తొమ్మిదో రౌండ్ చర్చలు 120 శాతం విఫలం.. రైతుసంఘాల వ్యాఖ్య
16-01-202116-01-2021 09:48:43 IST
2021-01-16T04:18:43.408Z16-01-2021 2021-01-16T04:18:40.075Z - - 09-03-2021

నూతన వ్యవసాయ చట్టాల అమలుపై ఏర్పడిన ప్రతిష్టంభనను పరిష్కరించేందు కోసం కేంద్రప్రభుత్వానికి, రైతుసంఘాల నేతలకు మధ్య శుక్రవారం జరిగిన తొమ్మిదో రౌండు చర్చలు చప్పగా ముగిశాయి. తాము ముందే చెప్పినట్లగా తాజా చర్చలు కూడా నూటికి 120 శాతం విఫలమయ్యాయని రైతు సంఘాల నేతలు చెప్పారు. అత్యవసర సరుకుల చట్టాన్ని రద్దు చేయడానికి బదులుగా కనీసం దానికి చేసిన సవరణలనైనా తొలగించాలని మేము ప్రభుత్వానికి సూచించాము. కానీ కేంద్రవ్యవసాయ మంత్రి దీనిపై ఏమీ చెప్పలేకపోయారని చర్చల్లో పాల్గొన్న రైతు సంఘ నేత డాక్టర్ ధర్శన్ పాల్ పేర్కొన్నారు. కాగా తదుపరి దిశ చర్చలు జనవరి 19న జరుగనున్నాయి. సాగుచట్టాల అమలుపై ఏర్పడిన ప్రతిష్ఠంభనను తొలగించడానికి సుప్రీంకోర్టు నియమించిన కమిటీ ఆరోజు నుంచి ఇరుపక్షాలతో సంప్రదింపులు జరుపనుండటం తెలిసిందే. శుక్రవారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో కేంద్రప్రభుత్వానికి, రైతు సంఘాల నేతలకు మధ్య దాదాపు 9వ దఫా చర్చలు దాదాపు 5 గంటల పాటు జరిగాయి. అయితే కొత్త సాగు చట్టాల విషయంలో ఇరుపక్షాలు తమ వాదనలకే కట్టుబడి ఉండడంతో ప్రతిష్టంభన నెలకొంది. రైతులు లేవనెత్తిన కొన్ని డిమాండ్లను ప్రభుత్వం ఇప్పటికే అంగీకరించిందని, కాస్తయినా బెట్టు సడలించాలని తోమర్ రైతు సంఘాల నేతలను కోరారు. అయితే, కొత్త చట్టాలను రద్దు చేయాల్సిందేనని, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాల్సిందేనని నేతలు తేల్చిచెప్పారు. తమ డిమాండ్ల విషయంలో మార్పు లేదని కుండబద్ధలు కొట్టారు. దీంతో చర్చలు మరోసారి వాయిదా పడ్డాయి. 10వ రౌండ్ చర్చలు 19న మధ్యాహ్నం 12 గంటలకు జరుగనున్నాయి. కేంద్రం తరపున వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్, వాణిజ్య శాఖ సహాయ మంత్రి సోంప్రకాష్ సహా ఉన్నతాధికారులు 41 రైతు సంఘాల ప్రతినిధులతో చర్చించారు. తదుపరి చర్చల కంటే ముందే రైతులు సాగు చట్టాల విషయంలో తమ ప్రతిపాదనలతో ఒక ముసాయిదాను సమర్పిస్తే, వాటిపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని నరేంద్రసింగ్ తోమర్ తెలిపారు. 9వ రౌండ్ చర్చలు విఫలమైన అనంతరం కేంద్ర వ్యవసాయ మంత్రి మీడియాతో మాట్లాడారు. కొత్త సాగు చట్టాలపై రైతుల సందేహాలను నివృత్తి చేసేందుకు తాము రాతపూర్వక హామీ ఇచ్చామని వెల్లడించారు. కొత్త చట్టాల అమలు విషయంలో సుప్రీంకోర్టు ఉత్తర్వుకు కట్టుబడి ఉంటామని తోమర్ పేర్కొన్నారు. మధ్యవర్తిత్వం కోసం న్యాయస్థానం ఏర్పాటు చేసిన కమిటీ తమను పిలిచినప్పుడు వాదనలు వినిపిస్తామన్నారు. మరోవైపున మూడు వ్యవసాయ చట్టాల రద్దు, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత అనే తమ డిమాండ్లకు కట్టుబడి ఉన్నామని, అదే విషయాన్ని ప్రభుత్వానికి తెలియచేశామని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికైత్ చెప్పారు. అంతేగాక సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ ముందు హాజరుకాకూడదని తాము నిర్ణయించుకున్నామని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వంతో మాత్రమే మాట్లాడుతామని, డిమాండ్లపై చర్చిస్తామని ఉద్ఘాటించారు. వరుసగా తొమ్మిదో దశ చర్చలు కూడా విఫలం కాపడంతో జనవరి 26న తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీని కొనసాగిస్తామని రైతు సంఘాల నేతలు చెప్పారు. తమ పోరాటాన్ని తీవ్రతరం చేయడం మినహా మరొక మార్గం లేకుండా పోతోందని జనవరి 26 రిపబ్లిక్ దినోత్సవం నాడు దేశరాజధానిలో తలపెట్టిన బారీ ర్యాలీని తప్పకుండా జరిపి తీరుతామని రైతు సంఘ నేత డాక్టర్ దర్శన్ పాల్ ముమ్మూరు నొక్కి చెప్పారు. పైగా సుప్రీంకోర్టు నియమించిన బ్రోకర్లతో తాము చర్చలు జరపబోమని కేంద్ర ప్రభుత్వంతోనే చర్చిస్తామని రైతునేతలు భీష్మించుకుని కూర్చుంటున్నారు. కోర్టు నియమించిన కమిటీ సభ్యులు ఇప్పటికే సాగు చట్టాలకు అనుకూలంగా మాట్లాడి ఉన్నారు కనుక వారితో సంప్రదింపులు ఇక వృధా అని రైతు సంఘాలు తేల్చేశాయి. కేంద్రప్రభుత్వ నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా నవంబర్ 26 నుంచి ఢిల్లీ శివార్లలో వేలాదిమంది రైతులు గుమికూడి ధర్నాలు నిరసన ప్రదర్శలను చేస్తున్న విషయం తెలిసిందే. సాగుచట్టాలు రైతులకు కొత్త మార్కెట్లను కల్పిస్తాయని వారి ఆదాయం పెరుగుతుందని కేంద్రం చేస్తున్న వాదనను పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రైతు సంఘాలు ఏమాత్రం సమ్మతించకపోవడంతో ప్రభుత్వానికి , రైతు సంఘాలకు మధ్య జరుగుతున్న చర్చలు ప్రతిష్టంభనకు గురయ్యాయి.

