newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కరోనా మహమ్మారి ప్రభావం.. కీలక నిర్ణయం తీసుకున్న టీటీడీ

08-04-202108-04-2021 18:54:05 IST
Updated On 08-04-2021 10:28:13 ISTUpdated On 08-04-20212021-04-08T13:24:05.710Z08-04-2021 2021-04-08T02:32:20.181Z - 2021-04-08T04:58:13.343Z - 08-04-2021

కరోనా మహమ్మారి ప్రభావం.. కీలక నిర్ణయం తీసుకున్న టీటీడీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా మహమ్మారి దేశ వ్యాప్తంగా ఉధృతమవుతోంది.. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల క్షేత్రానికి దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. కరోనా వ్యాప్తి మరింత అధికం కాకుండా ఉండేందుకు ఈ నెల 12 నుంచి సర్వదర్శనం టోకెన్లు నిలిపివేయాలని నిర్ణయించింది. సర్వదర్శనం టోకెన్లను ఈ నెల 11 వరకే జారీ చేయనున్నారు. మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనాలు కొనసాగుతాయని టీటీడీ వర్గాలు వెల్లడించాయి.

సర్వదర్శనం టోకెన్లు తిరిగి ఎప్పుడు జారీ చేసే విషయంపై అధికారులు త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారు.  తిరుపతిలో భూదేవి, విష్ణునివాసం కాంప్లెక్స్ లలో సర్వదర్శనం టైమ్ స్లాట్ టోకెన్ల కోసం భక్తులు వేల సంఖ్యలో వేచిచూస్తుంటారు. అలాంటి సమయాల్లో కరోనా మరింతగా వ్యాపించే అవకాశం ఉందని టీటీడీ ఆందోళన చెందుతోంది. ఇక  ఇటీవలి కాలంలో తిరుపతిలోనూ, చిత్తూరు జిల్లాలోనూ కరోనా కేసులు ఉధృతమవుతూ ఉంటే అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. 

ప్రతీ రోజూ తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, విష్ణునివాసంలలో సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్ల కోసం వేల సంఖ్యలో భక్తులు క్యూలైన్లలో వేచి ఉంటున్నారు. దీని వల్ల కరోనా మరింతగా వ్యాప్తి చెందే ప్రమాదముందని.. ఈ పరిస్థితుల్లో భక్తుల ఆరోగ్య భద్రత దృష్ట్యా తీసుకున్న ఈ నిర్ణయాన్ని గమనించాలని టీటీడీ అధికారి ఒకరు మీడియాతో తెలిపారు. 

టీటీడీపై తప్పుడు ప్రచారం.. ఛానల్ పైనా, పోస్టులు పెట్టినవారిపై కేసులు..!

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆర్జిత సేవలకు ఏప్రిల్ 14 నుంచి భక్తులను అనుమతించే నిర్ణయాన్ని టీటీడీ మరోసారి వాయిదా వేసింది. దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో భక్తుల ఆరోగ్య భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. పరిస్థితులు చక్కబడ్డాక ఆర్జిత సేవలకు గృహస్తులను అనుమతించే విషయమై ప్రకటన విడుదల చేస్తామని టీటీడీ అధికారులు తెలిపారు.

గతేడాది మార్చి 20 నుంచి శ్రీవారి ఆర్జిత సేవలకు భక్తులను అనుమతించడం లేదు. కరోనా కారణంగా ఆగిపోయిన ఆర్జిత సేవలు తిరిగి ప్రారంభించాలని టీటీడీ అనుకుంది. ఉగాది నుంచి ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన తిరుప్పావడ, అష్టదళ పాదపద్మారాధన, అభిషేక సేవల్లో భక్తులకు అనుమతించాలని కొద్దిరోజుల కిందట ప్రకటించింది. ఏప్రిల్‌ 14 నుంచి శ్రీవారి ఆర్జిత సేవల్లో భక్తులు పాల్గొనేందుకు అనుమతిచ్చింది. అయితే భారతదేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతూ ఉండడంతో టీటీడీ పునరాలోచించి ఈ నిర్ణయాన్ని రద్దుచేసింది.


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle