భోగి పండుగ అంటే ఏమిటి?
13-01-202113-01-2021 07:10:49 IST
Updated On 13-01-2021 07:23:28 ISTUpdated On 13-01-20212021-01-13T01:40:49.299Z13-01-2021 2021-01-13T01:40:41.551Z - 2021-01-13T01:53:28.071Z - 13-01-2021

ప్రతి మాసంలో సంక్రాంతి ఉన్నప్పటికీ మకర సంక్రాంతికి ప్రత్యేక ప్రాధాన్యత ఉండటానికి శాస్త్రపరంగా అనేక కారణాలు ఉన్నాయి. మనకు రెండు ఆయనములు ఉన్నాయి. ఏడాదిలో ఆరు నెలలు ఉత్తరాయణం, మిగతా ఆరు నెలలు దక్షిణాయణం. ఏడాదిలో ఆర్నెల్ల ఉత్తరాయణం దేవతలకు ఒక పగలు. ఆర్నెల్ల దక్షిణాయణం దేవతలకు ఒక రాత్రి. దేవతలు మేలుకొని ఉండే కాలం ఉత్తరాయణ పుణ్యకాలం గనకే దక్షిణాయణం నుంచి ఉత్తరాయణం వైపు మారిన ఈ సంక్రాంతికి అత్యంత ప్రాధాన్యత. ఈ ఏడాది జనవరి 14వ తేదీ ఉదయం 8.15గంటలకు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు కాబట్టి ఆ రోజు మకర సంక్రాంతి. 13న భోగి, 15న కనుమ, 16న ముక్కనుమ. భోగి విశేషాలు.. సంక్రాంతికి ముందు రోజు వచ్చే పండుగ భోగి. భోగభాగ్యాలు ఇచ్చే పర్వదినం. ఈ రోజున ప్రతిఒక్కరూ తెల్లవారు జామునే లేచి తలస్నానమాచరించాలి. సూర్యోదయానికి ముందే భోగి మంటలను వెలిగించాలి లేదా దర్శించుకోవాలి. భోగి రోజున ఇంట్లో పాత సామాన్లు తీసేసి సంక్రాంతి రోజు కొత్త సామాన్లు తెచ్చుకొనే సంప్రదాయముంది. నూతన వస్తువులు కొత్తదనానికి, ఆనందానికి, అభ్యుదయానికి చిహ్నంగా ఈ పండుగను భావిస్తారు. భోగి రోజు నుంచి చలిని తొలగించడం, కొత్త వాటితో నిత్యనూతన జీవితం ప్రారంభించడానికి ఓ గుర్తుగా భోగి మంటలను వెలిగిస్తారు. భోగిమంటలను ఎలా దర్శించాలి? తెల్లవారు జామునే స్నానం చేసి కొత్త దుస్తులు ధరించి భోగి మంటల వద్దకు వెళ్లాలి. అగ్ని దేవుడిని, సూర్యభగవానుడిని తలచుకొని ప్రతిఒక్కరూ తమ ఇష్టదైవాన్ని, ఇలవేల్పుని మనసులో స్మరించుకొని మంటలను దర్శించుకోవాలి. భోగి రోజుకున్న మరో ప్రాముఖ్యత.. ఆ రోజు సాయంత్రం పిల్లకు భోగిపండ్లు పోస్తారు. ఆ రేగు పండ్లు సూర్యుడికి ప్రీతిపాత్రమైనవి. వీటిని సూర్యాస్త సమయంలో పిల్లల తల మీద నుంచి పోయడం వల్ల సూర్యభగవానుడి అనుగ్రహం కలిగి ఆరోగ్యం కలుగుతుందని, వారికి ఉన్న నరదృష్టి తొలగి, మంచి జరుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి.

ఢిల్లీలో 13 ఏళ్ల బాలుడికి హిజ్రాగా శస్త్రచికిత్స..
17 hours ago

తొలి వ్యాక్సిన్ పండగ.. మంత్రి ఈటెలకు నేడే
18 hours ago

ఆన్ లైనా.. ఆఫ్ లైనా.. ఏది బెటర్
15-01-2021

తెలంగాణ ప్రజలకు కంటి మీద కునుకే లేదు
15-01-2021

బర్డ్ ఫ్లూ.. తెలంగాణను కూడా చేరిందా..?
14-01-2021

పడిపోయిన ఉష్ణోగ్రతలు.. వణుకుతున్న ఉత్తరాది
14-01-2021

తెలంగాణలో తొలి కరోనా వ్యాక్సిన్ వేయించుకునేది అతడే..!
14-01-2021

ప్రాంక్ షో.. అశ్లీల ప్రశ్నలు ఆడవాళ్లను అడుగుతుండడంతో తాట తీస్తున్న పోలీసులు..!
13-01-2021

సిటీ ఖాళీ.. రోడ్లపై జాలీ
12-01-2021

భాగ్యనగరంలో మిడ్ నైట్ దోశ.. కేరాఫ్ అడ్రస్ రామ్ కీ బండి..!
12-01-2021
ఇంకా