వ్యాక్సిన్ పాలసీకి భారత్ కట్టుబడింది.. IMF చీప్ గీతా గోపీనాథ్ ప్రశంస
2 hours ago

ఇంతకూ ఆ 5 కోట్లు నాకెవరిచ్చారబ్బా... తాప్సీ బిగ్ జోక్
3 hours ago

అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని కూడా జరుపుకోవాలని కోరిన మహిళా ఎంపీ
18 hours ago

73 ఏళ్ల పెద్దాయనకు పెళ్లి మోజు.. కోటి 30 లక్షలతో అమ్మాయి జంప్
18 hours ago

కరోనా కేసుల అప్డేట్.. గత 24 గంటల్లో 18,599 మందికి కరోనా
08-03-2021

ప్రపంచానికి భారత్ ఇచ్చిన వరం వ్యాక్సిన్లు.. అమెరికా సైంటిస్టు ప్రశంసలు
08-03-2021

ఈ ఏడాదికి.. నారీ వారియర్ గా నామకరణం చేద్దాం
08-03-2021

దీదీపై మోదీ సెటైర్లు..!
07-03-2021

కరోనా కేసుల అప్డేట్.. గత 24 గంటల్లో 18,711 మందికి కరోనా..!
07-03-2021

కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేకపోయారు... ఐటీదాడులపై తాప్సీ
07-03-2021
ఇంకా