newssting
Radio
BITING NEWS :
నిర్మల్ లోని అనంతపేటలో దారుణం. మద్యంమత్తులో కూతురిని చంపిన తండ్రి. 4 ఏళ్ల కూతురిని కొట్టి చంపిన మహేష్. * రైతులకు అండగా ఈ నెల 7న ఏపీ వ్యాప్తంగా జనసేన ఆందోళనలు. తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులకు రూ.35 వేలు చెల్లించాలని డిమాండ్ చేసిన పవన్ కల్యాణ్. రజనీకాంత్ రాజకీయ ప్రవేశం మంచి పరిణామమన్న పవన్. * నేటి మధ్యాహ్నం 12 గంటలకు ఎన్నికల కో ఆర్డినేషన్ కమిటీతో భేటీ కానున్న బండి సంజయ్. ఎన్నికలు జరిగిన తీరు, భవిష్యత్ కార్యాచరణపై చర్చ. * కృష్ణాజిల్లా గన్నవరం వద్ద ఆగిఉన్న లారీని ఢీ కొట్టిన కారు. ఒకరు మృతి, నలుగురికి తీవ్రగాయాలు. *మాజీ మంత్రి కమతం రామిరెడ్డి (82) కన్నుమూత. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రామిరెడ్డి. రామిరెడ్డి మృతిపట్ల సంతాపం తెలిపిన సీఎం కేసీఆర్. * తిరుపతిలో ఆన్ లైన్ వ్యభిచారం గుట్టురట్టు. జీవకోనలో ముఠాను అరెస్ట్ చేసిన సీఐడీ.

బియ్యం ట్రక్కులో తీవ్రవాదులు.. ఎన్నికలను అడ్డుకోవడమే వారి లక్ష్యమా

20-11-202020-11-2020 07:56:19 IST
2020-11-20T02:26:19.829Z20-11-2020 2020-11-20T02:25:48.580Z - - 06-12-2020

బియ్యం ట్రక్కులో తీవ్రవాదులు.. ఎన్నికలను అడ్డుకోవడమే వారి లక్ష్యమా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ప్రస్తుతం పాకిస్థాన్ లక్ష్యం రెండే రెండు లక్ష్యాలను పెట్టుకుంది.. భారత్ లోకి తీవ్రవాదులను పంపించడం, కాశ్మీర్ లో భారీ స్థాయిలో ఉగ్రదాడులు చోటు చేసుకునేలా చేయడం. అందుకోసమే సరిహద్దుల్లో కాల్పుల విరమణకు తూట్లు పొడుస్తూ ఉంది పాకిస్థాన్. ఓ వైపు భారత సైన్యం దృష్టి మరల్చాలని.. మరో వైపు ఇంకొన్ని దారుల్లో భారత్ లోకి తీవ్ర వాదులను పంపించాలని.. కానీ భారత సైన్యం ముందు పాకిస్థాన్ పప్పులు ఉండకడం లేదు. గీత దాటి వచ్చిన వారిని.. పైలోకానికి పంపిస్తూ ఉన్నారు. గురువారం నాడు కూడా జమ్మూ శివారులో గురువారం జరిగిన ఎదురుకాల్పుల్లో జైషే మొహమ్మద్‌కు చెందిన నలుగురు ఉగ్రవాదులను భారత సైన్యం మట్టు బెట్టింది.  తీవ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. 

జమ్మూ హైవేపై నగ్రోటా ప్రాంతంలోని బాన్‌ టోల్‌ప్లాజా వద్ద అనుమానాస్పదంగా కనిపించిన బియ్యం ట్రక్కును తనిఖీ చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. ట్రక్కు డ్రైవర్‌ వెంటనే దిగి పారిపోగా, ట్రక్కులో బియ్యం బస్తాల మాటున దాక్కున్న ఉగ్రవాదులు గ్రెనేడ్లు విసరుతూ, కాల్పులు ప్రారంభించారు. దీంతో పోలీసులు, సీఆర్పీఎఫ్‌ బలగాలు ఆ ట్రక్కును చుట్టుముట్టి, దీటుగా స్పందించారు. ఈ కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు చనిపోయారు. ట్రక్కు నుంచి 11 ఏకే రైఫిళ్లు, 24 మేగజైన్లు, 3 పిస్టళ్లు, 35 గ్రెనేడ్లను స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు భారీగా మందులు, పేలుడు సామగ్రి, వైర్ల బండిళ్లు, ఎలక్ట్రానిక్‌ సర్క్యూట్లు లభ్యమయ్యాయి. 

ఉగ్రవాదులు పాకిస్తాన్‌కు చెందిన వారనీ, స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు అవరోధం కలిగించడమే వీరి లక్ష్యంగా భావిస్తున్నట్లు జమ్మూ పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌(ఐజీపీ) ముకేశ్‌  చెప్పారు. కశ్మీర్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా కేంద్రప్రభుత్వం ప్రకటించిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈనెల 28వ తేదీన, డిసెంబర్‌ 22న జిల్లా అభివృద్ధి మండళ్లకు ఎన్నికలు జరగనున్నాయి. 

చిన్నమ్మ అనుకున్నదొక్కటి.. అవుతోంది ఒక్కటి

చిన్నమ్మ అనుకున్నదొక్కటి.. అవుతోంది ఒక్కటి

   7 hours ago


ప్రభుత్వం ఫ్రీ గా హెల్మెట్ ఇస్తోంది.. ఇకనైనా మార్పు వస్తోందా..?

ప్రభుత్వం ఫ్రీ గా హెల్మెట్ ఇస్తోంది.. ఇకనైనా మార్పు వస్తోందా..?

   8 hours ago


దేశంలో కరోనా టీకా ప్రారంభం.. ప్రధాని మోదీ ప్రకటన

దేశంలో కరోనా టీకా ప్రారంభం.. ప్రధాని మోదీ ప్రకటన

   13 hours ago


కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న మంత్రికి కరోనా..

కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న మంత్రికి కరోనా..

   14 hours ago


కరోనా కేసుల అప్డేట్స్..దేశంలో 96 లక్షలు దాటిన కరోనా కేసులు

కరోనా కేసుల అప్డేట్స్..దేశంలో 96 లక్షలు దాటిన కరోనా కేసులు

   16 hours ago


రైతుల ఆందోళనలపై కెనడా ప్రధాని వ్యాఖ్యలు సహించం.. భారత్

రైతుల ఆందోళనలపై కెనడా ప్రధాని వ్యాఖ్యలు సహించం.. భారత్

   18 hours ago


కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో కోలుకున్న 42,916 మంది

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో కోలుకున్న 42,916 మంది

   04-12-2020


ఒక్కరోజులో అమెరికాలో లక్ష కేసులు.. 3 వేలకుపైగా మరణాలు

ఒక్కరోజులో అమెరికాలో లక్ష కేసులు.. 3 వేలకుపైగా మరణాలు

   04-12-2020


రైతుల మాట వినండి సారూ.. లేకుంటే చాలా కష్టమే..!

రైతుల మాట వినండి సారూ.. లేకుంటే చాలా కష్టమే..!

   03-12-2020


హెచ్‌–1బీ వీసాదారులకు భారీ ఊరట..

హెచ్‌–1బీ వీసాదారులకు భారీ ఊరట..

   03-12-2020


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle