మిర్చి తోటలో 'కాజల్.. తమన్నా'...
07-01-202107-01-2021 18:24:20 IST
Updated On 07-01-2021 16:21:30 ISTUpdated On 07-01-20212021-01-07T12:54:20.855Z07-01-2021 2021-01-07T10:02:46.941Z - 2021-01-07T10:51:30.516Z - 07-01-2021

పొలానికి దిష్టి తగలకుండా ఏం చేస్తారు..దిష్టిబొమ్మలని కడతారు అంటారా..కానీ ఓ రైతు వినూత్నంగా ప్రయత్నించాడు..దిష్టిబొమ్మలకి బదులుగా సినీ తారల కట్ అవుట్ లని పొలంలో పెట్టేశాడు ఏకంగా. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ. మరి ఇది ఎక్కడ జరిగిందో తెలుసా తెలంగాణ జిల్లాలో. సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం చందలపూర్ గ్రామానికి చెందిన రైతు చంద్రమౌళి ఇలా కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టాడు. చంద్రమౌళికి రెండు ఎకరాల భూమి ఉంది. ఇందులో ప్రతీ సంవత్సరం మిర్చి తోట వేస్తున్నాడు. కాగా కరెక్టుగా పంట చేతికి వచ్చే సమయానికే ఏదో ఒక తెగులు సోకి పంట నష్టంపోతున్నాడీ రైతు. ఇలా రెండు మూడేళ్లు జరిగేసరికి.. తోటకు నరదిష్టి తగిలిందని భావించాడు చంద్రమౌళి. బాగా ఆలోచించి.. మిర్చితోటకు దిష్టిపోయే మార్గం కనుగొన్నాడు. దిష్టిబొమ్మలు పెట్టడం ద్వారా.. నర దిష్టికి చెక్ పెట్టాలనుకున్నాడు రైతు. అయితే.. గడ్డితో చేసే దిష్టిబొమ్మతో నరదిష్టి ప్లాన్ వర్కవుట్ కాదనుకున్నాడో ఏమో.. మనుషుల బొమ్మలు పెట్టేశాడు. అదికూడా.. సాధారణ మనుషుల బొమ్మలు ఎవరు చూస్తారులే అనుకున్నట్టున్నాడు.. ఏకంగా సినీ తారలను దింపేశాడీ రైతు. అది కూడా వాళ్లనీ వీళ్లనీ కాదండోయ్.. జనాల్లో ఫుల్లు ఫేమ్ ఉన్న స్టార్ హీరోయిన్లనే తోటకు రప్పించాడు రైతు చంద్రమౌళి. టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ తమన్నా ..కాజల్ నిలువెత్తు ఫ్లెక్సీలను తయారు చేయించి తోటలో నిలబెట్టాడు. అంటే.. ఇప్పుడు తోటను ఎవరూ పట్టించుకోకుండా.. హీరోయిన్ల బొమ్మలను చూస్తూ వెళ్తారన్న మాట. ఆ విధంగా దిష్టికళ్ల నుంచి తన తోట తప్పించుకుంటుందన్న మాట. ఇదీ.. సదరు రైతు ప్లాన్. ఈ ఫొటోలను చూసిన పలువురు.. అందాల తారల్ని దిష్టిబొమ్మల్ని చేశాడేంటయ్యా అనుకుంటుండగా.. తోటకు అందాన్ని తెచ్చాడులే అనుకుంటున్నారు మరికొందరు. మొత్తానికి.. ఈవెంట్లలో లక్షలాది రూపాయలు తీసుకొని షో చేసే హీరోయిన్లు.. సిద్ధిపేట రైతు తోటలో మాత్రం ఫ్రీగా దిష్టితీసి పెడుతున్నారన్నమాట. ఐడియా జీవితాన్నే మారుస్తుందన్నట్టుగా ఈ ఐడియాతో రైతు పొలానికి దిష్టి పోతుందో లేదో తెలియదు గాని వార్తల్లోకి మాత్రం ఎక్కేశాడీ రైతు. కోతులను తరమాలని అనుకున్న సాఫ్ట్ వేర్ ఇంజనీర్.. ప్రాణాలనే పోగొట్టుకున్నాడు...

గన్ గురిపెట్టి.. ముత్తూట్ ఫైనాన్స్ నుండి 7కోట్ల విలువైన బంగారం చోరీ
16 hours ago

హైదరాబాద్ బిర్యానీ తింటున్నారా.. తస్మాత్ జాగ్రత్త
22-01-2021

డ్రాగన్ ఫ్రూట్ బన్ గయా 'కమలం'
22-01-2021

మూడంగుళాల ఎత్తు పెరగడానికి రూ. 55 లక్షల ఖర్చు..
21-01-2021

పిడకలు అమ్మడం, రేటు కాదు.. దాని రివ్యూ ఇంట్రస్టింగ్
21-01-2021

మందు బాబులు.. వ్యాక్సిన్ తీసుకునే ముందు ఇది గమనించుండ్రి..!
20-01-2021

అత్తకు గుడి కట్టిన కోడళ్ళు.. ప్రతి నెలా భజనలు, కీర్తనలు
20-01-2021

కరోనా నుండి కోలుకున్న ప్రతి ఎనిమిది మందిలో ఒకరు చనిపోతున్నారట..!
18-01-2021

అవినీతి కేసులో సీబీఐ అధికారుల సస్పెండ్..
17-01-2021

ఇండోనేషియాలో బారీ భూకంపం.. 42 మంది మృతి
17-01-2021
ఇంకా