newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

మూడు వేల మంది కోవిడ్ 'వాహకులు' గల్లంతు.. కర్ణాటకలో కలకలం

28-04-202128-04-2021 21:03:09 IST
2021-04-28T15:33:09.215Z28-04-2021 2021-04-28T15:32:10.859Z - - 14-05-2021

మూడు వేల మంది కోవిడ్ 'వాహకులు' గల్లంతు.. కర్ణాటకలో కలకలం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
బెంగళూరు: కోవిడ్ మహమ్మారి ఎప్పుడు ఎవరికీ సోకుతుందో తెలియని పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి. బయటికి వస్తేనే ఎక్కడ ఈ వైరస్ ముప్పు తెస్తుందోనన్న భయం ప్రతి ఒక్కరినీ వెన్నాడుతోంది. ఈ పరిస్థితుల్లో కర్ణాటకలో ఓ బీభత్సమే జరిగింది. కోవిడ్ వైరస్ సోకినట్లుగా భావిస్తున్న దాదాపు రెండు నుంచి మూడు వేల మంది జాడ లేకుండా పోయింది. ఈ మూడు వేల మంది ఎంతమంది ప్రాణాలకు ముప్పు తెస్తారోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఓ పక్క రోజువారీగా పెరిగిపోతున్న కేసులు సర్కారును కకావికలు చేస్తుంటే ఈ వైరస్ క్యారియర్లు ఎలాంటి ఉపద్రవాన్ని తెచ్చి పెడతారోనన్న ఆందోళనను రాష్ట్ర రెవెన్యూ మంత్రి వ్యక్తం చేశారు. 

వైరస్ సోకిన వ్యక్తులు ఫోన్లను స్విచ్ ఆప్ చేయవద్దని బహిరంగంగా అభ్యర్ధించారు. ఈ మూడు వేల మంది మోసుకెళ్లే వైరస్ ఎంత మందికి వ్యాపిస్తుందోనని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మూడు వేల మందికి వైరస్ సోకిన విషయం తెలియగానే వారి జాడ తెలియకుండా పోయిందని, ఇళ్లకు కూడా వెళ్లడం లేదని సమాచారం అందినట్లు ఆయన తెలిపారు. వీరి ఆచూకీని తెలుసుకొని ఆసుపత్రులలో చేర్పించే ప్రయత్నం చేశామని, కానీ ఇంతవరకూ ఎలాంటి ప్రయాజనం కలుగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దేశానికి తాళం తప్పదా? ఈ తప్పు ఎవరిది!

కోవిడ్ వైరస్ ఎలా సోకుతుందో ఎవరికీ తెలియని పరిస్థితుల్లో వైరస్ సోకిన ఈ మూడు వేల మంది చర్యల వల్ల పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుందని అన్నారు. ఈ రకమైన అవాంఛనీయ చర్యలకు పాల్పడవద్దని వైరస్ వ్యాధిగ్రస్తులకు చేతులెత్తి నమస్కరిస్తున్నానని ఆయన అన్నారు. కర్ణాటకలో కొత్తగా మరో 30 వేల కోవిడ్ కేసులు నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో 200 మంది మరణించారు. మొత్తం రాష్ట్ర కోవిడ్  కేసుల్లో బెంగళూరు పట్టణ ప్రాంతంలోనే అత్యధిక స్థాయిలో కేసులు నమోదు కావడంతో మంగళవారం నుంచి 14 రోజుల పాటు లాక్ డౌన్ విధించారు.   

కోవిడ్ వైరస్ వ్యాప్తిని ఎక్కడికక్కడి అరికట్టాలన్న సంకల్పంతోనే ఈ చర్యలు తీసుకున్నామని ముఖ్యమంత్రి యడ్యూరప్ప తెలిపారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటికి రావడానికి వీలులేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కేసుల తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా అనేక చోట్ల లాక్ డౌన్ విధించక తప్పని పరిస్థితులు తలెత్తుతున్నట్లుగా కనిపిస్తోంది. దాదాపు మూడు వేల మంది కోవిడ్ వైరస్ బాధితుల ఆచూకీ దొరకడం లేదన్న వార్తలు కర్ణాటక వ్యాప్తంగా కలకలం రేపడమే కాకుండా ప్రభుత్వాన్ని కూడా చిక్కుల్లో పడవేశాయి.    

ఆగస్టు-డిసెంబరు మధ్య 200 కోట్ల కరోనా టీకాలు భారత్ లో ఉంటాయట..!

ఆగస్టు-డిసెంబరు మధ్య 200 కోట్ల కరోనా టీకాలు భారత్ లో ఉంటాయట..!

   2 hours ago


ఇక 12 - 16 వారాల ఎడం.. వ్యాక్సిన్ డోసుల మధ్య వ్యవధి పెంచిన కేంద్రం

ఇక 12 - 16 వారాల ఎడం.. వ్యాక్సిన్ డోసుల మధ్య వ్యవధి పెంచిన కేంద్రం

   2 hours ago


మేళాలు, సభల వల్లే  కోవిడ్ స్వైరవిహారం... ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాఖ్య

మేళాలు, సభల వల్లే కోవిడ్ స్వైరవిహారం... ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాఖ్య

   12 hours ago


కోవిడ్ కేకల మధ్య సెంట్రల్ విస్టా అవసరమా...? వెంటనే ఆపండి..?

కోవిడ్ కేకల మధ్య సెంట్రల్ విస్టా అవసరమా...? వెంటనే ఆపండి..?

   19 hours ago


మిగులు ఆక్సిజన్ ఉంది... ఎవరికైనా ఇవ్వండి  కేంద్రానికి ఢిల్లీ సర్కార్ లేఖ

మిగులు ఆక్సిజన్ ఉంది... ఎవరికైనా ఇవ్వండి కేంద్రానికి ఢిల్లీ సర్కార్ లేఖ

   20 hours ago


ముందే రానున్న నైరుతి రుతుపవనాలు.. అరేబియా సముద్రంలో తుపాను ఏర్పడే అవకాశం

ముందే రానున్న నైరుతి రుతుపవనాలు.. అరేబియా సముద్రంలో తుపాను ఏర్పడే అవకాశం

   18 hours ago


టెన్షన్ పెడుతున్న బ్లాక్ ఫంగస్

టెన్షన్ పెడుతున్న బ్లాక్ ఫంగస్

   a day ago


వ్యాక్సిన్ ఉత్పత్తికి స్థలాలిస్తాం... మోడీకి మమతా లేఖ

వ్యాక్సిన్ ఉత్పత్తికి స్థలాలిస్తాం... మోడీకి మమతా లేఖ

   13-05-2021


ఇంటింటి టీకాల్లో జాప్యం వద్దు ... ఇప్పటికే ఎందరి ప్రాణాలొ కోల్పోయాం: కేంద్రానికి  బొంబాయి హైకోర్టు  హితవు

ఇంటింటి టీకాల్లో జాప్యం వద్దు ... ఇప్పటికే ఎందరి ప్రాణాలొ కోల్పోయాం: కేంద్రానికి బొంబాయి హైకోర్టు హితవు

   12-05-2021


కరోనా కేసుల అప్డేట్స్.. కొత్త‌గా 3,48,421 మందికి కరోనా

కరోనా కేసుల అప్డేట్స్.. కొత్త‌గా 3,48,421 మందికి కరోనా

   12-05-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle