newssting
Radio
BITING NEWS :
ఈరోజు ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం * కేంద్ర మంత్రివర్గంలో పునర్వ్యవస్థీకరణ గురించి పలు ఊహాగానాల మధ్య ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జె పి నడ్డాతో చర్చలు జరిపారు * బెంగాల్, తమిళనాడులలో ఇటీవల సాధించిన విజయాలతో పోల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ముంబైలో భోజనం కోసం మహారాష్ట్ర రాజకీయ నాయకుడు శరద్ పవార్‌తో సమావేశమయ్యారు * దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 84,332 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది * దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,93,59,155కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 4002 మంది మరణించారు * కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతలు అనేక ఇబ్బందులు పడుతున్నా సీఎం కేసీఆర్‌ పట్టించుకోవట్లేదని దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి తనయ వైఎస్‌ షర్మిల విమర్శించారు * రాష్ట్రంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం, పోలీసు శాఖ చేపడుతున్న చర్యలు అభినందనీయమని నోబెల్‌ బహుమతి గ్రహీత, బాలల హక్కుల ఉద్యమకారుడు కైలాష్‌ సత్యార్థి ప్రశంసించారు.

హైద‌రాబాద్ ను కాపాడుకోలేమా

13-05-202113-05-2021 10:17:29 IST
Updated On 13-05-2021 10:28:14 ISTUpdated On 13-05-20212021-05-13T04:47:29.221Z13-05-2021 2021-05-13T04:47:11.730Z - 2021-05-13T04:58:14.850Z - 13-05-2021

హైద‌రాబాద్ ను కాపాడుకోలేమా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అవునా. అదేం మాట‌. అంత మాట అంటారా అనిపిస్తుంది. కానీ.. ఈ జ‌నాల ఎవ్వారం చూస్తే అలాగే ఉంది. హైద‌రాబాద్ అంటే మామూలు ఎవ్వార‌మా చెప్పండి. అన్నీటికీ అడ్డాగా ఉంది. అలాగే క‌రోనాకి కూడా. లాక్ డౌన్ పెట్టాక హైద‌రాబాద్ అంతా గ‌ప్ చుప్ అవుతుంది అనుకున్నారు. కానీ.. ఈ జనాల ఎవ్వారం చూస్తుంటే అంత‌కు మించి ఎక్కువ స్ప్రెడ్ చేసేలా క‌నిపిస్తున్నారు. 

350 చెక్ పోస్టులు. 20 వేల మంది పోలీసులు. అడుగ‌డుగునా.. ప‌హారాలు. ఇదంతా లాక్ డౌన్ స్టార్ట్ అయిన త‌ర్వాత ఎవ్వారం. అంత‌కు ముందు నాలుగు గంట‌ల స‌డ‌లింపు ఉంది క‌దా. ఆ టైంలో మాత్రం.. ఎవ్వ‌రినీ ఆప‌లేక పోతున్నార‌ట పోలీసులు. ఆపే రూల్ కూడా లేదు. జ‌నాలు కూడా చాలా నిర్భ‌యంగా తిరుగుతున్నారు. నిర్భ‌యంగానే కాదు.. వామ్మో. ఇంకా తిర‌గాలి ఇంకా తిర‌గాలి అనే ఆతుర‌త‌తో తిరుగుతున్నార‌ట‌. 

వ‌ద్దురా అయ్యా.. వ‌ద్దాక్కా.. వ‌ద్దు చెల్లే.. వ‌ద్దు అమ్మా.. అలా తిర‌గ‌కండి అంటే వింటున్నారా. 10 గంట‌ల త‌ర్వాత ఏదో జ‌ర‌గ‌బోతున్న‌ట్లు.. మ‌ళ్లీ బ‌య‌టికి రాక‌పోతే ఏదో కొంప‌లు అంటుకుపోతున్నట్లు.. ఈ టైం గ్యాప్ లో ముందు రోజుల్లో కంటే ఎక్కువ తిరుగుతున్నారు. ఇక ఎక్క‌డ చూసినా గుంపులు గుంపులే. రోజంతా సిటీ మొత్తం ఉండే గుంపులు.. పొద్దు పొద్దున్నే క‌నిపిస్తున్నారు. సోష‌ల్ డిస్టెన్సింగులు లేవు.. శానిటైజ‌ర్లు లేవు.. మాస్కులు అస్స‌లే లేవు. గిర్ర గిర్ర చుట్టేయాల్సిందే. ఇలా ఉంటే.. 350 చెక్ పోస్టులు పెట్టి ఏం ఉప‌యోగం.. 20 వేల మంది పోలీసులు డ్యూటీ చేసి ఏం ఉప‌యోగం... ప‌ది రోజుల లాక్ డౌన్ అన్నారు క‌దా.

