newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

విశాఖ జిల్లాలో దారుణ ఘటనలు..!

15-04-202115-04-2021 14:38:10 IST
Updated On 15-04-2021 14:21:29 ISTUpdated On 15-04-20212021-04-15T09:08:10.955Z15-04-2021 2021-04-15T08:27:03.236Z - 2021-04-15T08:51:29.712Z - 15-04-2021

విశాఖ జిల్లాలో దారుణ ఘటనలు..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
విశాఖ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ గుర్తు తెలియని వ్యక్తి, ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిని దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన పెందుర్తి మండలం జుత్తాడలో ఈ తెల్లవారుజామున చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ ప్రారంభించారు. ఇంట్లో నిద్రపోతున్న వారిపై ఓ వ్యక్తి పదునైన ఆయుధంతో దాడి చేసి, ఒక్కొక్కరినీ హతమార్చినట్టుగా తెలుస్తోంది.

పెందుర్తి మండలం జుత్తాడలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. మృతుల్లో ఇద్దరు చంటి పిల్లలు కూడా ఉన్నారు. పాతకక్షల నేపథ్యంలో బత్తిన అప్పలరాజు అనే వ్యక్తి ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. నిందితుడు అప్పలరాజు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మృతులను రమణ(63), ఉషారాణి(35), రమాదేవి (53).. అరుణ(37), ఉదయ్‌(2), ఇషిత(ఆరు నెలలు)గా గుర్తించారు. ఇక నగర పోలీస్‌ పోలీస్‌ కమిషనర్‌ మనీష్‌కుమార్‌ సిన్హాతో పాటు పెందుర్తి ఎమ్మెల్యే అదీప్‌ రాజు సైతం ఘటనాస్థలానికి వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. 

తాజాగా అందిన సమాచారం ప్రకారం ఆరుగురిని దారుణంగా హ‌త మార్చిన త‌రువాత నిందితుడు అప్ప‌లరాజు నేరుగా పెందుర్తి పోలీస్ స్టేష‌న్‌కు వెళ్లి లొంగిపోయిన‌ట్లు తెలుస్తోంది. కేసు న‌మోదు చేసిన పెందుర్తి పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు లొంగిపోయిన విష‌యాన్ని పోలీసులు దృవీక‌రించ‌లేదు. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దారుణ హ‌త్య‌కు గురికావ‌డంతో ఆ గ్రామం ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డింది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సమగ్ర దర్యాప్తు జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 

విశాఖ‌ప‌ట్నంలోని మ‌ధుర‌వాడ‌లో ఓ ఎన్ఆర్ఐ కుటుంబం అనుమానాస్ప‌ద స్థితిలో మృతి చెందింది. మధురవాడలోని ఆదిత్య ఫార్చున్ టవర్‌లోని ఫ్లాట్ నెంబర్ 505లో అగ్నిప్ర‌మాదం జ‌రిగింది. పెద్ద ఎత్తున మంట‌లు చెల‌రేగ‌డంతో పాటు పొగ‌ వెలువ‌డ‌డంతో స్థానికులు భ‌యాందోళ‌న‌కు గురైయ్యారు. వెంట‌నే అగ్నిమాప‌క సిబ్బందితో పాటు పోలీసుల‌కు స‌మాచారం అందించారు.

అయితే.. వారు అక్క‌డ‌కు చేరుకునే లోపే ఇంట్లోని న‌లుగురు వ్య‌క్తులు సజీవ‌ద‌హ‌న‌మ‌య్యారు. మృతుల‌ను బంగారునాయుడు (50), డాక్టర్ నిర్మల (44), దీపక్ (22), కశ్యప్‌ (19)గా పోలీసులు గుర్తించారు. విజయనగరం జిల్లా గుంట్యాడకు చెందిన బంగారు నాయుడు కుటుంబం బెహ‌రాన్‌లో స్థిర‌ప‌డింది. నాలుగేళ్ల క్రితం విశాఖ జిల్లాకు వ‌చ్చారు. 8 నెల‌ల క్రిత‌మే ఆదిత్య ట‌వ‌ర్స్‌లోని ప్లాట్‌లో అద్దెకు దిగారు. ఇంట్లోని ఏసీ, సామాగ్రి పూర్తిగా ద‌గ్థ‌మై ఉన్నాయి. మృత‌దేహాలు పూర్తిగా కాలిపోయి గుర్తు ప‌ట్ట‌డానికి వీల్లేకుండా ఉన్నాయి. 


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle