newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

క్యాపిటల్ హిల్ భవనం.. మరోసారి హై టెన్షన్..!

03-04-202103-04-2021 22:46:43 IST
Updated On 03-04-2021 15:17:18 ISTUpdated On 03-04-20212021-04-03T17:16:43.728Z03-04-2021 2021-04-03T08:56:15.867Z - 2021-04-03T09:47:18.978Z - 03-04-2021

క్యాపిటల్ హిల్ భవనం.. మరోసారి హై టెన్షన్..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అమెరికాలో కొద్దినెలల కిందట క్యాపిటల్ హిల్ భవనం వద్ద ట్రంప్ మద్దతుదారులు సృష్టించిన విధ్వంసం గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుకుంది. అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ రెచ్చగొట్టడం వలనే అమెరికా చట్టసభపై జనవరి 6న..ఆయన మద్దతుదారులు దాడి చేశారన్నారు. తాజాగా ఓ దుండగుడు కారుతో క్యాపిటల్ హిల్ కాంప్లెక్స్ లోకి బారికేడ్లను ఢీకొడుతూ దూసుకొచ్చాడు. ఈ ఘటనలో ఓ పోలీస్ అధికారి మరణించారు. మరొకరు గాయపడ్డారు. చనిపోయిన అధికారిని విలియం బిల్లీ ఈవాన్స్ గా అమెరికా క్యాపిటల్ పోలీసులు గుర్తించారు.

కారుతో దూసుకొచ్చిన వ్యక్తిని పోలీసులు కాల్చి చంపారు. కారుతో ఢీకొట్టిన అనంతరం నిందితుడు కారులో నుంచి దిగి పోలీసు అధికారులపై కత్తితో దాడి చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో అతడిని పోలీసులు కాల్చేశారు. గాయపడిన అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు. దాడికి పాల్పడిన వ్యక్తిని నోవా గ్రీన్ (25)గా గుర్తించారు. ‘నేషన్ ఆఫ్ ఇస్లామ్’కు అతడు పెద్ద ఫాలోవర్ అని, అయితే, క్యాపిటల్ హిల్ పై జరిగిన దాడి మాత్రం ఉగ్రవాద దాడి కాదని పోలీసులు చెప్పారు. అతడికి ఉద్యోగం లేదని, అనారోగ్యంతో బాధపడుతున్నాడని అంటున్నారు. 

ఘనటపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ విచారం వ్యక్తం చేశారు. అమెరికా క్యాపిటల్ భవనం దగ్గర జరిగిన దాడి తెలిసి గుండె పగిలినంత పనైందని బైడెన్ అన్నారు. ఘటనలో చనిపోయిన పోలీస్ అధికారి ఈవాన్స్ కుటుంబానికి సానుభూతి తెలిపారు. దారుణ హింసాత్మక దాడిలో ధీశాలి అయిన విలియమ్ ఈవాన్స్ ను పోగొట్టుకోవడం విచారకరమని కమలా హ్యారిస్ అన్నారు. క్యాపిటల్ ను రక్షించేందుకు ఈవాన్స్ తన ప్రాణాన్ని త్యాగం చేశారన్నారు. దాడిపై క్యాపిటల్ పోలీస్, నేషనల్ గార్డ్ ఇమీడియట్ రెస్పాన్స్ ఫోర్స్ చాలా వేగంగా స్పందించాయని తెలిపారు. 

శుక్రవారం మధ్యాహ్నం అధ్యక్ష భవనానికి సమీపంలో ఓ చెక్‌పోస్టు వద్ద పోలీసులు తనిఖీ చేస్తుండగా ఉన్నట్లుండి ఓ కారు ఇద్దరు పోలీసులపైకి దూసుకువెళ్లింది. ఆ కారు నుంచి దిగిన వ్యక్తి పోలీసు అధికారుల మీద కత్తితో దాడికి ప్రయత్నించాడు. వెంటనే అప్రమత్తమైన అనుమానితుడిపై కాల్పులు జరిపారు. మధ్యాహ్నం సరిగ్గా ఒంటి గంటకు క్యాపిటల్‌ బిల్డింగ్‌లో ఉన్న కాంగ్రెస్‌ ప్రతినిధులకు ఒక మెయిల్‌ వచ్చింది. దాడి జరిగే ప్రమాదం ఉందని, కిటికీలు, తలుపులకు దూరంగా వెళ్లాలని, ఒకవేళ ఎవరైనా బయట ఉంటే తమ మీద దాడి జరగకుండా జాగ్రత్తపడాలన్నది అందులోని సారాంశం. సరిగ్గా అదే సమయంలో బ్లూ సెడాన్‌ కారులో వచ్చిన ఓ వ్యక్తి బారికేడ్ల దగ్గర నిలబడి ఉన్న ఇద్దరు పోలీసు సిబ్బంది మీదికి కారును పోనిచ్చాడు. కారు దిగి కత్తితో పోలీసుల మీద దాడి చేసే ప్రయత్నం చేశాడు. దీంతో పోలీసులు నిందితుడిని షూట్ చేయాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. కాల్పుల నేపథ్యంలో ఆ ప్రాంతం మొత్తాన్నీ భద్రతా సిబ్బంది దిగ్బంధం చేశారు. 


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle