newssting
Radio
BITING NEWS :
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు. 200 పాయింట్లకు పైగా నష్టపోయి 14,883 వద్ద ట్రేడ్ అవుతున్న నిఫ్టీ. * కరోనా విజృంభణ నేపథ్యంలో మహారాష్ట్ర - ఛత్తీస్ ఘడ్ సరిహద్దులో హై అలర్ట్. తెలంగాణ సరిహద్దుల్లో కరోనా నియంత్రణకు కఠిన నిబంధనలు అమలు. ములుగు జిల్లాకు వచ్చే వలస కూలీల విషయంలో అప్రమత్తమైన అధికారులు. పని ప్రదేశాల్లో మాస్క్ లేని కూలీలకు నో ఎంట్రీ. * ఎస్వీబీసీ ట్రస్ట్ కు భారీ విరాళం. రూ.9 కోట్ల విరాళం ఇచ్చిన పోస్కో గ్రూప్ అధినేత సంజయ్ పస్సి. టీటీడీ అడిషనల్ ఈఓ ధర్మారెడ్డికి డీడీ అందజేత. * జూబ్లీహిల్స్ లో ట్రాఫిక్ పోలీసులపై యువకుడి దాడి. అధిక శబ్దం చేస్తూ వెళ్తున్న బైక్ ను అడ్డుకున్న పోలీసులు. బైక్ ను ఆపినందుకు స్నేహితులతో కలిసి ట్రాఫిక్ సీఐ ముత్తు, సిబ్బందిపై దాడి. నిందితుడు దర్వేజ్ సహా ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. * మాదాపూర్ కు చెందిన వ్యాపారిని కిడ్నాప్. చెన్నైకి చెందిన ఆర్టిస్టులు అమర్నాథ్ ను కిడ్నాప్ చేసినట్లు సమాచారం. కిడ్నాప్ అనంతరం అమర్నాథ్ భార్యకు ఫోన్ చేసి రూ.4 లక్షలు డిమాండ్ చేసిన కిడ్నాపర్లు. అనంతరం 80 ఫోన్ కాల్స్ చేసిన గ్యాంగ్. చెన్నైకి చెందిన ఆర్టిస్టులు అరెస్ట్. * ఏపీలో రేపట్నుంచి ఎస్ఈసీ నిమ్మగడ్డ పర్యటన. మున్సిపల్ ఎన్నికలపై సమీక్ష నిర్వహించనున్న నిమ్మగడ్డ.

స్వాతంత్య్రం తర్వాత ఉరి తీయబోయే మహిళ ఆమేనా..?

18-02-202118-02-2021 12:42:57 IST
Updated On 18-02-2021 16:14:31 ISTUpdated On 18-02-20212021-02-18T07:12:57.077Z18-02-2021 2021-02-18T07:12:49.765Z - 2021-02-18T10:44:31.595Z - 18-02-2021

స్వాతంత్య్రం తర్వాత ఉరి తీయబోయే మహిళ ఆమేనా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఉరి శిక్ష అన్నది.. ఎంతో దారుణమైన నేరానికి పాల్పడితే కానీ వేయరు..! ఎంతో క్రూరమైన వ్యక్తులకు ఉరి శిక్ష విధిస్తూ ఉంటారు. ఇక మహిళలకు ఉరి శిక్ష విధించడం అన్నది చాలా అరుదు.. మన దేశంలో స్వాతంత్య్రం తర్వాత ఒక్క మహిళకు కూడా ఉరి శిక్ష విధించలేదు. కానీ ఓ మహిళను ఉరి తీసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇంతకూ ఆమె చేసిన నేరం ఏమిటో తెలుసా..? ప్రియుడితో కలిసి ఏడుగురు కుటుంబ సభ్యులను చంపేసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. యూపీకి చెందిన మహిళ షబ్నమ్ ప్రియుడితో కలిసి ఏడుగురు కుటుంబ సభ్యులను మట్టుబెట్టింది. దీంతో ఉరిశిక్ష అమలుకు మథుర జైలు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నిర్భయ కేసు దోషులను ఉరి తీసిన పవన్ జల్లాద్ ఆమెనూ ఉరితీయనున్నాడు. ఉరి తేదీని ఖరారు చేయాల్సి ఉంది.

అమ్రోహా ప్రాంతానికి చెందిన షబ్నమ్ ఇంగ్లిష్‌లో ఎంఏ చేసింది. ఐదో తరగతి కూడా పాస్ కాని సలీంను ప్రేమించి పెళ్లాడాలనుకుంది. వీరి పెళ్ళికి ఆమె కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. ఈ ఘటనను ఏ మాత్రం జీర్ణించుకోలేకపోయిన షబ్నమ్ ప్రియుడు సలీంతో కలిసి 2008లో తన కుటుంబంలోని ఏడుగురిని గొడ్డలితో నరికి చంపింది. ఇందులో ఆమె తల్లిదండ్రులతోపాటు సోదరులు, ఓ సోదరి కూడా వున్నారు. షబ్నమ్‌, సలీంలను దోషులుగా తేల్చిన స్థానిక కోర్టు వారికి ఉరిశిక్ష విధించింది.

దీంతో వారు హైకోర్టు, సుప్రీంకోర్టులను ఆశ్రయించగా, అక్కడా వారికి ఎదురుదెబ్బే తగిలింది. చివరి ప్రయత్నంగా రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకున్నారు. అక్కడ కూడా వారికి ఊరట లభించలేదు. షబ్నమ్‌ను ఉరితీయనున్న పవన్ జల్లాద్ ఇప్పటికే రెండుసార్లు ఉరితీసే గదిని పరిశీలించారు. షబ్నమ్ ఉరి శిక్ష కనుక అమలైతే స్వతంత్ర భారతదేశంలో మహిళను ఉరి తీయడం ఇదే తొలిసారి అవుతుంది. ఐదుగురు చిన్నారులను హత్య చేసిన కేసులో దోషులుగా తేలిన మహారాష్ట్రకు చెందిన అక్కాచెల్లెళ్లు సీమా గవిట్, రేణు షిండేలకు కూడా న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. ప్రస్తుతం యరవాడ జైలులో ఉన్న వారికి ఇంకా శిక్ష అమలు కాలేదు. వారి కంటే ముందే షబ్నమ్ ను ఉరి తీసే అవకాశం ఉంది. 

గుండెపోటుతో ఇరాన్ మహిళా ఖైదీ మృతి.. అయినా మళ్లీ ఉరితీశారు.

గుండెపోటుతో ఇరాన్ మహిళా ఖైదీ మృతి.. అయినా మళ్లీ ఉరితీశారు.

   25-02-2021


అమ్మాయి ఆత్మ‌హ‌త్య చేసుకుంది.. అయినా జ‌నం ఏంటి ఇలా

అమ్మాయి ఆత్మ‌హ‌త్య చేసుకుంది.. అయినా జ‌నం ఏంటి ఇలా

   25-02-2021


Ghatkesar: కిడ్నాప్ నాటకమాడిన ఘట్‌కేసర్‌ బీ ఫార్మ‌సీ విద్యార్థిని ఆత్మహత్య

Ghatkesar: కిడ్నాప్ నాటకమాడిన ఘట్‌కేసర్‌ బీ ఫార్మ‌సీ విద్యార్థిని ఆత్మహత్య

   24-02-2021


రోడ్డు ప్రమాదంలో యువతి మృతి.. కేసులో స్కూటీ యజమాని అరెస్ట్

రోడ్డు ప్రమాదంలో యువతి మృతి.. కేసులో స్కూటీ యజమాని అరెస్ట్

   23-02-2021


మూడేళ్ల త‌ర్వాత వ‌చ్చిన భ‌ర్త‌.. భార్య‌కి ఐదునెల‌ల గ‌ర్భం

మూడేళ్ల త‌ర్వాత వ‌చ్చిన భ‌ర్త‌.. భార్య‌కి ఐదునెల‌ల గ‌ర్భం

   23-02-2021


ప్ర‌తి పిల్లా చెల్లాయే అనే అనుమానంతో.. డేటింగ్ కి దూరం

ప్ర‌తి పిల్లా చెల్లాయే అనే అనుమానంతో.. డేటింగ్ కి దూరం

   23-02-2021


కరోనా సెకండ్ వేవ్ టెన్షన్.. అలర్ట్ అయిన తెలంగాణ

కరోనా సెకండ్ వేవ్ టెన్షన్.. అలర్ట్ అయిన తెలంగాణ

   22-02-2021


గన్నవరంలో విద్యుత్ స్తంభాన్ని ఢీ కొన్న విమానం..

గన్నవరంలో విద్యుత్ స్తంభాన్ని ఢీ కొన్న విమానం..

   20-02-2021


ట్రాన్స్ జెండ‌ర్ల‌తో ప్రాబ్ల‌మా.. ఈ నెంబ‌ర్ కి కాల్ కొట్టండి- సీపీ స‌జ్జ‌నార్

ట్రాన్స్ జెండ‌ర్ల‌తో ప్రాబ్ల‌మా.. ఈ నెంబ‌ర్ కి కాల్ కొట్టండి- సీపీ స‌జ్జ‌నార్

   20-02-2021


ఒక్క ఏడాదిలో అంతమంది హైదరాబాద్ లో ప్రాణాలు కోల్పోయారా

ఒక్క ఏడాదిలో అంతమంది హైదరాబాద్ లో ప్రాణాలు కోల్పోయారా

   19-02-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle