అత్తకు గుడి కట్టిన కోడళ్ళు.. ప్రతి నెలా భజనలు, కీర్తనలు
20-01-202120-01-2021 11:21:11 IST
Updated On 20-01-2021 11:19:01 ISTUpdated On 20-01-20212021-01-20T05:51:11.130Z20-01-2021 2021-01-20T05:33:37.500Z - 2021-01-20T05:49:01.174Z - 20-01-2021

నమ్మాలి. 2020 లో ఎన్ని చూడలేదూ ఎన్ని నమ్మలేదు. ఇలాంటివి కొన్ని నమ్మి తీరాలి. ఇదేం కొత్త కాదు. 2020 ఎఫెక్టూ కాదు. 2010లోనే ఈ గుడి కట్టేశారు ఈ కోడళ్లు. మామూలుగా అయితే.. ఏ రీజనూ లేకుండానే శత్రువులు అయిపోతారు అత్తా కోడళ్లు. ఏ కారణం లేకుండానే తిట్టుకుంటారు. ఏ పగా లేకుండానే ప్రతి కారం ప్లాన్స్ లో ఉంటారు. అదేంటో.. అత్తా కోడళ్లు అంటేనే అలా ఉంటుంది ఎవ్వారం. అత్తా కోడళ్లంటే ఇలాగే ఉండాలి అని.. ఏదో రాజ్యాంగంలో రాసినట్లే చేస్తుంటారు. ఇది మామూలుగా ప్రతి ఇంట్లోనూ ఉండేదే. ఏవో కొన్ని ఇళ్లల్లో అలాంటి రచ్చ రంబోలా ఎవ్వారాలు ఉండవు. అయినా సరే.. ఎంతో కొంత ఇష్యూ మాత్రం కచ్చితంగా ఉంటుంది. అత్తా కోడళ్లని అదుపులోకి తీసుకురావడం.. ఇద్దరి భర్తలకీ వీలయ్యే పని కాదు అని అందరికీ తెలిసిందే కదా. కానీ.. చత్తీస్ గఢ్ లో మాత్రం అలా కాదు. బిలాస్ పూర్ జిల్లా కేంద్రం నుంచి 25 కిలోమీటర్ల దూరంలో.. బిలాస్ పూర్- కోర్బా హైవే పక్కన ప్రపంచంలో ఎక్కడా లేని ఈ గుడి ఉంది. నిజమే కదా.. ప్రపంచంలో ఎక్కడైనా ఏ కోడలైనా అత్తకు గుడి కట్టిందా చెప్పండి. కానీ.. రతన్ పూర్ గ్రామంలో గీతాదేవి కోడళ్లు అలాంటి గుడి కట్టారు మరి. అత్తంటే ఎంత ప్రేముండాలి చెప్పండి. అలా అని అత్త అమాయకురాలు కావచ్చు.. ఏమీ తెలీదు కావచ్చు అనుకోవడానికేం లేదు. మంచి నాలెడ్జ్ ఉన్న మహిళే. అయినా సరే.. తెలివితేటలు కోడళ్ల మీద ప్రదర్శించేది కాదంట గీతా దేవి. 11 మంది కోడళ్లని కన్న బిడ్డల్లా చూసుకుందంట. ఏ విషయంలోనూ లోటు లేకుండా చూసుకుందంట. కోడలంటే బిడ్డకంటే ఎక్కువ అనే అభిమానంతో ప్రేమగా చూసుకుందంట. రతన్ పూర్ ఏరియాలో.. గీతా దేవి అంటే.. అందరు అత్తలకీ ఆదర్శం అంట. ప్రతి కోడలూ నాకు కూడా ఇలాంటి అత్త ఉంటే ఎంత బావుండు అని ఫీలయ్యే వారట. మరి బయటి వారికే అంత నచ్చుతుందంటే.. సొంత కోడళ్లకి ఇంకెంత నచ్చుతుందో కదా. అందుకే.. ఆమె చనిపోయిన తర్వాత.. 2010 లో.. హైవే పక్కన గుడి కట్టారు కోడళ్లు. గుళ్లో విగ్రహం పెట్టి.. ఆ విగ్రహాన్ని బంగారు ఆభరణాలతో అలంకరించారు. అప్పుడప్పుడూ బంగారు ఆభరణాలని కూడా మారుస్తూ కొత్తవి తీసుకొస్తారట. అంతేనా.. కట్టి వదిలేయలేదు. ఎప్పుడూ నీట్ గా మేన్ టేన్ చేస్తారట. ప్రతి రోజూ కేర్ తీసుకుంటారట. అంతటితో ఆగలేదు. ప్రతి నెలా అందరు కోడళ్లూ కలిసి వచ్చి.. అత్త భజనలు చేస్తారట. అత్త మీద కీర్తనలు కూడా పాడతారట. అత్తంటే అలా ఉండాలి అనే వాళ్లు అంటుంటే.. కోడళ్లంటే కూడా ఇలా ఉండాలి అనే వాళ్లూ అంటుంటారట.

8 ఏళ్ల బాలుడ్ని మింగిన మొసలి.. పొట్టకోసి బయటికి తీశారు
9 hours ago

అదృష్టమంటే అతడిదే.. 24 కోట్ల రూపాయలు లాటరీలో సొంతం..!
11 hours ago

తిమింగలం కక్కుతో మారిన మహిళ తలరాత.. కోట్లు సొంతం
05-03-2021

రోడ్డుపై ఆగి ఊగుతున్న కారు.. లోపలున్న జంటకి ఫైన్
05-03-2021

హైదరాబాద్ కంటే.. కాకినాడ, కరీంనగర్ బెస్ట్ అట
05-03-2021

కాక్‌పిట్‌లో పైలట్‌పై పిల్లి దాడి.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
04-03-2021

హత్యకు కారణం అమెరికా ప్రయాణమే.. రెండు ప్రాణాలు బలి
04-03-2021

బార్స్ ఇస్తున్నయ్ ఆఫర్స్
03-03-2021

బీరు తాగుతూ కారు డ్రైవింగ్.. కియా పరిశ్రమ ముందు ఘోర యాక్సిడెంట్
02-03-2021

కరోనా వ్యాక్సిన్ వికటించి అంగన్వాడీ కార్యకర్త మృతి
01-03-2021
ఇంకా