ప‌ది రోజుల త‌ర్వాత .. ఈ లాక్ డౌన్ ఎఫెక్ట్ తో గుంపులు గుంపులుగా గుమిగూడిన జ‌నం కేసులు.. ప‌ది రోజుల లాక్ డౌన్ కంప్లీట్ అయ్యేలోగా పెర‌గ‌డం ఖాయం. వీళ్లంద‌రికీ అప్పుడు క‌రోనా బ‌య‌ట ప‌డితే.. ఆ లాక్ డౌన్ ని ఇంకాస్త కంటిన్యూ చేయాల్సిన అవ‌స‌రం ఖాయం. ఇప్పుడు కాదు.. ఈ లాక్ డౌన్ ఎఫెక్ట్ తో వ‌చ్చే కేసుల సంఖ్య చూస్తే.. గుండె ప‌గిలి నీర‌సం రావ‌డం ఖాయం అంటున్నారు నిపుణులు.

తెలంగాణలో లాక్ డౌన్.. ఎప్పటి వరకూ షాపులు తెరచి ఉంటారంటే..!

జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆదిపై హైదరాబాద్ లో పిర్యాదు

జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆదిపై హైదరాబాద్ లో పిర్యాదు

   an hour ago


చేపలు పట్టేటప్పుడు ఓ మహిళపై మొసలి దాడి.. సగం తిన్న మొసలి

చేపలు పట్టేటప్పుడు ఓ మహిళపై మొసలి దాడి.. సగం తిన్న మొసలి

   20 hours ago


థర్డ్ వేవ్ తో పిల్లలకి ప్రమాదం లేదు..

థర్డ్ వేవ్ తో పిల్లలకి ప్రమాదం లేదు..

   13-06-2021


కరోనా వైరస్ గబ్బిలాల నుంచే వచ్చింది: డాక్టర్ రాకేశ్ మిశ్రా

కరోనా వైరస్ గబ్బిలాల నుంచే వచ్చింది: డాక్టర్ రాకేశ్ మిశ్రా

   12-06-2021


పాన్ కార్డు కి ఆధార్ కార్డు లింక్ లేకపోతే జరిమానా

పాన్ కార్డు కి ఆధార్ కార్డు లింక్ లేకపోతే జరిమానా

   12-06-2021


ఈ రెండురోజులు అలర్ట్ గా ఉండాలి..

ఈ రెండురోజులు అలర్ట్ గా ఉండాలి..

   11-06-2021


అమ్మాయిలకు ఫోన్లు ఇవ్వడం వల్లే అత్యాచారాలు పెరుగుతున్నాయి

అమ్మాయిలకు ఫోన్లు ఇవ్వడం వల్లే అత్యాచారాలు పెరుగుతున్నాయి

   10-06-2021


ఇండియన్ ఆర్మీ రిక్రూట్మెంట్ 2021 ర్యాలీ: టెన్త్ అర్హతతో

ఇండియన్ ఆర్మీ రిక్రూట్మెంట్ 2021 ర్యాలీ: టెన్త్ అర్హతతో

   10-06-2021


గోక్షుర ఆయుర్వేద ప్రయోజనాలు.. వాటిలో శృంగార వాంఛ కూడా ఒకటి

గోక్షుర ఆయుర్వేద ప్రయోజనాలు.. వాటిలో శృంగార వాంఛ కూడా ఒకటి

   10-06-2021


రు. 150 కోట్ల మొబైల్ యాప్ మోసం.. 11 మంది అరెస్ట్

రు. 150 కోట్ల మొబైల్ యాప్ మోసం.. 11 మంది అరెస్ట్

   10-06-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle