newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

నక్సల్స్ దాడిలో మరణించిన తెలుగు జవాన్ల కుటుంబాలకు రూ.30 లక్షల చొప్పున ఆర్థికసాయం

06-04-202106-04-2021 09:23:06 IST
Updated On 06-04-2021 09:40:04 ISTUpdated On 06-04-20212021-04-06T03:53:06.716Z06-04-2021 2021-04-06T03:46:31.550Z - 2021-04-06T04:10:04.220Z - 06-04-2021

నక్సల్స్ దాడిలో మరణించిన తెలుగు జవాన్ల కుటుంబాలకు రూ.30 లక్షల చొప్పున ఆర్థికసాయం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

చత్తీస్ గఢ్ లో నక్సల్స్ దాడిలో మరణించిన తెలుగు జవాన్ల కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రూ.30 లక్షల చొప్పున ఆర్థికసాయం ప్రకటించారు. చత్తీస్ గఢ్ లోని సుక్మా-బీజాపూర్ అటవీప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో ఏపీకి చెందిన రౌతు జగదీశ్, శాఖమూరి మురళీకృష్ణ అనే సీఆర్పీఎఫ్ కోబ్రా కమాండోలు అమరులయ్యారు. వారి మృతి పట్ల సీఎం జగన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కష్టకాలంలో భగవంతుడు వారికి ధైర్యం ప్రసాదించాలని కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు.

జవాన్‌ మురళీకృష్ణ మృతదేహం గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చేరుకుంది. సత్తెనపల్లి పీఎస్‌లో మురళీకృష్ణ భౌతికకాయానికి పోలీసులు నివాళులర్పించారు. మురళీకృష్ణ మృతదేహం స్వగ్రామం గుడిపూడి చేరుకోనుంది. మురళీకృష్ణ అంత్యక్రియలకు పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన మావోయిస్టుల దాడిలో ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం గుడిపూడికి చెందిన సీఆర్‌పీఎఫ్‌ జవాన్‌ శాఖమూరి మురళీకృష్ణ అమరుడయ్యాడు. రవి, విజయ దంపతులకు ఇద్దరు కుమారులు.. వారిలో మురళీకృష్ణ 2010లో సీఆర్‌పీఎఫ్‌కు ఎంపికయ్యాడు. ఆయనకు పెళ్లి చేయాలని ఇంటి నిర్మాణం పూర్తిచేశారు. ఈ వేసవిలో పెళ్లి చేసేందుకు సంబంధాలు చూస్తున్నారు. 2 నెలల క్రితం ఇంటికి వచ్చిన మురళీకృష్ణ ఈసారి పెళ్లి చేసుకునేందుకు వస్తానని బంధువులు, స్నేహితులకు చెప్పాడట..! ఇప్పుడు ఆయన తిరిగిరాని లోకానికి వెళ్ళిపోయారు. 

రౌతు జగదీశ్‌(27) భౌతికకాయం విజయనగరం చేరుకుంది. మంగళవారం అధికార లాంఛనాలతో జగదీశ్‌ అంత్యక్రియలు నిర్వహించటానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. విజయనగరం పట్టణంలోని గాజులరేగ ఎగువవీధికి చెందిన రౌతు సింహాచలం, రమణమ్మ దంపతులకు కుమారుడు జగదీశ్‌కు మే 22న వివాహం నిర్ణయించారు. పెళ్లి పనులు చూసుకునేందుకు ఈ నెల 5న ఇంటికి వస్తానని జగదీశ్‌ రెండురోజల కిందటే తల్లిదండ్రులకు ఫోన్‌చేసి చెప్పారు. ఇంతలోనే ఇలా విషాదం చోటు చేసుకుందని బంధువులు, సన్నిహితులు, స్నేహితులు కన్నీరుమున్నీరవుతున్నారు. 

చత్తీస్ గఢ్ దండకారణ్యం ప్రాంతంలో శనివారం జరిగిన భారీ ఎన్ కౌంటర్ లో 22 మంది భద్రతా బలగాల సిబ్బంది అమరులయ్యారు. ఈ ఘటనపై మావోయిస్టులు ప్రకటన విడుదల చేశారు. తమ పోరాటం ప్రభుత్వంతోనే అని, జవాన్లు తమకు శత్రువులు కాదని స్పష్టం చేశారు. 4 నెలల వ్యవధిలో 28 మంది మావోయిస్టులను ఎన్ కౌంటర్ చేశారని.. ఎన్ కౌంటర్లకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలని మావోలు పేర్కొన్నారు.

మావోయిస్టుల్లోనూ 20 పైగా మృతులు.. లెక్క సరిచేశామంటున్న కేంద్ర బలగాలు


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle