newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఒక్కరోజులో 800 మంది మృతి.. భారత్‌లో కోరలు చాస్తున్న కరోనా

09-04-202109-04-2021 18:22:27 IST
2021-04-09T12:52:27.883Z09-04-2021 2021-04-09T11:19:31.928Z - - 15-05-2021

ఒక్కరోజులో 800 మంది మృతి.. భారత్‌లో కోరలు చాస్తున్న కరోనా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రోజువారీ కరోనా కేసుల్లో భారత్ మరొక రికార్డు సృష్టించింది. 24 గంటల్లోగా లక్షా 31 వేల కొత్త కేసులు నమోదు కావడంతో దేశంలో మొత్తం కరోనా కేసులు 1.3 కోట్లకు చేరుకున్నాయి. గత సంవత్సరం తొలి వేవ్‌ కంటే గత పదిరోజులుగా సెకెండ్ వేవ్‌ బీభత్సం సృష్టిస్తుండటంతో అనేక రాష్ట్రాలు కఠిన నిబంధనలను విధించాయి.

అయిదురోజుల్లో దేశంలో లక్షకు పైగా కరోనా కేసులు నమోదు కావడం ఇది నాలుగోసారి. గత 24 గంటల్లో 780  మంది కరోనా వైరస్‌కు బలి కాగా దేశవ్యాప్తంగా ఇంతవరకు లక్షా 67 వేలమంది కరోనా బారిన పడి చనిపోయారు. అమెరికా, బ్రెజిల్ తర్వాత కరోనాకు తీవ్రంగా గురైన మూడో దేశంగా భారత్ నిలబడగా కేసులు విషయంలో ఇప్పుడు రెండో స్థానం ఆక్రమించింది.

ఒకవైపు టీకా ఉత్సవ్ పేరుతో ఏప్రిల్ 11 నుంచి 14 వరకు అర్హులైనవారిలో వీలైనంత ఎక్కువమందికి కరోనా టీకా వేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాష్ట్రాల సీఎంలను కోరారు. కానీ అనేక రాష్ట్రాల్లో కరోనా టీకాలకు తీవ్రమైన కొరత ఏర్పడటంతో టీకా కేంద్రాలకు వస్తున్నవారిని స్టాక్ లేదని తిప్పి పంపేస్తున్నారు.

ఉదాహరణకు మహారాష్ట్రలోని పలు జిల్లాల్లో టీకా కొరత కారణంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తిగా ఆపివేశారు.  ఒక్క ముంబై, నవీ ముంబై ప్రాంతంలోనే 20 టీకా కేంద్రాలను మూసివేశారు. దీంతో కేంద్రప్రభుత్వం అదనపు టీకాలు పంపించకుంటే వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తిగా నిలిచిపోతుందని మహారాష్ట్ర హోంమంత్రి తెలిపారు.

మహారాష్ట్ర తర్వాత కేరళ, కర్నాటక, ఆంద్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలు కూడా టీకాల కొరతను ఎదుర్కొంటున్నాయి. కాగా కొన్ని రాష్ట్రాలకు టీకా సరఫరాపై కేంద్ర ప్రభుత్వం పక్షపాత దృష్టితో వ్యవహరిస్తున్నట్లు వస్తున్న ఆరోపణలను కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ తిప్పికొట్టారు. తమ చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇలాంటి వాదనలు చేస్తున్నారని, మహారాష్ట్ర, రాజస్థాన్ వంటి బీజేపీయేతర రాష్ట్రాలకు అందరికంటే ఎక్కువగా కరోనా టీకాలను పంపించామని గుర్తు చేశారు.

తెలంగాణలో బీభత్సంగా పెరిగిన కేసులు

తెలంగాణలో రోజురోజుకూ కరోనా కేసులు తీవ్రమవుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 2,478 కరోనా కేసులు నమోదవ్వగా, గురువారం అదుగురు మృతి చెందారు. 363 మంది బాధితులు కోలుకున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 15,472 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. తెలంగాణలో కొత్తగా  ప్రస్తుతం 9,674 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో గత 24 గంటల్లో 402 కరోనా కేసులు వెలుగు చూశాయి.  గురువారం ఒక్కరోజులో 1,01,986 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.

కర్నాటక, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాల్లో రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల వరకు రాత్రి కర్ప్యూ విధించారు. ఢిల్లీలో రికార్డు స్థాయిలో గురువారం 7,437 తాజా కేసులు నమోదయ్యాయి. ఈ సంవత్సరంలో ఇదే అత్యధిక స్థాయి కావడం విశేషం.

రైతుల ఖాతాల్లోకి మరో 20 వేల కోట్లు... 8వ విడత కిసాన్ నిధులు విడుదల

రైతుల ఖాతాల్లోకి మరో 20 వేల కోట్లు... 8వ విడత కిసాన్ నిధులు విడుదల

   10 hours ago


నెలాఖరుకల్లా కోవిడ్ బలహీనం !

నెలాఖరుకల్లా కోవిడ్ బలహీనం !

   16 hours ago


ఆగస్టు-డిసెంబరు మధ్య 200 కోట్ల కరోనా టీకాలు భారత్ లో ఉంటాయట..!

ఆగస్టు-డిసెంబరు మధ్య 200 కోట్ల కరోనా టీకాలు భారత్ లో ఉంటాయట..!

   a day ago


ఇక 12 - 16 వారాల ఎడం.. వ్యాక్సిన్ డోసుల మధ్య వ్యవధి పెంచిన కేంద్రం

ఇక 12 - 16 వారాల ఎడం.. వ్యాక్సిన్ డోసుల మధ్య వ్యవధి పెంచిన కేంద్రం

   a day ago


మేళాలు, సభల వల్లే  కోవిడ్ స్వైరవిహారం... ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాఖ్య

మేళాలు, సభల వల్లే కోవిడ్ స్వైరవిహారం... ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాఖ్య

   13-05-2021


కోవిడ్ కేకల మధ్య సెంట్రల్ విస్టా అవసరమా...? వెంటనే ఆపండి..?

కోవిడ్ కేకల మధ్య సెంట్రల్ విస్టా అవసరమా...? వెంటనే ఆపండి..?

   13-05-2021


మిగులు ఆక్సిజన్ ఉంది... ఎవరికైనా ఇవ్వండి  కేంద్రానికి ఢిల్లీ సర్కార్ లేఖ

మిగులు ఆక్సిజన్ ఉంది... ఎవరికైనా ఇవ్వండి కేంద్రానికి ఢిల్లీ సర్కార్ లేఖ

   13-05-2021


ముందే రానున్న నైరుతి రుతుపవనాలు.. అరేబియా సముద్రంలో తుపాను ఏర్పడే అవకాశం

ముందే రానున్న నైరుతి రుతుపవనాలు.. అరేబియా సముద్రంలో తుపాను ఏర్పడే అవకాశం

   13-05-2021


టెన్షన్ పెడుతున్న బ్లాక్ ఫంగస్

టెన్షన్ పెడుతున్న బ్లాక్ ఫంగస్

   13-05-2021


వ్యాక్సిన్ ఉత్పత్తికి స్థలాలిస్తాం... మోడీకి మమతా లేఖ

వ్యాక్సిన్ ఉత్పత్తికి స్థలాలిస్తాం... మోడీకి మమతా లేఖ

   13-05-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle