newssting
Radio
BITING NEWS :
తెలంగాణలో నేటి నుంచి కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభం. రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సినేషన్ కు 1213 సెంటర్లు ఏర్పాటు. నిమ్స్ లో వ్యాక్సినేషన్ ను ప్రారంభించనున్న గవర్నర్ తమిళి సై. * దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న బర్డ్ ఫ్లూ. 11 రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ వ్యాపించినట్లు కేంద్రం ప్రకటన. * ఏపీ తమిళనాడు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సుల వివాదం. పర్మిట్, రికార్డులు సరిగ్గాలేవని బస్సులు సీజ్. * తెలుగు రాష్ట్రాలకు 19 మంది ఐఏఎస్ లను కేటాయించిన కేంద్రం. ఏపీకి 10 మంది, తెలంగాణకు 9 మంది ఐఏఎస్ ల కేటాయింపు. * కృష్ణాజిల్లా మాజీ ఎస్పీఓ నాగశ్రీను ఆత్మహత్యాయత్నం. నాగశ్రీను పరిస్థితి విషమం, గుంటూరు ఆస్పత్రికి తరలింపు. * మధురై అలాంగనల్లూర్ లో ప్రారంభమైన జల్లికట్టు పోటీలు. పోటీలను ప్రారంభించిన సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం. * కొత్త ప్రైవసీ విధానంపై వెనక్కితగ్గిన వాట్సాప్. కొత్త ప్రైవసీ విధానాన్ని మే 15 వరకూ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన వాట్సాప్ యాజమాన్యం.

తొలి రోజు 56.5 లక్షల టీకా డోసుల తరలింపు.. కేంద్రమంత్రి

13-01-202113-01-2021 16:36:55 IST
2021-01-13T11:06:55.843Z13-01-2021 2021-01-13T11:06:51.970Z - - 17-01-2021

తొలి రోజు 56.5 లక్షల టీకా డోసుల తరలింపు.. కేంద్రమంత్రి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కోవిడ్-19 వ్యాక్సినేషన్ తరలింపులోనూ భారత్ తొలిరోజే రికార్డు సృష్టించింది. మంగళవారం ఉదయం నుంచి దేశవ్యాప్తంగా మొదటి విడత కరోనా టీకా తరలింపు ప్రారంభం కాగా, ఢిల్లీతో సహా దేశంలోని 13 నగరాలకు సాయంత్రంలోపే 56.5 లక్షల కోవిషీల్డ్ టీకా డోసులను విమానాల ద్వారా తరలించారు. టీకా తరలింపు మొదలైన తొలిరోజే నాలుగు విమాన సంస్థలకు చెందిన 9 విమానాలు 56.5 లక్షల టీకా డోసులను తరలించినట్లు పౌరవిమానయాన శాఖ తెలిపింది. మొత్తం 11 టన్నుల బరువున్న టీకాను దేశంలోని 13 నగరాలకు తరలించినట్లు విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ప్రకటించారు.

కేంద్ర ప్రభుత్వం సోమవారం కోవిషీల్డ్‌ , కోవాగ్జిన్‌ టీకాల 6 కోట్ల డోసుల కొనుగోలుకు ఆర్డర్లు జారీ చేయగా మంగళవారం ఉదయం నుంచి మొదటి విడత టీకా తరలింపు ప్రారంభమైన విషయం తెలిసిందే. వ్యాక్సిన్‌ డ్రైవ్‌కు నాలుగు రోజులు ముందుగానే సీరం ఇన్‌స్టిట్యూట్‌ ప్రధాన కేంద్రం పుణే నుంచి దేశ రాజధాని ఢిల్లీ సహా 13 నగరాలకు 56.5 లక్షల డోసులకు పైగా కోవిషీల్డ్‌ టీకాను తరలించడం విశేషం.

పుణే నుంచి స్పైస్‌జెట్, గోఎయిర్, ఎయిర్‌ ఇండియా, ఇండిగో సంస్థల విమానాలు ఢిల్లీ, హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, చెన్నై, అహ్మదాబాద్, చండీగఢ్, కోల్‌కతా, భువనేశ్వర్, పట్నా, లక్నో, కర్నాల్, ముంబై నగరాల్లో సిద్ధం చేసిన రాష్ట్ర స్థాయి డిపోలకు కోవిషీల్డ్‌ డోసులను తీసుకెళ్లాయని మంత్రి చెప్పారు. 

56 lakh doses of Covishield shipped across India for massive Covid  vaccination drive | Highlights - Coronavirus Outbreak News

ఈ నెల 14వ తేదీ నాటికి కోవిషీల్డ్‌ 1.1 కోట్ల డోసులు, కోవాగ్జిన్‌ 55 లక్షల డోసులు నిర్దేశించిన కేంద్రాలకు చేరుతాయని ప్రభుత్వం తెలిపింది. మంగళవారం మధ్యాహ్నం 4 గంటల వరకు దేశంలోని వివిధ ప్రాంతాలకు 54.72 లక్షల డోసుల కోవిషీల్డ్‌ టీకా బాక్సులు చేరుకున్నట్లు ప్రకటించింది. 28 రోజుల వ్యవధిలో రెండు డోసులు పూర్తయిన 14 రోజుల తర్వాతే టీకా ప్రభావం కనిపిస్తుందని చెప్పారు.

భారత్‌లోనే టీకా ధర అతి తక్కువ

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే ఉపయోగిస్తున్న కరోనా టీకాల్లో భారతదేశం ఉత్పత్తి చేసిన టీకా ధరలే అతితక్కువ అని ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ తెలిపారు. కోవాగ్జిన్‌ టీకా మొత్తం డోసులు 55 లక్షలు. కాగా, ఇందులో రూ.295 చొప్పున 38.5 లక్షల డోసులు, మిగతా 16.5 లక్షల డోసులు ఉచితంగా అందిస్తున్నారు. మొత్తం కలిపితే  ఒక డోసు ధర సరాసరిన రూ.206 అవుతుందని రాజేశ్‌ భూషణ్‌ తెలిపారు. 

ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులో ఉన్న టీకా ధరలను చూస్తే ఫైజర్‌ డోసు రూ.1,431, మోడెర్నా రూ.2,348 నుంచి రూ.2,715 వరకు, సినోవాక్‌ రూ.1,027, నోవావ్యాక్స్‌ రూ.1,114, స్పుత్నిక్‌ వీ రూ.734, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ ధర రూ.734కు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. వీటిల్లో ఫైజర్‌ టీకా మైనస్‌ 70 డిగ్రీల వద్ద మినహా మిగతా వాటన్నిటినీ 2 నుంచి 8 డిగ్రీల ఉష్ణోగ్రతల వద్ద నిల్వ ఉంచవచ్చన్నారు. 

మోదీ వ్యాక్సిన్ వేసుకుంటే చాలు అని అంటున్నారుగా..!

మోదీ వ్యాక్సిన్ వేసుకుంటే చాలు అని అంటున్నారుగా..!

   7 hours ago


భ‌ర్త‌కు విడాకులు.. కొడుకుతో పెళ్లి.. ఇప్పుడు త‌ల్లి

భ‌ర్త‌కు విడాకులు.. కొడుకుతో పెళ్లి.. ఇప్పుడు త‌ల్లి

   14 hours ago


వైట్ హౌజ్ కాదు.. వాషింగ్ట‌న్ నే వ‌దిలేస్తారట

వైట్ హౌజ్ కాదు.. వాషింగ్ట‌న్ నే వ‌దిలేస్తారట

   12 hours ago


ట్రంప్‌పై బండ పడింది.. అభిశంసనకు ఆమోదం.. సెనేట్ నిర్ణయం ఫైనల్

ట్రంప్‌పై బండ పడింది.. అభిశంసనకు ఆమోదం.. సెనేట్ నిర్ణయం ఫైనల్

   15 hours ago


భారతదేశంలో మొదలైన వ్యాక్సినేషన్..

భారతదేశంలో మొదలైన వ్యాక్సినేషన్..

   16 hours ago


ఎంత గ్యాప్ ఉంటే అంత సమర్థంగా వ్యాక్సిన్ పనితీరు.. సీరమ్ సైంటిస్టు

ఎంత గ్యాప్ ఉంటే అంత సమర్థంగా వ్యాక్సిన్ పనితీరు.. సీరమ్ సైంటిస్టు

   16 hours ago


తొమ్మిదో రౌండ్ చర్చలు 120 శాతం విఫలం.. రైతుసంఘాల వ్యాఖ్య

తొమ్మిదో రౌండ్ చర్చలు 120 శాతం విఫలం.. రైతుసంఘాల వ్యాఖ్య

   18 hours ago


భారత్ చైనా ప్రతిష్టంభన.. సడలింపు.. పాంగాంగ్ సరస్సు ప్రారంభం..

భారత్ చైనా ప్రతిష్టంభన.. సడలింపు.. పాంగాంగ్ సరస్సు ప్రారంభం..

   18 hours ago


కాసేప‌ట్లో క‌రోనా వ్యాక్సిన్ ప్రారంభం.. ప్ర‌పంచంలో మ‌న‌మే టాప్

కాసేప‌ట్లో క‌రోనా వ్యాక్సిన్ ప్రారంభం.. ప్ర‌పంచంలో మ‌న‌మే టాప్

   18 hours ago


ఏపీలో మద్యం ధరల పెంపు.. దేశంలో పెట్రోల్ ధరల పెంపు ఒక్కటేనా..

ఏపీలో మద్యం ధరల పెంపు.. దేశంలో పెట్రోల్ ధరల పెంపు ఒక్కటేనా..

   15-01-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle