newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఒకే రోజు లక్షా 45 వేల కేసులు.. ప్రాణాలకే ప్రమాదమంటున్న నిపుణులు

10-04-202110-04-2021 16:29:52 IST
2021-04-10T10:59:52.354Z10-04-2021 2021-04-10T10:30:45.087Z - - 15-05-2021

ఒకే రోజు లక్షా 45 వేల కేసులు.. ప్రాణాలకే ప్రమాదమంటున్న నిపుణులు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశంలో గత సంవత్సర కాలంలో 24 గంటల్లో కనీవినీ ఎరుగని రీతిలో లక్షా 45  వేల కేసులు నమోదవడంతో ఏమాత్రం అప్రమత్తంగా లేకపోతే ప్రాణాలకే ప్రమాదమని వైద్య నిపుణులు హెచ్చరించారు. దీనికితోడు మొట్టమొదటిసారిగా దేశంలో పది లక్షల యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో ఇంతవకు 32 లక్షల కరోనా కేసులు నమోదుకాగా మహారాష్ట్ర కరోనా తాకిడికి ఘోరంగా ప్రభావితమవుతోంది. 

వరుసగా అయిదో రోజు కూడా రోజుకు లక్షకు పైగా కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. గత అయిదురోజుల్లో 6.16 లక్షల మంది తాజాగా కరోనా బారిన పడ్డారు. ఈ అయిదు రోజుల్లోనే 3,335 మంది కరోనా రోగులు మృత్యువాత పడ్డారు. శుక్రవారం ఒక్కరోజే 794 మంది కరోనాకు బలవడం గమనార్హం.

కాగా దేశంలో ఇంతవరకు 9.78 కోట్ల కరోనా టీకాలను ఇచ్చినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. అయితే కేంద్ర ప్రభుత్వం సహకరిస్తానని చెబుతున్నప్పటికీ దేశంలోని పలు రాష్ట్రాలు టీకా కొరతతో అల్లాడుతున్నాయి.

కరోనా సెకండ్ వేవ్ అదుపు తప్పడంతో పలు రాష్ట్రాల్లో తాజాగా నిబంధనలను విధించారు. ఇప్పటికే మహారాష్ట్రలో వీకెండ్ లాక్ డౌన్ మొదలు కాగా చాలా రాష్ట్రాల్లో రాత్రి పూట కర్ప్యూని ప్రారంభించేశారు.

శుక్రవారం కరోనా నుంచి కోలుకుని 77,567 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ఇప్పటి వరకు 19,90,859 మంది కోలుకున్నారు. ప్రస్తుతం యాక్టివ్‌ సంఖ్య 10,46,631కి చేరుకుంది.  మొత్తం 9,80,75,160 వ్యాక్సిన్‌ తీసుకున్నారు.

తెలంగాణలో సెకండ్ వేవ్ సందర్భంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 2,909 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. శుక్రవారం 584 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ఆరుగురు మృతి చెందారు. మొత్తం కేసుల సంఖ్య 3,24,091కు పెరిగాయి. ఇప్పటివరకు 3,04,548 మంది డిశ్చార్జ్‌ అవ్వగా, 1752 మంది మృతి చెందారు. తెలంగాణలో ప్రస్తుతం 17,791 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

మహారాష్ట్ర తర్వాత ఢిల్లీలో కరోనా విజృంభించడంతో మల్లీ ప్రకటించేంతవరకు పాఠశాలలు, కాలేజీలను నిరవధికంగా మూసివేస్తున్నట్లు అమ్మ ఆద్మీ ప్రభుత్వం ప్రకటించింది. బెంగళూరుతో సహా మరో ఎనిమిది నగరాల్లో రాత్రిపూట కర్ప్యూ విధించినట్లు కర్నాటక ప్రభుత్వం పేర్కొంది.

కోవిడ్ నిబంధనలు పాటించనట్లయితే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న స్టార్ కేంపెయినర్లను, అభ్యర్థులను నిషేధిస్తామని ఎన్నికల కమిషన్ పేర్కొంది. ఇప్పటికే కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలో పోలింగ్  ముగిసింది. బెంగాల్‌లో నాలుగో దశ ఎన్నికలు నేడు జరుగుతున్నాయి.

రైతుల ఖాతాల్లోకి మరో 20 వేల కోట్లు... 8వ విడత కిసాన్ నిధులు విడుదల

రైతుల ఖాతాల్లోకి మరో 20 వేల కోట్లు... 8వ విడత కిసాన్ నిధులు విడుదల

   10 hours ago


నెలాఖరుకల్లా కోవిడ్ బలహీనం !

నెలాఖరుకల్లా కోవిడ్ బలహీనం !

   15 hours ago


ఆగస్టు-డిసెంబరు మధ్య 200 కోట్ల కరోనా టీకాలు భారత్ లో ఉంటాయట..!

ఆగస్టు-డిసెంబరు మధ్య 200 కోట్ల కరోనా టీకాలు భారత్ లో ఉంటాయట..!

   a day ago


ఇక 12 - 16 వారాల ఎడం.. వ్యాక్సిన్ డోసుల మధ్య వ్యవధి పెంచిన కేంద్రం

ఇక 12 - 16 వారాల ఎడం.. వ్యాక్సిన్ డోసుల మధ్య వ్యవధి పెంచిన కేంద్రం

   a day ago


మేళాలు, సభల వల్లే  కోవిడ్ స్వైరవిహారం... ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాఖ్య

మేళాలు, సభల వల్లే కోవిడ్ స్వైరవిహారం... ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాఖ్య

   13-05-2021


కోవిడ్ కేకల మధ్య సెంట్రల్ విస్టా అవసరమా...? వెంటనే ఆపండి..?

కోవిడ్ కేకల మధ్య సెంట్రల్ విస్టా అవసరమా...? వెంటనే ఆపండి..?

   13-05-2021


మిగులు ఆక్సిజన్ ఉంది... ఎవరికైనా ఇవ్వండి  కేంద్రానికి ఢిల్లీ సర్కార్ లేఖ

మిగులు ఆక్సిజన్ ఉంది... ఎవరికైనా ఇవ్వండి కేంద్రానికి ఢిల్లీ సర్కార్ లేఖ

   13-05-2021


ముందే రానున్న నైరుతి రుతుపవనాలు.. అరేబియా సముద్రంలో తుపాను ఏర్పడే అవకాశం

ముందే రానున్న నైరుతి రుతుపవనాలు.. అరేబియా సముద్రంలో తుపాను ఏర్పడే అవకాశం

   13-05-2021


టెన్షన్ పెడుతున్న బ్లాక్ ఫంగస్

టెన్షన్ పెడుతున్న బ్లాక్ ఫంగస్

   13-05-2021


వ్యాక్సిన్ ఉత్పత్తికి స్థలాలిస్తాం... మోడీకి మమతా లేఖ

వ్యాక్సిన్ ఉత్పత్తికి స్థలాలిస్తాం... మోడీకి మమతా లేఖ

   13-05-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle