newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

అధికార్లకు తరచు సమన్లు ఇవ్వడం వేధింపులో భాగమే.. సుప్రీం

09-04-202109-04-2021 08:48:11 IST
Updated On 08-04-2021 18:02:51 ISTUpdated On 08-04-20212021-04-09T03:18:11.075Z08-04-2021 2021-04-08T12:32:10.076Z - 2021-04-08T12:32:51.490Z - 08-04-2021

అధికార్లకు తరచు సమన్లు ఇవ్వడం వేధింపులో భాగమే.. సుప్రీం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రభుత్వ ఉన్నతాధికారులను తరచుగా న్యాయస్థానం ముందు హాజరు కావాలంటూ సమన్లు జారీ చేయడం ఆ అధికారులను వేధించడం కిందికే వస్తుందని సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇలా కింది కోర్టులు, హైకోర్టులు ప్రతి విషయంలోనూ చీటికీమాటికీ ప్రభుత్వ అధికారులను కోర్టుకు హాజరు కావాలని ఆదేశించడం సరైంది కాదని సర్వోన్నత న్యాయస్థానం మందలించింది. 

విషయం ఏమిటంటే, ఉత్తర ప్రదేశ్‌లో ఒక ప్రభుత్వ ఉద్యోగికి ఇవ్వాల్సిఉన్న వేతన బకాయిలకు సంబంధించిన కేసులో ఇద్దరు ప్రభుత్వాధికారులను కోర్టుముందు హాజరు కావాలంటూ అలహాబాద్ హైకోర్టు సింగిల్ జడ్జి ఇటీవలే తీర్పు చెప్పారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అదే హైకోర్టు ఈ కేసులో అంతకుముందే స్టే విధించింది కూడా. 

ఇలా స్టే విధించిన తర్వాత  ఆ అధికారులపై కోర్టు ధిక్కార చర్యలకు పాల్పడ్డారని, వారిరువురూ న్యాయస్థానం ముందు హాజరుకావాలని మార్చి 2వ తేదీ అలహాబాద్ సింగిల్ జడ్జి ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ ఆదేశాలను సవాలు చేస్తూ సుప్రీంకోర్టు తలుపులు తట్టింది. 

ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వ పిటిషన్‌ను బుధవారం విచారించిన సుప్రీంకోర్టు ద్వి సభ్య బెంచ్ అలహాబాద్ హైకోర్టు సింగిల్ జడ్జి ఆదేశాలను కొట్టిపడేసింది. పైగా ఇప్పటికే స్టే విధించిన కేసులో ఉన్న అధికారులను తిరిగి హాజరు కావాలని ఆదేశించడంపై జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్, హేమంత్‌ గుప్తాలతో కూడిన సుప్రీంకోర్టు బెంచ్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.

న్యాయస్థానానికి అధికారం ఉంది కదా అని చెప్పి తరచూ ప్రభుత్వ అధికారులను కోర్టుకు రావాలని ఆదేశాలు జారీ చేయడం సమంజసం కాదని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. పైగా తమ అధికారాన్ని వినియోగించడంలో కాస్త భాధ్యతాయుతంగా వ్యవహరించాలని అలహాబాద్ హైకోర్టుకు సుప్రీం బెంచ్ హితవు పలికింది. 

తరచూ ఉన్నతాదికారులకు సమన్లు జారీ చేయడం అంటే అనవసరంగా వారిని వేధించడమేనని కూడా న్యాయముర్తులు అభిప్రాయపడ్డారు.

కోర్టు ధిక్కార చర్య ఆదేశంపై ఒకసారి స్టే విధించిన తర్వాత అధికారులను తిరిగి కోర్టుముందుకు రావాలని ఆదేశించడం ఏ న్యాయం ప్రకారం వీలవుతుంది అని సుప్రీంకోర్టు బెంచ్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. ఒకవేళ ఇలాంటి కేసును పునర్విచారించాలంటే కూడా మరొక జడ్జి ముందు పిటిషన్ దాఖలు చేయవచ్చని సుప్రీం కోర్టు పేర్కొంది.

రైతుల ఖాతాల్లోకి మరో 20 వేల కోట్లు... 8వ విడత కిసాన్ నిధులు విడుదల

రైతుల ఖాతాల్లోకి మరో 20 వేల కోట్లు... 8వ విడత కిసాన్ నిధులు విడుదల

   11 hours ago


నెలాఖరుకల్లా కోవిడ్ బలహీనం !

నెలాఖరుకల్లా కోవిడ్ బలహీనం !

   16 hours ago


ఆగస్టు-డిసెంబరు మధ్య 200 కోట్ల కరోనా టీకాలు భారత్ లో ఉంటాయట..!

ఆగస్టు-డిసెంబరు మధ్య 200 కోట్ల కరోనా టీకాలు భారత్ లో ఉంటాయట..!

   14-05-2021


ఇక 12 - 16 వారాల ఎడం.. వ్యాక్సిన్ డోసుల మధ్య వ్యవధి పెంచిన కేంద్రం

ఇక 12 - 16 వారాల ఎడం.. వ్యాక్సిన్ డోసుల మధ్య వ్యవధి పెంచిన కేంద్రం

   14-05-2021


మేళాలు, సభల వల్లే  కోవిడ్ స్వైరవిహారం... ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాఖ్య

మేళాలు, సభల వల్లే కోవిడ్ స్వైరవిహారం... ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాఖ్య

   13-05-2021


కోవిడ్ కేకల మధ్య సెంట్రల్ విస్టా అవసరమా...? వెంటనే ఆపండి..?

కోవిడ్ కేకల మధ్య సెంట్రల్ విస్టా అవసరమా...? వెంటనే ఆపండి..?

   13-05-2021


మిగులు ఆక్సిజన్ ఉంది... ఎవరికైనా ఇవ్వండి  కేంద్రానికి ఢిల్లీ సర్కార్ లేఖ

మిగులు ఆక్సిజన్ ఉంది... ఎవరికైనా ఇవ్వండి కేంద్రానికి ఢిల్లీ సర్కార్ లేఖ

   13-05-2021


ముందే రానున్న నైరుతి రుతుపవనాలు.. అరేబియా సముద్రంలో తుపాను ఏర్పడే అవకాశం

ముందే రానున్న నైరుతి రుతుపవనాలు.. అరేబియా సముద్రంలో తుపాను ఏర్పడే అవకాశం

   13-05-2021


టెన్షన్ పెడుతున్న బ్లాక్ ఫంగస్

టెన్షన్ పెడుతున్న బ్లాక్ ఫంగస్

   13-05-2021


వ్యాక్సిన్ ఉత్పత్తికి స్థలాలిస్తాం... మోడీకి మమతా లేఖ

వ్యాక్సిన్ ఉత్పత్తికి స్థలాలిస్తాం... మోడీకి మమతా లేఖ

   13-05-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle