newssting
Radio
BITING NEWS :
అమెరికాలోని కుంబా ప్రాంతంలో తుపాకులతో దాడులు. పాఠశాలపై దాడులకు పాల్పడిన దుండగులు. 8 మంది చిన్నారులు దుర్మరణం. ఇంతవరకూ దాడికి గల కారణాలపై నో క్లారిటీ. వేర్పాటువాదుల పనైఉంటుందని అనుమానిస్తున్న పోలీసులు. * ఇంద్రకీలాద్రిపై ఘనంగా దసరా ఉత్సవాలు. ఆఖరిరోజు శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకరణలో దర్శనమిస్తున్న దుర్గమ్మవారు. అమ్మవారి దర్శనం కోసం బారులు తీరిన భక్తులు. * దుర్గమ్మను దర్శించుకున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. దసరా సందర్భంగా విజయవాడలో బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించిన కిషన్ రెడ్డి. రాష్ట్రంలో బీజేపీ బలపడుతుందన్న కేంద్ర మంత్రి. * రానున్న 4 రోజుల్లో ఏపీకి భారీ వర్షాలు. * సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయం వద్ద పేలుడు. ఆలయం సమీపంలోని చెత్తకుప్పలో పేలిన పెయింట్ డబ్బా, వ్యక్తికి గాయాలు. * వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం బుద్దారం గ్రామంలో విషాదం. భారీ వర్షాలకు నానిపోయిన ఇంటి పై కప్పు కూలి ఐదుగురు దుర్మరణం, ఇద్దరికి తీవ్రగాయాలు. * తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్.

ఐటీ ఉద్యోగాలకు ‘టీసీఎస్’‌ పరీక్ష.. 40 వేల ఉద్యోగాలు

28-09-202028-09-2020 10:32:57 IST
2020-09-28T05:02:57.322Z28-09-2020 2020-09-28T05:02:55.809Z - - 25-10-2020

ఐటీ ఉద్యోగాలకు ‘టీసీఎస్’‌ పరీక్ష.. 40 వేల ఉద్యోగాలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
యువతకు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం అంటే ఎంత మక్కువో మనందరికి తెలిసిందే. అయితే టాప్‌ కాలేజీలలో మాత్రమే క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లు నిర్వహిస్తుంటారు. కొన్న కాలేజీలలో క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లు ఉండవు. అలా ప్రతిభ గల విద్యార్థుల కోసం దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్‌ ఉద్యోగాలకు అర్హత కల్పించే నేషనల్‌ క్వాలిఫయర్‌ టెస్ట్‌, (ఎన్‌క్యూటీ)ను 2018 నుంచి ప్రతి సంవత్సరం నిర్వహిస్తుంది. తాజాగా 2020 సంవత్సరం ఎన్‌క్యూటీ పరీక్షను త్వరలోనే నిర్వహించనున్నట్లు ప్రకటించింది.

కాగా ఎంట్రీ లెవల్‌ ఉద్యోగాల కోసం అభ్యర్థులకు కంపెనీలు ఆశించే కాగ్నిటివ్‌ ఎబిలిటీస్‌ను ఎన్‌క్యూటీ ఎగ్జామ్‌లో పరీక్షించనున్నారు. అయితే అభర్థి ప్రతిభను గుర్తించే విధంగా తమ పరీక్ష ఉంటుందని, పరీక్షలో మెరుగైన స్కోర్‌ సాధిస్తే టాప్‌ కంపెనీలో ఉద్యోగం గ్యారెంటీ అని టీసీఎస్‌ అయాన్‌ గ్లోబల్‌ హెడ్‌ వెంగుస్వామి రామస్వామి తెలిపారు. మరోవైపు టాప్‌ కంపెనీలు అభ్యర్థుల నియామకాలకు తమ పరీక్ష స్కోర్‌ను ప్రామాణికంగా తీసుకుంటున్నట్లు వెంగుస్వామి పేర్కొన్నారు.

బీటెక్‌, బీఎస్సీ, బీఈ, ఎంఈ, ఎంటెక్‌, ఎమ్మెస్సీ తదితర కోర్సులు పూర్తి చేసిన వారు లేక ఫైనల్‌ ఇయర్‌ పరీక్షలు పూర్తి చేసి, ఫలితాల కోసం నిరీక్షిస్తున్న వారు ఎన్‌క్యూటీ పరీక్షకు అప్లై చేసుకోవచ్చు. ఉద్యోగ నియామకాల కోసం రెండు సంవత్సరాల వరకు ఎన్‌క్యూటీ పరీక్ష స్కోర్‌ను కంపెనీలు అనుమతిస్తాయి.

టీసీఎస్‌లో 40 వేల ఉద్యోగాలు

దేశీయ అతిపెద్ద ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్‌)  శుభవార్త అందించింది. పెద్ద సంఖ్యలో ఫ్రెషర్లను నియమించుకోవాలని యోచిస్తోంది. క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్  ద్వారా ఏకంగా 40 వేల మందికి  ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నామని ప్రకటించింది. కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ సంక్షోభ మధ్య జూన్ క్వార్టర్‌లో కంపెనీ ఆదాయం గణనీయంగా తగ్గినప్పటికీ  ఈ నిర్ణయం తీసుకోవడం  విశేషం.

ఇండియాలో 40 వేలమంది లేదా 35-45 వేల మధ్య అభ్యర్థులను ఎంపిక చేస్తామని టీసీఎస్‌ గ్లోబల్ హెచ్ఆర్‌డీ హెడ్ మిలింద్ లక్కాడ్ వెల్లడించారు. వీరిలో 87శాతం మంది తమ లెర్నింగ్‌ ప్లాట్‌ఫాంలలోయాక్టివ్‌గా ఉన్నారని చెప్పారు. వారానికి 8 నుంచి 11 వేల మందిని ఆన్‌లైన్‌ ద్వారా ఎంపిక చేయనున్నట్టు వివరించారు. ఫ్రెషర్లతోపాటు అనుభవం కలిగిన ప్రొఫెషనల్స్‌ను కీలక ఉద్యోగాలకు ఎంపిక చేస్తామని లక్కాడ్ తెలిపారు.

అయితే దేశీయంగా గత ఏడాది మాదిరిగానే 40వేల మందిని ఎంపిక చేయనున్న టీసీఎస్‌ అమెరికాలో నియామకాలను మాత్రం దాదాపు రెట్టింపు చేయనుంది. హెచ్1బీ, ఎల్ 1 వర్క్ వీసాలపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని చూస్తున్న కంపెనీ ఈ  నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2 వేల మందిని నియమించుకోవాలని నిర్ణయించింది. అలాగే అమెరికాలో టాప్ 1 బిజినెస్‌ స్కూల్స్ నుంచి గ్రాడ్యుయేట్లను కూడా నియమించుకోనుంది.  కాగా టీసీఎస్ 2014 నుంచి 20 వేల మందికి పైగా అమెరికన్లను టీసీఎస్‌ నియమించుకుంది.

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle