newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

74 శాతం కేసులు, ఆ 10 రాష్ట్రాల్లోనే..

26-04-202126-04-2021 16:47:19 IST
2021-04-26T11:17:19.598Z26-04-2021 2021-04-26T11:12:48.186Z - - 14-05-2021

74 శాతం కేసులు, ఆ 10 రాష్ట్రాల్లోనే..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశంలో కోవిడ్ మహమ్మారి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రాన్ని బెంబేలెత్తిస్తోంది. తాజాగా మూడు లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు, రోగుల ప్రాణాలు కాపాడేందుకు అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్రాలు శక్తి వంచన లేకుండా కృషి చేస్తూనే ఉన్నాయి. దేశమంతా కోవిడ్ వైరస్ ఉన్నప్పటికీ దాని తీవ్రత అన్ని రాష్ట్రాలలో ఒకే మాదిరిగా లేదు. ఇప్పటి వరకు వెలుగు చూసిన కొత్త కేసుల్లో 74.5 శాతం పది రాష్ట్రాలకే  పరిమితమై ఉన్నాయి.

గత 24 గంటల్లో రెండు లక్షల మందికి పైగా ఈ వ్యాధి నుంచి కోలుకున్నప్పటికీ కొత్త కేసుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఏయే రాష్ట్రాల్లో కోవిడ్ కేసుల పరిస్థితి ఎలా ఉంది? వాటి నివారణ, నిరోధం దిశగా ఆయా ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు ఎలా ఉన్నాయనే దానిపై లోతైన సమాచారమే అందుబాటులోకి వస్తోంది. కేవలం పది రాష్ట్రాల పరిధిలోనే 74 శాతానికి పైగా కోవిడ్ కొత్త కేసులు నమోదవుతున్న దృష్ట్యా అక్కడ ముమ్మర ప్రాతిపదికన వైద్యపరమైన అత్యవసర ఏర్పాట్లను కేంద్ర సహాయంతో ఆయా రాష్ట్రాలు చేపట్టాయి. రోజువారీగా మహారాష్ట్రలోనే కొత్త కేసులు ఎక్కువగా పెరుగుతున్నాయి. ఆ రాష్ట్రంలో తాజాగా 66 వేల కొత్త కేసులు వెలుగు చూస్తే, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో 35 వేలు, కర్ణాటకలో 35 వేలకు పైగా రోజూవారీగా కొత్త కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. 

కేంద్రం లాక్ డౌన్ ప్రకటిస్తుందా?.. పబ్లిక్ టాక్ అదే

అలాగే ఢిల్లీ, కేరళ, పశ్చిమ బెంగాల్ లలో కూడా వేల సంఖ్యలోనే కొత్త కేసులు వస్తున్నాయి. రాజస్థాన్, తమిళనాడు, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు చివరి నాలుగు స్థానాలలో ఉన్నాయి. కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ ప్రజల్లో ఎలాంటి భయాందోళనలు లేకుండా వారిలో సానుకూల భావాన్ని పెంపొందించే చర్యలను కూడా ఇటు ప్రభుత్వ పరంగానూ, ఇతరత్రానూ గట్టిగానే జరుగుతున్నాయి. కేవలం కేసులు పెరగడమే కాకుండా ఎంత మంది చికిత్స పొంది బయటపడుతున్నారనే సమాచారం కూడా క్రమంగా అందుబాటులోకి రావడం వల్ల ప్రజల్లో కొంత ఊరట కలుగుతోంది.   

ఆక్సిజన్ సరఫరాలను మెరుగుపరచడం తద్వారా ప్రాణనష్టాన్ని నివారించేందుకు కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు గట్టి చర్యలే చేపడుతున్నాయి. ముఖ్యంగా వైద్యపరమైన పరికరాలతో పాటు ముఖ్యమైన మందులను పెద్ద ఎత్తున ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు సన్నద్ధమవుతున్న ప్రభుత్వాలు మే 1వ తేదీ నుంచి మూడవ విడత టీకాల కార్యక్రమాన్ని యుద్ధప్రాతిపదికన చేపట్టేందుకు తద్వారా వైరస్ వ్యాప్తిని నిరోధించడంతో పాటు మరణాల రేటును గరిష్ట స్థాయిలో తగ్గించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయి. 10 రాష్ట్రాల పరిధిలోనే కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్నందున అవి వ్యాపించకుండా నిరోధించడంతో పాటు సత్వర చికిత్సల ద్వారా రోగులకు ఉపశమనం కలిగించేందుకు ప్రభుత్వాలు గట్టి ఏర్పాట్లనే చేశాయి.   

ఆగస్టు-డిసెంబరు మధ్య 200 కోట్ల కరోనా టీకాలు భారత్ లో ఉంటాయట..!

ఆగస్టు-డిసెంబరు మధ్య 200 కోట్ల కరోనా టీకాలు భారత్ లో ఉంటాయట..!

   2 hours ago


ఇక 12 - 16 వారాల ఎడం.. వ్యాక్సిన్ డోసుల మధ్య వ్యవధి పెంచిన కేంద్రం

ఇక 12 - 16 వారాల ఎడం.. వ్యాక్సిన్ డోసుల మధ్య వ్యవధి పెంచిన కేంద్రం

   2 hours ago


మేళాలు, సభల వల్లే  కోవిడ్ స్వైరవిహారం... ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాఖ్య

మేళాలు, సభల వల్లే కోవిడ్ స్వైరవిహారం... ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాఖ్య

   12 hours ago


కోవిడ్ కేకల మధ్య సెంట్రల్ విస్టా అవసరమా...? వెంటనే ఆపండి..?

కోవిడ్ కేకల మధ్య సెంట్రల్ విస్టా అవసరమా...? వెంటనే ఆపండి..?

   19 hours ago


మిగులు ఆక్సిజన్ ఉంది... ఎవరికైనా ఇవ్వండి  కేంద్రానికి ఢిల్లీ సర్కార్ లేఖ

మిగులు ఆక్సిజన్ ఉంది... ఎవరికైనా ఇవ్వండి కేంద్రానికి ఢిల్లీ సర్కార్ లేఖ

   20 hours ago


ముందే రానున్న నైరుతి రుతుపవనాలు.. అరేబియా సముద్రంలో తుపాను ఏర్పడే అవకాశం

ముందే రానున్న నైరుతి రుతుపవనాలు.. అరేబియా సముద్రంలో తుపాను ఏర్పడే అవకాశం

   18 hours ago


టెన్షన్ పెడుతున్న బ్లాక్ ఫంగస్

టెన్షన్ పెడుతున్న బ్లాక్ ఫంగస్

   a day ago


వ్యాక్సిన్ ఉత్పత్తికి స్థలాలిస్తాం... మోడీకి మమతా లేఖ

వ్యాక్సిన్ ఉత్పత్తికి స్థలాలిస్తాం... మోడీకి మమతా లేఖ

   13-05-2021


ఇంటింటి టీకాల్లో జాప్యం వద్దు ... ఇప్పటికే ఎందరి ప్రాణాలొ కోల్పోయాం: కేంద్రానికి  బొంబాయి హైకోర్టు  హితవు

ఇంటింటి టీకాల్లో జాప్యం వద్దు ... ఇప్పటికే ఎందరి ప్రాణాలొ కోల్పోయాం: కేంద్రానికి బొంబాయి హైకోర్టు హితవు

   12-05-2021


కరోనా కేసుల అప్డేట్స్.. కొత్త‌గా 3,48,421 మందికి కరోనా

కరోనా కేసుల అప్డేట్స్.. కొత్త‌గా 3,48,421 మందికి కరోనా

   12-05-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle