ఎంపీ కాదులెండి. కొంతలో కొంత.. కాస్త రిలీఫ్ అయ్యే విషయమే. అలా అని అది మంచి పని అని ఎవరూ అనరు. కానీ.. మన సంప్రదాయాలు ఇంతలా దిగజారి పోయాయా. జనాలు అస్సలు పట్టించుకోనే పట్టించుకోవడం లేదా.. అని ఫీలైపోకుండా.. పక్క దేశం పాకిస్థాన్ లో అంటలే. అక్కడ వాళ్ల మంచి చెడులు గురించి మాట్లాడుకోవడం కూడా దండగే కదా అని కాస్త సర్దుకుంటాం. వాళ్లకి అలాంటి ఆలోచనలే ఉంటే.. మన దేశానికి ఇన్ని చిరాకులు ఎందుకుంటయ్ అని ఫీలైపోతం.
అయినా ఈ దారుణం ఏంటి చెప్పండి. బాధ్యతగల పొజిషన్ లో ఉండి.. ఇలా చేయడం ఏంటీ అంటున్నారు. మౌలానా సలా ఉద్దీన్ అనే ఎంపీ.. 2006లో పుట్టిన అమ్మాయిని అంటే.. 14 ఏళ్ల బాలికను పెళ్లి చేసుకున్నారు. ఈ విషయం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. ఆ ఎంపీ పెళ్లి చేసుకున్న అమ్మాయి ఇంకా ప్రభుత్వ స్కూల్ లో చదువుకుంటోంది. స్కూల్ ఎడ్యుకేషన్ కూడా పూర్తి కాని ఓ అమ్మాయిని ఓల్డేజ్ కి వచ్చిన ఎంపీ పెళ్లి చేసుకోవడం దారుణం అంటున్నారు. ఆమె కూడా ఆయన నియోజకవర్గంలోని అమ్మాయేనట. ఇలా పద్నాలుగేళ్ల బాలికను పెళ్లి చేసుకున్న ఎంపీ.. ఆ విషయాన్ని చాలా సీక్రెట్ గా మేన్ టేన్ చేస్తున్నారట. ఈ విషయంపై ఓ స్వచ్చంద సంస్థకు చెందిన మహిళ కంప్లైంట్ చేసింది.. అయ్యగారి బండారం బయటపడింది. ప్రపంచ వ్యాప్తంగా సారువారి పరువు పోయింది.

కరోనా అప్డేట్.. గత 24 గంటల్లో 16,488 మందికి కరోనా
9 minutes ago

కొరియన్ బ్యాండ్‌పై హోస్ట్ జాతి వివక్షా వ్యాఖ్యలు.. జర్మన్ రేడియో క్షమాపణ
37 minutes ago

కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ.. పెరుగుతున్న కరోనా కేసులు
an hour ago

ఎన్నికల షెడ్యూల్ ఇదే..!
13 hours ago

భారత్ పాక్ కాల్పుల విరమణ.. సూత్రధారి దోవల్
20 hours ago

కరోనా కేసుల అప్డేట్.. గత 24 గంటల్లో 16,577 మందికి కరోనా..!
20 hours ago

గ్రీన్‌కార్డు దరఖాస్తుదారులకు బైడెన్ గ్రీన్ సిగ్నల్
21 hours ago

మోదీ.. ఉద్యోగమివ్వు.. 50 లక్షల ట్వీట్లతో ట్విట్టర్లో ట్రెండింగ్
a day ago

టీ చేయకపోతే చావగొడతారా.. భార్య అంటే వస్తువా.. ధ్వజమెత్తిన హైకోర్టు
17 hours ago

అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలు ఉన్న వాహనం
26-02-2021
ఇంకా