టెక్సాస్ లో రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు తెలంగాణ వాసులు మృతి
29-11-202029-11-2020 14:08:29 IST
2020-11-29T08:38:29.539Z29-11-2020 2020-11-29T08:38:25.219Z - - 21-01-2021

అమెరికా లోని టెక్సాస్‌లో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తెలంగాణ వాసులు ప్రాణాలు కోల్పోయారు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. తెలంగాణలోని నారాయణపేట జిల్లా మరికల్ మండలం పెద్దచింతకుంట గ్రామానికి చెందిన నరసింహారెడ్డి, లక్ష్మి దంపతుల పిల్లలు మౌనిక, భరత్ ఇద్దరు టెక్సాస్‌లో ఉద్యోగాలు చేస్తున్నారు. కొన్ని నెలల క్రితం నరసింహారెడ్డి, లక్ష్మి టెక్సాస్‌లోని తమ కొడుకు, కూతురు వద్దకు వెళ్లారు. తమ బంధువుల ఇంట్లో జరిగిన ఓ కార్యక్రమంలో వారు నలుగురు పాల్గొని, తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందులో నరసింహా, లక్ష్మితో పాటు కుమారుడు భరత్ అక్కడికక్కడే మృతి చెందారు. కూతురు మౌనికకు తీవ్ర గాయాలయ్యాయి.
మరికల్ మండలం పెద్దచింతకుంట గ్రామానికి చెందిన నరసింహా రెడ్డి, లక్ష్మి దంపతులకు మౌనిక, భరత్‌లు ఇద్దరు సంతానం. వారి పిల్లలు ఇద్దరు టెక్సాస్‌లో ఉద్యోగం చేస్తూ అక్కడే స్థిరపడ్డారు. ఈ మధ్యనే కూతురు మౌనిక రెడ్డికి అమెరికా లొనే ఉద్యోగం చేస్తున్న వ్యక్తితో సంబంధం కుదరటంతో పెళ్లి కుదుర్చుకోవడానికి వీరు ఫిబ్రవరిలో అమెరికా వెళ్లారు. కరోనా పరిస్ధితుల వల్ల అక్కడే ఉన్నారు. అమెరికా కాలమానం ప్రకారం శనివారం తెల్లవారుజామున నలుగురు వెళ్తున్న కారుకు ప్రమాదం జరిగింది.

మందు బాబులు.. వ్యాక్సిన్ తీసుకునే ముందు ఇది గమనించుండ్రి..!
a day ago

అత్తకు గుడి కట్టిన కోడళ్ళు.. ప్రతి నెలా భజనలు, కీర్తనలు
20-01-2021

కరోనా నుండి కోలుకున్న ప్రతి ఎనిమిది మందిలో ఒకరు చనిపోతున్నారట..!
18-01-2021

అవినీతి కేసులో సీబీఐ అధికారుల సస్పెండ్..
17-01-2021

ఇండోనేషియాలో బారీ భూకంపం.. 42 మంది మృతి
17-01-2021

టీకా వికటిస్తే మాదే బాధ్యత.. పైసా పైసా కట్టేస్తాం
17-01-2021

ఢిల్లీలో 13 ఏళ్ల బాలుడికి హిజ్రాగా శస్త్రచికిత్స..
16-01-2021

తొలి వ్యాక్సిన్ పండగ.. మంత్రి ఈటెలకు నేడే
16-01-2021

ఆన్ లైనా.. ఆఫ్ లైనా.. ఏది బెటర్
15-01-2021

తెలంగాణ ప్రజలకు కంటి మీద కునుకే లేదు
15-01-2021
ఇంకా