newssting
Radio
BITING NEWS :
అమెరికాలోని కుంబా ప్రాంతంలో తుపాకులతో దాడులు. పాఠశాలపై దాడులకు పాల్పడిన దుండగులు. 8 మంది చిన్నారులు దుర్మరణం. ఇంతవరకూ దాడికి గల కారణాలపై నో క్లారిటీ. వేర్పాటువాదుల పనైఉంటుందని అనుమానిస్తున్న పోలీసులు. * ఇంద్రకీలాద్రిపై ఘనంగా దసరా ఉత్సవాలు. ఆఖరిరోజు శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకరణలో దర్శనమిస్తున్న దుర్గమ్మవారు. అమ్మవారి దర్శనం కోసం బారులు తీరిన భక్తులు. * దుర్గమ్మను దర్శించుకున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. దసరా సందర్భంగా విజయవాడలో బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించిన కిషన్ రెడ్డి. రాష్ట్రంలో బీజేపీ బలపడుతుందన్న కేంద్ర మంత్రి. * రానున్న 4 రోజుల్లో ఏపీకి భారీ వర్షాలు. * సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయం వద్ద పేలుడు. ఆలయం సమీపంలోని చెత్తకుప్పలో పేలిన పెయింట్ డబ్బా, వ్యక్తికి గాయాలు. * వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం బుద్దారం గ్రామంలో విషాదం. భారీ వర్షాలకు నానిపోయిన ఇంటి పై కప్పు కూలి ఐదుగురు దుర్మరణం, ఇద్దరికి తీవ్రగాయాలు. * తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్.

వామ్మో ! రెండేళ్ల వయస్సులో అస్థిపంజరంతో స్నేహం !

29-09-202029-09-2020 18:12:06 IST
2020-09-29T12:42:06.156Z29-09-2020 2020-09-29T12:42:02.793Z - - 25-10-2020

వామ్మో ! రెండేళ్ల వయస్సులో అస్థిపంజరంతో స్నేహం !
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

మన జీవితంలో ఉండాల్సిన బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరో స్కూల్ డేస్ లోనే ఎంచుకుంటాం. బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం, ఒకరి ఇష్టాఇష్టాలను గౌరవించడం ఇలా ఉంటాయి. మరీ చిన్న పిల్లలకైతే కాస్త ఊహ తెలిసేంత వరకూ బొమ్మలే బెస్ట్ ఫ్రెండ్స్. పొద్దున లేచిన దగ్గర్నుంచి, పడుకునేంతవరకూ బొమ్మలతో ఆడుకుంటూనే కాలం గడిపేస్తుంటారు. బొమ్మలంటే కారు, ట్రైన్, టెడ్డీబేర్, రాకెట్లు, బార్బీ డాల్ ఇలా అనేకం ఉంటాయి. కానీ ఒక పిల్లాడు మాత్రం భయంకరమైన బొమ్మతో ఆడుకుంటున్నాడు. అంతటితో ఆగకుండా అదే తన బెస్ట్ ఫ్రెండ్ గా అనుకుని ఎక్కడికెళ్లినా దానితోనే ఉంటున్నాడు. 

ఎంత పెద్దవాళ్లకైనా ఒక్క క్షణం అస్థిపంజరాన్ని చూస్తే వెన్నులో వణుకు పుట్టక మానదు. అలాంటిది ఈ పిల్లాడు ఏకంగా తినేటపుడు, పడుకునేటపుడు కూడా దానిని పక్కనపెట్టుకుని ఉండటం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. ఈ కథనాన్ని అమెరికాకు చెందిన మీడియా ప్రచురించింది. అమెరికాలోని ఉటా రాష్ట్రానికి చెందిన థియో అనే బాలుడి వయస్సు రెండేళ్లు. వాడికి అస్థిపంజరమంటే ప్రాణం. అదిలేకపోతే భోజనం కూడా చేయడట. 

భోజనం, షాపింగ్, నిద్ర, టీవీ.. ఆట ఇలా సందర్భమేదైనా అస్థిపంజరమే థియోకి మంచి కంపెనీ. 24 గంటలూ ఆ ఎముకల గూడుని వెంటేసుకుని తిరుగుతాడు. అదిగానీ కనిపించలేదా.. ఇక ఆరోజు ఇల్లంతా గందరగోళమే. అస్థిపంజరం కోసం చేసే హడావిడి అంతా ఇంతా కాదనుకోండి. అయితే థియో ఆడుకునే ఆ అస్థిపంజరం నిజమైనది కాదు. బొమ్మ మాత్రమే. కానీ దానిని థియో తల్లిదండ్రులు కొనివ్వలేదు. అక్కడ వరదలొచ్చిన సమయంలో సామాన్లంటినీ పైకి తీసుకొస్తున్న సమయంలో ఆ బుడతడికి ఆ బొమ్మ కనిపించింది. అప్పటి నుంచే దానిని వదలడం లేదు. ఐదడుగుల ఎత్తుండే అస్థి పంజరంతో థియో సెప్టెంబర్ 15వ తేదీ నుంచి స్నేహం చేయడం మొదలుపెట్టాడు. 

అంతటితో ఆపలేదు ఈ చిచ్చర పిడుగు. ఇటీవల షాపింగ్ కు వెళ్లిన థియో కుక్కల అస్థిపంజరాన్ని కొనుక్కున్నాడు. ఒక వైపు మనిషి ఎముకల గూడు, మరోవైపు కుక్క ఎములగూడును పెట్టుకుని వాడు ఆటే ఆటలు అన్నీ ఇన్నీ కావనుకోండి. అలా థియో అస్థిపంజరాలతో ఆడుకుంటున్న వీడియోలను వాడి తల్లి నెట్టింట్లో పోస్ట్ చేయగా.. అది కాస్తా మీడియా దృష్టికి వచ్చింది. ఈ వీడియోలను చూసిన మానసిక నిపుణులు కూడా నిజానికి పిల్లలకు శవాలు, అస్థిపంజరాలంటే భయం ఉండదని, మనమే వారిని దెయ్యం, బూచోడు అని భయపెడుతుంటామని చెప్తున్నారు. కాగా.. నెటిజన్లు మాత్రం వీడు ఈ వయస్సులోనే అస్థిపంజరాలతో ఆడుకుంటుంటే.. పెద్దయ్యాక వేటితో ఆడుకుంటాడో అని కామెంట్స్ చేస్తున్నారు. 

 

 

 

 

 

 


Shivakrishna D


Senior Video Editor, Shivakrishna Devasani has been working with major media houses for the last decade and half. He has been chosen as a special editor for senior journalist Satish Babu's signature program- 'Journalist Diary'. He specialises with feature programmes on current affairs and politics. Over the years, he has trained many budding video editors with many of them working now in electronic media.
 skd@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle